అన్వేషించండి

First Night Fear In Men: మీకు తెలుసా? ఫస్ట్ నైట్ అంటే పురుషులకు కూడా భయమే, కారణాలివే!

ఫస్ట్ నైట్ అంటే అమ్మాయిలు మాత్రమే భయపడతారని అనుకుంటారు. కానీ, అసలైన భయం పురుషుల్లోనే ఎక్కువ. ఇందుకు 5 ప్రధాన కారణాలున్నాయి. అవేంటో చూసేయండి మరి.

First Night Fear In Men | పెళ్లి తర్వాత తొలి అనుభవం తీయని అనుభూతి. అందుకే కొందరు తమ తొలిరాత్రి గురించి ఎన్నో కలలుగంటారు. అదే సమయంలో వారిలో కొన్ని భయాలు కూడా వెంటాడుతుంటాయి. ముఖ్యంగా అమ్మాయిల్లో తెలియని ఆందోళన నెలకొంటుంది. ఆ తీపి అనుభవం చేదు జ్ఞాపకంగా మిగిలిపోతుందనే భయం వారిని వెంటాడుతుంది. అందుకే చాలామంది అమ్మాయిలు తొలిరాత్రి రోజు బిడియాన్ని ప్రదర్శిస్తారు. ప్రేమ పెళ్లిలైతే ఒకే, కానీ.. పెద్దల కుదిర్చిన సంబంధమైతే మాత్రం ఆ రోజు ఒక గండంలా కనిపిస్తుంది. అయితే, ఈ భయం కేవలం అమ్మాయిల్లోనే ఉంటుందని అనుకుంటే పొరపాటే. అబ్బాయిల్లో కూడా చెప్పుకోలేనంత ఆందోళన ఉంటుంది. ఆ అనుభవం కోసం ఎదురుచూస్తున్నట్లు కనిపిస్తున్నా.. ఏదో తెలియని సందేహాలు వారి బుర్రను తొలిచేస్తుంటాయి. 

తాజాగా తెనాలి చెంచుపేటకు చెందిన 25 ఏళ్ల కిరణ్ కుమార్ అనే యువకుడి ఆత్మహత్య ఘటనే నిదర్శనం. తొలిరాత్రిపై అతడికి ఉన్న భయం.. బలవన్మరణానికి దారితీసింది. ఓస్, ఫస్ట్ నైట్‌కు భయపడే ప్రాణాలు తీసేసుకుంటారా? అనే మీకు సందేహం కలగవచ్చు. కానీ, కొందరు దాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంటారు. ముఖ్యంగా లైంగిక అవహన, మూఢ నమ్మకాలను నమ్మే వ్యక్తులు ఈ విషయంలో చాలా సెన్సటివ్‌గా ఉంటారు. తమ లైంగిక సామర్థ్యంపై సందేహాలున్నా సరే.. వారు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చెప్పలేం. 

మహిళల్లో ఎక్కువగా.. సంభోగం వల్ల కలిగే నొప్పి, మానసికంగా తనను ఇంకా అర్థం చేసుకోని వ్యక్తితో కలయిక, తొలిరాత్రి రక్తం కారకపోతే ఎక్కడ అనుమానిస్తారనే భయం ఇంకా ఎన్నో వారి భయానికి కారణమవుతాయి. ఇక పురుషుల విషయానికి వస్తే.. తమ లైంగిక సామర్థ్యం, సెక్స్ భంగిమలు, స్ఖలన సమస్యలు, తన భార్యను భావోద్వేగానికి గురిచేయగలనా, విఫలమవుతానా అనే భయాలు వెంటాడుతుంటాయి. లైంగిక చర్యల్లో అనుభవజ్ఞులకు ఇది పెద్ద లెక్క కాకపోవచ్చు. కానీ, ఫస్ట్ టైమ్ శృంగారంలో పాల్గొనే పురుషులకు మాత్రం అది పెద్ద సవాలే.

