News
News
X

Obesity: జుట్టు పలుచబడటానికి ఊబకాయం కూడా కారణమే... తేల్చిన పరిశోధన

రోజూ ఎంతో కొంత జుట్టు ఊడడం సాధారణం. కానీ ఊబకాయంతో బాధపడుతున్న వారికి జుట్టు ఊడితే మాత్రం... దానికి కారణం అధిక బరువు కారణం కావచ్చంటున్నారు పరిశోధకులు.

FOLLOW US: 

ఊబకాయం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయని అందరికీ తెలిసిందే.  అధిక బరువు వల్ల మధుమేహం, గుండె జబ్బులు వంటి ఆరోగ్యసమస్యలే కాదు, జుట్టు పలుచబడడం కూడా జరుగుతుంది. ఓ కొత్త పరిశోధన ద్వారా ఈ విషయాన్ని తేల్చారు శాస్త్రవేత్తలు. జపాన్ లోని టోక్యో మెడికల్ అండ్ డెంటల్ యూనివర్సిటీలో ఈ పరిశోధన సాగింది. ఎలుకలపై శాస్త్రవేత్తలు ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. 

ప్రయోగం కోసం ఎలుకలను రెండు గ్రూపులుగా విభజించారు. మొదటి గ్రూపులోని ఎలుకలకు కొవ్వు అధికంగా ఉండే ఆహారాన్ని ఇచ్చారు. రెండో గ్రూపులోని ఎలుకలకు మాత్రం సాధారణంగా అవి తినే పదార్థాలనే పెట్టారు. కొన్ని రోజుల తరువాత కొవ్వు పదార్థాలు తిన్న ఎలుకలు అసామాన్యంగా బరువు పెరిగాయి. వాటి చర్మం మీద జుట్టు పలుచబడడం గుర్తించారు పరిశోధకులు. వెంట్రుకలు రాలడం ఎక్కువైంది. అదే సాధారణ ఆహారం తీసుకుంటున్న ఎలుకల్లో ఎలాంటి మార్పు లేదు. దీన్ని బట్టి ఊబకాయం వల్ల జుట్టు పలుచబడుతుందని తేల్చారు. కొవ్వు వెంట్రుకలు ఎదిగే రంధ్రాలను పూడ్చేస్తుందని, అందుకే జుట్టు ఎదుగుదల లేక రాలిపోతుందని పరిశోధన సారాంశం. 

ఊబకాయానికి, జుట్టు ఊడిపోవడానికి మధ్య సంబంధం ఉందని కేవలం ఈ తాజా పరిశోధనే కాదు, గతంలో కూడా ఓ అధ్యయనం తేల్చింది. 2013లో అమెరికాలో జరిగిన అధ్యయనంలో 30 ఏళ్లు దాటిన 189 మంది ఊబకాయులపై పరిశోధన చేశారు. వారందరిలో కూడా జుట్టు ప్యాచులుగా ఊడిపోవడాన్ని గుర్తించారు. బరువు తగ్గితే జుట్టు మళ్లీ సాధారణ స్థితికి వచ్చేస్తుంది. కాకపోతే బరువు తగ్గడానికే చాలా సమయం పడుతుందని అంటున్నారు అధ్యయనకర్తలు.

జుట్టు ఎదుగుదలకు తినాల్సిన పదార్థాలు...
1. గుడ్లు
2. మాంసం
3. జీడిపప్పు, బాదం, పిస్తా వంటి నట్స్
4. ఫ్యాటీ ఫిష్
5. పాలకూర
6. బెర్రీ పండ్లు
7. చిలగడదుంపలు
8. రొయ్యలు
9. సోయాబీన్స్

News Reels

ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీ డైట్‌కు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Also read: అలాంటి తల్లులకు శుభవార్త.. వారి పాలల్లో పది నెలల పాటూ యాంటీ బాడీలు, బిడ్డలకు రక్ష

Also read: ఈ ఆహారాలు క్యాన్సర్ కారకాలుగా మారచ్చు... జాగ్రత్త పడండి

Also read: ఇంట్లో దోమలు ఎక్కువయ్యాయా... వెల్లుల్లితో తరిమికొట్టండి

Published at : 28 Sep 2021 03:50 PM (IST) Tags: Hair Fall Obesity New study Fat diet

సంబంధిత కథనాలు

Dental Care: టూత్ పేస్ట్ లేకుండా బ్రష్ చెయ్యొచ్చా? నిపుణులు ఏం సూచిస్తున్నారు?

Dental Care: టూత్ పేస్ట్ లేకుండా బ్రష్ చెయ్యొచ్చా? నిపుణులు ఏం సూచిస్తున్నారు?

అల్ బుకరా పండ్లు కనిపిస్తే కచ్చితంగా తినండి, ఈ సమస్యలనీ దూరం అయిపోతాయి

అల్ బుకరా పండ్లు కనిపిస్తే కచ్చితంగా తినండి,  ఈ సమస్యలనీ దూరం అయిపోతాయి

Kids: శీతాకాలంలో పిల్లలకి కచ్చితంగా పెట్టాల్సిన ఆహారాలు ఇవే

Kids: శీతాకాలంలో పిల్లలకి  కచ్చితంగా పెట్టాల్సిన ఆహారాలు ఇవే

Hair Care: కరివేపాకులతో ఇలా చేస్తే జుట్టు సమస్యలు దూరం

Hair Care: కరివేపాకులతో  ఇలా చేస్తే జుట్టు సమస్యలు దూరం

Ragi Cake: మధుమేహుల కోసం రాగిపిండి కేకు, ఇంట్లోనే ఇలా చేయండి

Ragi Cake: మధుమేహుల కోసం రాగిపిండి కేకు, ఇంట్లోనే ఇలా చేయండి

టాప్ స్టోరీస్

YS Jagan: రాజ్యాంగం స్ఫూర్తితో 35 నెలల పాలనలో ఏపీలో ఎన్నో మార్పులు: సీఎం జగన్

YS Jagan: రాజ్యాంగం స్ఫూర్తితో 35 నెలల పాలనలో ఏపీలో ఎన్నో మార్పులు: సీఎం జగన్

Attack on TDP leader: నెల్లూరులో దారుణం, సిటీ టీడీపీ ఇన్ ఛార్జ్‌పై కారుతో దాడి

Attack on TDP leader: నెల్లూరులో దారుణం, సిటీ టీడీపీ ఇన్ ఛార్జ్‌పై కారుతో దాడి

Konaseema District: చేపల వేట హద్దుల కోసం Boat Race, ఎంచక్కా వీడియో వీక్షించండి

Konaseema District: చేపల వేట హద్దుల కోసం Boat Race, ఎంచక్కా వీడియో వీక్షించండి

Manjima Mohan Pre Wedding Pics: హీరో హీరోయిన్ల ప్రీ వెడ్డింగ్ ఫొటోలు ట్రెండింగ్ , మీరు ఓ లుక్కేయండి

Manjima Mohan Pre Wedding Pics: హీరో హీరోయిన్ల ప్రీ వెడ్డింగ్ ఫొటోలు ట్రెండింగ్ , మీరు ఓ లుక్కేయండి