News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Wedding Night In Jail: హథవిధీ, జైల్లోనే ‘తొలిరాత్రి’ - కారణం తెలిస్తే, మీరు షాకవ్వడం ఖాయం!

అప్పుడే వారికి పెళ్లయ్యింది.. ఆ వెంటనే జైలుకు వెళ్లారు. అక్కడే ఆ రాత్రంతా గడిపారు. చాలా రొమాంటిక్‌గా ఉంది కదా. కానీ, ఇందులో మీరు ఊహించని ట్విస్ట్ ఉంది.

FOLLOW US: 
Share:

Scotland | వారిద్దరికీ పెళ్లయ్యింది. కానీ, తొలి రాత్రి మాత్రం జైల్లో గడిచింది. ‘‘Wow, How Romantic’’ అని మాత్రం అనుకోకండి. ఇందులో మీరు ఊహించని ట్విస్ట్ ఉంది. 

స్కాట్లాండ్‌‌(Scotland)కు చెందిన వధువు క్లైర్ గుడ్‌బ్రాండ్, వరుడు ఎమోన్ బాత్‌గేట్ సమీపంలోని బాలన్‌క్రిఫ్ టోల్ వద్ద వివాహం చేసుకున్నారు. అప్పటివరకు ఆనందంగా సాగిన వేడుకలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. ‘మొగుడు’ సినిమాలో గోపీ చంద్, తాప్సీ, రోజా, రాజేంద్రప్రసాద్ కొట్టుకొనే సీన్ ప్రత్యక్షమైంది. వధువు తల్లి చెర్రీ ఆన్ లిండ్సే, వరుడు ఎమోన్, సోదరుడు కీరన్ మధ్య వాగ్వాదం జరిగింది. ఇంతలో వధువు క్లైర్ అక్కడికి వచ్చింది. చిత్రం ఏమిటంటే.. క్లైర్ తన తల్లికి కాకుండా భర్త ఎమోన్‌కు సపోర్ట్ చేసింది. తల్లి జుట్టు పట్టుకుని ఈడ్చేసింది. ఆ తర్వాత ఎమోన్, కీరన్‌లు కూడా ఆమెను కొట్టారు. ఈ ఘటనలో వధువు తల్లికి గాయాలయ్యాయి. దీంతో పోలీసులు వధువువరులను అరెస్టు చేసి జైల్లో పెట్టారు. దీంతో వారి తొలి రాత్రి అలా జైల్లోనే గడిచింది. 

ఈ ఘటనపై వధువు తల్లి మాట్లాడుతూ.. ‘‘క్లైర్ నన్ను దాదాపు రెండు అడుగుల వరకు జుట్టు పట్టుకుని లాక్కెళ్లింది. తన షూతో నన్ను కొట్టింది. ఆ తర్వాత నన్ను గట్టిగా పట్టుకుని ఉక్కిరిబిక్కిరి చేయడంతో ఊపిరి పీల్చుకోలేకపోయాను. నేను చనిపోతానేమో అనుకున్నాను’’ అని లిండ్సే ఓ మీడియా సంస్థతో తెలిపింది. అర్ధరాత్రి తాను ట్యాక్సీకి కాల్ చేయడం వల్లే ఈ గొడవ జరిగిందని తెలిపింది. 

Also Read: శృంగారం చేసినా, చేయకపోయినా వారానికి ఇన్ని సార్లు స్కలించాల్సిందే, లేకపోతే..

‘‘నా భర్త డెవిడ్, మా వెనుక వస్తున్నాడు. ఇంకా రావడం లేదు ఏమిటా అని వెనక్కి వెళ్లి చూస్తే.. అతడు నేల మీద పడివున్నాడు. కీరన్ అతడి కంటిని పెకిళించడానికి ప్రయత్నిస్తూ కనిపించాడు. దీంతో మా ఫ్యామిలీ ఫ్రెండ్ వైవోన్ వారిని అడ్డుకొనే ప్రయత్నం చేశాడు. నేను కూడా డెవిడ్‌ను విడిపించడానికి ప్రయత్నిస్తే.. నా కూతురు క్లైర్ నాపై దాడి చేసింది’’ అని తెలిపింది. అయితే, వధవరులు.. డెవిడ్‌పై ఎందుకు దాడి చేశారనే విషయం తెలియరాలేదు. పోలీసులు వారిని పెళ్లి రోజు రాత్రి అరెస్టు చేసి, తర్వాతి రోజు కోర్టులో హాజరుపరిచారు. కైరో తన తల్లిని జుట్టు పట్టుకుని లాగడమే కాకుండా తలపై కొట్టినట్లు, తన్నినట్లు అంగీకరించింది.  