సెక్సాలజిస్టులు తెలిపిన వివరాల ప్రకారం.. పురుషులు ఎల్లప్పుడూ సెక్స్‌లో తామే ఛాంపియన్స్ కావాలని భావిస్తారు. అది వారి అహానికి సంబంధించిన విషయం. అందుకే, పడగ గదిలో విఫలమవ్వాలని కోరుకోరు. అందుకే సెక్స్‌లో తమ పనితీరు ఎలా ఉంటుందనే ఆందోళన వారిని వెంటాడుతుంది. ఇది ఒక రకంగా సెక్స్ సామర్థ్యంపై ప్రభావం చూపుతుంది. ఆ ఆందోళన వల్ల వారికి సామర్థ్యం ఉన్నా సరే సంతృప్తిగా శృంగారంలో పాల్గోలేరు. ముఖ్యంగా తాము తమ స్త్రీని భావోద్వేగానికి గురిచేయగలమా లేదా అనే ఆందోళనతో ఉంటారు. ఒక వేళ ఆమె సంతృప్తి పడకపోతే.. తాను విఫలమైనట్లేనని భావిస్తారు. ఇలాంటి సందేహాలు ఉన్నప్పుడు తమ భాగస్వామితో శరీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఒక్కటి కావాలి. ఆమె కూడా మీతో సమానంగా సెక్స్‌లో పాల్గొనే కంఫర్ట్ జోన్‌ను సృష్టించాలి. సెక్స్ చేస్తున్నప్పుడు, ప్రశాంతంగా, రిలాక్స్‌గా ఉండాలి. ఫోర్‌ప్లేలో మునిగిపోవాలి. ఆమె కోరినట్లుగా చేసే ప్రతి పని ఆమెను మెప్పిస్తుంది.

పురుషులను వెంటాడే భయాలు ఇవే:

1. ఆమెను సంతృప్తి పరచగలనా?: పురుషుల్లో ముఖ్యంగా తమ మర్మాంగం గురించి సందేహాలుంటాయి. తన భార్య లేదా భాగస్వామిని సంతృప్తిపరచడానికి తన సైజు సరిపోతుందా లేదా అనే సందేహం ఉంటుంది. ఆమె కోరుకున్న విధంగా ఆమెకు ఆనందాన్ని ఇవ్వలేకపోతే ఏమిటని చింతిస్తూ ఉంటారు. అది తన అహాన్ని ప్రేరేపిస్తుంది. ఒకవేళ తాను సెక్స్‌ తగినట్లుగా చేయకపోతే మరొకరిని ఆశ్రయిస్తుందనే ఆందోళన పురుషుడిని వెంటాడుతుంది. అలాగే ‘ఫస్ట్ నైట్’ అనేగానే పెద్దల దృష్టంతా ఆ పడకగది వైపే ఉంటుంది. కొందరైతే ఫస్ట్ నైట్ తర్వాతి రోజు అబ్బాయి ‘పనితీరు’ గురించి అడుగుతారు. ఇలాంటివి అబ్బాయిలకు కాస్త ఇబ్బంది కలిగించేవే. అందుకే, ‘ఫస్ట్ నైట్’ అంటే కొందరు పురుషులకు ఎక్కడాలేని భయం పట్టుకుంటుంది. అయితే నిపుణులు సూచనల ప్రకారం.. స్త్రీ కేవలం అంగ ప్రవేశం ద్వారా మాత్రమే సంతృప్తి చెందుతుందని అనుకుంటే పొరపాటని, ఆమెను ఆనందింపచేసే సున్నితమైన భాగాలు ఇంకా చాలానే ఉన్నాయని చెబుతున్నారు. అంగ పరిమాణం గురించి ఆలోచించకుండా.. ఫోర్ ప్లే ద్వారా మెప్పిస్తూ అంగ ప్రవేశం చేసినట్లయితే ఆమె తప్పకుండా సంతృప్తి చెందుతుందని చెబుతున్నారు.  

2. శీఘ్ర స్కలనం: పురుషులను వెంటాడే మరో సమస్య అకాల స్కలనం లేదా శీఘ్ర స్ఖలనం. కొంతమంది పురుషులు స్త్రీలను నగ్నంగా చూడగానే తీవ్ర ఉద్వేగానికి గురవ్వుతారు. అంగ ప్రవేశం చేసిన కొన్ని సెకన్లలోనే స్కలిస్తారు. ఫలితంగా తాము ఎక్కువ సేపు సెక్స్ చేయలేమనే భయం వారిని వెంటాడుతుంది. శీఘ్ర స్కలన సమస్య వల్ల తన భాగస్వామిని సంతృప్తి పొందలేదనే ఆందోళనతో వారు మరింత కుమిలిపోతారు. అయితే, మీకు శీఘ్ర స్కలన సమస్య ఉందో లేదో తెలుసుకోవాలంటే చిన్న టెస్టు పెట్టుకోండి. మీరు ఒక్క నిమిషంపాటు స్కలించకుండా ఉండగలిగితే మీకు ఆ సమస్య లేనట్లే. సెకన్ల వ్యవధిలో స్కలిస్తుంటే మాత్రం మీరు వైద్యుడిని సంప్రదించాలి. అకాల స్కలనం వల్ల తమ భాగస్వామిని ఎక్కువసేపు థ్రిల్ చేయడం లేదనే మానసిక ఆందోళన లైంగిక ఒత్తిడిని పెంచుతుంది. ఆ భయం వల్ల పురుషులు సెక్స్‌కు దూరమవుతుంటారు. పెళ్లి కాని యువకులు చాలామంది దీని గురించే ఆలోచిస్తుంటారు. ఒక వేళ అలా జరిగితే? అని సందేహిస్తారు. వారు ఎట్టిపరిస్థితిలో ఆ విషయాన్ని ఆలోచించకూడదు. మైదానంలోకి దిగే ఆటగాడు ఓటమి గురించి ఆలోచిస్తే విజయాన్ని సాధించలేడు. ఈ రూల్ బెడ్ రూమ్‌కు కూడా వర్తిస్తుంది. 