Also Read: వింత దంపతులు.. అడవిలో నగ్నంగా అనాగరిక జీవితం, ఎందుకంటే..

Published at : 31 Mar 2022 11:38 AM (IST) Tags: Scotland Wedding Night In Jail Wedding Night at Jail Scotland Wedding Scotland wedding night Bride Groom in Jail

ఇవి కూడా చూడండి

Teenagers: తల్లిదండ్రులూ జాగ్రత్త, టీనేజర్లలో పెరిగిపోతున్న డిప్రెషన్ లక్షణాలు

Teenagers: తల్లిదండ్రులూ జాగ్రత్త, టీనేజర్లలో పెరిగిపోతున్న డిప్రెషన్ లక్షణాలు

Iron Kadhai: ఐరన్ పాత్రల్లో వంట చేస్తే నిజంగా ఆ సమస్యలు రావా? ఇందులో నిజమెంతా, ప్రయోజనాలేమిటీ?

Iron Kadhai: ఐరన్ పాత్రల్లో వంట చేస్తే నిజంగా ఆ సమస్యలు రావా? ఇందులో నిజమెంతా, ప్రయోజనాలేమిటీ?

Fish Oil Vs Fish: ఫిష్ ఆయిల్ మంచిదా? లేదా నేరుగా చేపలు తినేయడమే బెటరా? వీటిలో ఏది బెస్ట్?

Fish Oil Vs Fish: ఫిష్ ఆయిల్ మంచిదా? లేదా నేరుగా చేపలు తినేయడమే బెటరా? వీటిలో ఏది బెస్ట్?

Heart Attack: ఈ రక్తపరీక్షతో గుండె పోటు వచ్చిందో లేదో తెలుసుకోవచ్చు

Heart Attack: ఈ రక్తపరీక్షతో గుండె పోటు వచ్చిందో లేదో తెలుసుకోవచ్చు

Dark Chocolates: షాకింగ్, ఈ చాక్లెట్‌లో భారీ లోహాలు - అవి తింటే ప్రమాదకరమా?

Dark Chocolates: షాకింగ్, ఈ చాక్లెట్‌లో భారీ లోహాలు - అవి తింటే ప్రమాదకరమా?

టాప్ స్టోరీస్

Kodali Nani: జైల్లో దోమలు కుట్టకపోతే రంభా ఊర్వశిలు కన్నుకొడతారా - కొడాలి నాని సెటైర్లు

Kodali Nani: జైల్లో దోమలు కుట్టకపోతే రంభా ఊర్వశిలు కన్నుకొడతారా - కొడాలి నాని సెటైర్లు

గ్రేటర్‌లో నేడు డబుల్ బెడ్రూం ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక - ఆ లక్కీ పర్సన్స్‌ని ఎంపిక ఇలా

గ్రేటర్‌లో నేడు డబుల్ బెడ్రూం ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక - ఆ లక్కీ పర్సన్స్‌ని ఎంపిక ఇలా

KCR Health Condition: సీఎం కేసీఆర్ కు అస్వస్థత, ప్రగతి భవన్ లో ఐదుగురు వైద్యుల బృందంతో చికిత్స

KCR Health Condition: సీఎం కేసీఆర్ కు అస్వస్థత, ప్రగతి భవన్ లో ఐదుగురు వైద్యుల బృందంతో చికిత్స

CM Jagan: సీఎం జగన్ మంచి మనస్సు- ఓ వ్యక్తి ప్రాణాన్ని కాపాడేందుకు హెలికాప్టర్ ఏర్పాటు

CM Jagan: సీఎం జగన్ మంచి మనస్సు- ఓ వ్యక్తి ప్రాణాన్ని కాపాడేందుకు హెలికాప్టర్ ఏర్పాటు