3. గర్భవతిని చేయగలనా?: సెక్స్ చేసిన వెంటనే పిల్లలు పుట్టేయాలని అనుకోవడం అమాయకత్వమే అవుతుంది. మొదటి సెషన్‌లోనే తన భాగస్వామి గర్భవతి కావాలని కోరుకోకూడదు. దాన్ని మనసులో పెట్టుకుని సెక్సులో పాల్గొంటే.. ఆనందం కంటే ఆందోళనే ఎక్కువగా ఉంటుంది. పిల్లలు పుట్టాలంటే.. పనిగట్టుకుని సెక్స్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పటిలాగానే ఒకరితో ఒకరు ప్రేమగా వ్యవహరిస్తూ సెక్స్ ఎంజాయ్ చేస్తే చాలు. మహిళలు కొన్ని కిటుకులు పాటించడం ద్వారా వీర్యాన్ని యోనిలోకి ప్రవేశించేలా చేసుకోవచ్చు. పురుషుడే తన వీర్యాన్ని లోపలి వరకు చేర్చాలనే టార్గెట్లు ఏమీ పెట్టుకోకూడదు. మీ భార్య లేదా భాగస్వామి గర్భం దాల్చడం లేదంటే మీరు నపుంసకులని అర్థం కాదు. ప్రస్తుతం సమాజంలో ఇదే ఆలోచన ఉంటుంది. అది పురుషులను మరింత భయాందోళనలకు గురిచేస్తుంది. సెక్స్‌లో ఛాంపియన్స్‌లా రెచ్చిపోయే పురుషుడు కూడా తమ భాగస్వామిని గర్భవతి చేయడానికి కొన్నాళ్లు వేచి చూడాల్సి ఉంటుంది. కాబట్టి, ఆ ఆలోచనను పూర్తిగా మీ మనసులో నుంచి తొలగించండి. స్పెర్మ్ సమస్యలుంటే చికిత్స చేయొచ్చు. దాని గురించి చింతించాల్సిన అవసరం లేదు.

Also Read: హథవిధీ, జైల్లోనే ‘తొలిరాత్రి’ - కారణం తెలిస్తే, మీరు షాకవ్వడం ఖాయం!

4. పోర్న్ వేరు, రియల్ లైఫ్ వేరు: పురుషులు లైంగిక అవగాహన కోసం పోర్న్ వీడియోలు చూస్తుంటారు. అందులో పురుషులకు ఉండే సైజులను తమతో పోల్చుకుంటారు. పైగా ఆ వీడియోల్లో పోర్న్ స్టార్స్ చేసే ‘అరుపులు’ నిజమని భావిస్తారు. నిజ జీవితంలో కూడా తమ భాగస్వామిని అలాగే కేకపెట్టించాలని అనుకుంటున్నారు. వాస్తవం ఏమిటంటే.. కొందరు స్త్రీలో తమ భావోద్వేగాలను మనసులోనే ఉంచుకుంటారు. ముఖ్యంగా భారతీయ స్త్రీలు ఆ స్థాయిలో అరుపులు, కేకలతో రచ్చ చేయాలని అనుకోరు. తమ లైంగిక ఆనందాన్ని నెమ్మదిగా మూలుగుతూ వ్యక్తం చేస్తారు. పోర్న్ వీడియోల్లో మహిళల్లా తన భాగస్వామి అరవకపోతే.. తనలో ఏదో లోపం ఉందని పురుషులు అనుకుంటారు. కానీ, ఎప్పుడూ భావించకూడదు. పోర్న్ వీడియోలతో మీ స్త్రీలను అస్సలు పోల్చి చూడవద్దు. 

Also Read: ‘ఫస్ట్‌ నైట్’ బెడ్‌ను రోజా పూలతోనే అలంకరించాలట.. ఎందుకో తెలుసా?

5. హస్తప్రయోగం వల్ల నష్టం లేదు: చాలామంది పురుషులు పెళ్లికి ముందు హస్త ప్రయోగం ద్వారా లైంగిక తృప్తి పొందుతారు. అయితే, హస్త ప్రయోగం అలవాటు వల్ల తమ భాగస్వామితో సెక్స్ చేయలేమనే భయం పురుషుల్లో ఉంటుంది. అందుకే పెళ్లి తర్వాత.. తమ లైంగిక సామర్థ్యంపై వారికి లేనిపోని సందేహాలు ఏర్పడతాయి. హస్త ప్రయోగం వల్ల సెక్స్‌కు ఎలాంటి ప్రమాదం లేదని అధ్యయనాలు, పరిశోధకులు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. హస్త ప్రయోగం వల్ల సెక్స్ లైఫ్‌కు ఎలాంటి ఆటంకం ఉండబోదు. పైగా ఎక్కువ సేపు సెక్స్ చేయడానికి హస్త ప్రయోగం ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, మీరు ఎప్పుడూ ఫస్ట్ నైట్ గురించి చింతించాల్సిన అవసరం లేదు. మీ భాగస్వామితో పరిచయం పెంచుకుని, మనసులు కలిసిన తర్వాతే తొలి అనుభూతిని పొందండి. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy - Tollywood: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులు వీళ్లే...‌‌ సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలు ఏమిటంటే?
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులు వీళ్లే...‌‌ సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలు ఏమిటంటే?
Crime News: కామారెడ్డి జిల్లాలో కలకలం - చెరువులో శవాలుగా ఎస్సై, లేడీ కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్, అసలేం జరిగిందంటే?
కామారెడ్డి జిల్లాలో కలకలం - చెరువులో శవాలుగా ఎస్సై, లేడీ కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్, అసలేం జరిగిందంటే?
Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Heart Attack: క్రిస్మస్ సెలవుల కోసం సొంతూరికి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ - స్నేహితులతో క్రికెట్ ఆడుతుండగా తీవ్ర విషాదం
క్రిస్మస్ సెలవుల కోసం సొంతూరికి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ - స్నేహితులతో క్రికెట్ ఆడుతుండగా తీవ్ర విషాదం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

MS Dhoni Christmas Santa | జివా అడిగితే ధోనీ చేయకుండా ఉంటాడా | ABP DesamChiranjeevi Meeting CM Revanth Reddy | సినీ పరిశ్రమ సమస్యలపై సీఎంతో భేటీ | ABP Desamకశ్మీర్‌లో మంచు చూశారా? డ్రోన్ విజువల్స్బ్రెజిల్‌లోని జీసెస్ కాకినాడకు దగ్గర్లో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy - Tollywood: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులు వీళ్లే...‌‌ సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలు ఏమిటంటే?
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులు వీళ్లే...‌‌ సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలు ఏమిటంటే?
Crime News: కామారెడ్డి జిల్లాలో కలకలం - చెరువులో శవాలుగా ఎస్సై, లేడీ కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్, అసలేం జరిగిందంటే?
కామారెడ్డి జిల్లాలో కలకలం - చెరువులో శవాలుగా ఎస్సై, లేడీ కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్, అసలేం జరిగిందంటే?
Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Heart Attack: క్రిస్మస్ సెలవుల కోసం సొంతూరికి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ - స్నేహితులతో క్రికెట్ ఆడుతుండగా తీవ్ర విషాదం
క్రిస్మస్ సెలవుల కోసం సొంతూరికి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ - స్నేహితులతో క్రికెట్ ఆడుతుండగా తీవ్ర విషాదం
Errolla Srinivas: బీఆర్ఎస్ సీనియర్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్ట్ - తీవ్ర ఉద్రిక్తత, పోలీస్ రాజ్యమంటూ హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం
బీఆర్ఎస్ సీనియర్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్ట్ - తీవ్ర ఉద్రిక్తత, పోలీస్ రాజ్యమంటూ హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం
Nandyal  News:   కొడుకు ట్రాన్స్ జెండర్ లవ్ - తల్లిదండ్రుల ఆత్మహత్య -  వాళ్ల నిర్ణయం కరెక్టేనా ?
కొడుకు ట్రాన్స్ జెండర్ లవ్ - తల్లిదండ్రుల ఆత్మహత్య - వాళ్ల నిర్ణయం కరెక్టేనా ?
AP Telangana Latest Weather Updates: తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం- పంట నష్టపోయి తలపట్టుకున్న రైతులు- చలితో వణికిపోతున్న జనం 
తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం- పంట నష్టపోయి తలపట్టుకున్న రైతులు- చలితో వణికిపోతున్న జనం 
Deadbody Parcel: 'చేప దొరికిందా?' - శవం దొరకలేదని అమాయకున్ని చంపేశారా?, చెక్క పెట్టెలో డెడ్ బాడీ వెనుక అంతుచిక్కని ప్రశ్నలెన్నో?
'చేప దొరికిందా?' - శవం దొరకలేదని అమాయకున్ని చంపేశారా?, చెక్క పెట్టెలో డెడ్ బాడీ వెనుక అంతుచిక్కని ప్రశ్నలెన్నో?
Embed widget