వింత దంపతులు.. అడవిలో నగ్నంగా అనాగరిక జీవితం, ఎందుకంటే..

ఆ జంట గత పదేళ్లుగా నగ్నంగానే జీవిస్తున్నారు. అటవిలో ఆటవికంగా.. ప్రకృతి ధర్మాన్ని పాటిస్తున్నారు.

FOLLOW US: 

ప్రకృతిని ప్రేమించే వాళ్ల గురించి తెలుసు. కానీ, ప్రకృతిలో మమేకమైపోయే వ్యక్తులు గురించి మీకు తెలుసా? అదెలా సాధ్యం అనుకుంటున్నారా? అయితే, మీరు తప్పకుండా ఈ జంట గురించి తెలుసుకోవల్సిందే. వీరు గత కొన్నాళ్లుగా అడవుల్లో అనాగరిక జీవితం గడుపుతున్నారు. ఒంటి మీద నూలు పోగు లేకుండా నగ్నంగానే తిరుగుతున్నారు. కనీసం ప్రభుత్వం అందించే విద్యుత్, నీటి సదుపాయాలను కూడా పొందకుండా పూర్తిగా ప్రకృతి మీదే ఆధారపడి జీవిస్తున్నారు. అంతేకాదు.. తమలా నగ్నంగా జీవించవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని కూడా చెబుతున్నారు. ఈ వింత జంట ఇంగ్లాండ్‌లోని విల్ట్‌షైర్ కౌంటీలో నివసిస్తున్నారు. 

జాన్, హెలెన్ డాన్సన్ అనే ఈ జంట చిప్పెన్‌హామ్‌కు శివారులో ఓ అటవీ ప్రాంతంలో నగ్న జీవితాన్ని గడుపుతున్నారు. ఇక జీవితాంతం తాము అలాగే జీవించాలని నిర్ణయించుకున్నామని తెలుపుతున్నారు. అలా జీవించడం వారికి ఎంతో హాయిగా ఉందని అంటున్నారు. ఇలా నగ్నంగా జీవించేవారిని ‘నేచురిస్ట్’ అని పిలుస్తారు. జాన్, హెలెన్‌లకు ఇలా పిలిపించుకోవడం చాలా ఇష్టమట. 

ఈ జంట తొలిసారిగా 2011లో కలుసుకున్నారు. అయితే హెలెన్ 2006 నుంచే నేచురిస్ట్ జీవితాన్ని గడుపుతోంది. అప్పటికి జాన్‌కు నగ్నంగా జీవించడం గురించి పెద్దగా అవగాహన లేదు. కానీ హెలెన్‌తో నిత్యం కలిసి ఉండటం వల్ల తాను కూడా నేచురిస్టుగా మారిపోయాడు. ఇప్పుడు ఇద్దరు కలిసి ఒకే ఇంట్లో నగ్నంగా జీవితాన్ని గడుపుతున్నారు. పదేళ్లుగా నగ్నంగా జీవిస్తున్నా.. ఒక్కసారి కూడా దుస్తులు వేసుకోవాలనే ఆలోచన వారికి రాలేదు. 

జాన్ సైన్యంలో పనిచేసేప్పుడు సహచరులతో కలసి నగ్నంగా స్నానాలు చేసేవాడు. దానివల్ల అతడు హెలెన్‌తో కలిసి జీవించడానికి పెద్ద కష్టం కాలేదు. ఆ దిగంబర జీవితం వారి మనసులను ఒక్కటి చేసింది. దీంతో ఇద్దరు లాంగ్‌హోప్‌లోని నేచురిస్ట్ క్లబ్‌లో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. అయితే, పెళ్లిలో కూడా వారు దుస్తులు ధరించారని భావిస్తే మాత్రం పొరపాటే. ఆ జంట మాత్రమే కాదు.. ఆ పెళ్లికి వచ్చిన అతిథులు సైతం దుస్తులు ధరించలేదు. ఎందుకంటే.. వారు కూడా ఆ నేచురిస్ట్ క్లబ్‌లో సభ్యులు. 

సాధారణంగా బహిరంగ ప్రదేశాల్లో నగ్నంగా తిరగడం నేరం. అందుకే వీరు నగర శివారు ప్రాంతాల్లో పచ్చని చెట్ల మధ్య జీవిస్తుంటారు. వీరితో కలిస్తే తమని కూడా తప్పుగా భావిస్తారనే ఉద్దేశంతో జాన్, హెలెన్ కుటుంబ సభ్యులు దూరమయ్యారు. స్నేహితులు కూడా వీరిని కలిసేందుకు ఇష్టపడటం లేదు. అయినా సరే.. తమకు ఈ జీవితమే నచ్చిందంటూ.. హాయిగా గడిపేస్తున్నారు. 

ఇద్దరు చిన్న కార్వాన్‌లోనే జీవిస్తున్నారు. ప్రభుత్వం అందించే విద్యుత్, నీటి సదుపాయాలను కూడా పొందటం లేదు. ఫలితంగా భారీ బిల్లుల బెడద తమకు లేదని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే తమలాంటి జీవితాన్ని మరెవ్వరు జీవించలేరని జాన్ అంటున్నాడు. ఇందుకు ఎన్నో సవాళ్లను ఎదుర్కోవలసి వస్తుందన్నారు. ప్రస్తుతం తాము వ్యవసాయం చేస్తూ ఆటవిక జీవితం సాగిస్తున్నామని తెలిపాడు. 

అయితే, నగ్నంగా జీవించేవారి(న్యూడిస్ట్‌ల)కి.. నేచురిస్టులకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని జాన్ పేర్కొన్నాడు. నేచురిస్టులకు చక్కని సిద్ధంతాలు ఉంటాయని, న్యూడిస్టులు పరిసరాలతో సంబంధం లేకుండా నగ్నంగా జీవించాలని మాత్రం భావిస్తారని తెలిపాడు. ‘‘శుభ్రత విషయంలో మేం చాలా కచ్చితంగా ఉంటాం. మా కూర్చీలు మేమే వాడతాం. టవల్ వేసుకున్న తర్వాతే కూర్చుంటాం. ఆ తర్వాత వాటిని ఉతికేస్తాం’’ అని తెలిపారు. 

Also Read: శృంగారం చేసినా, చేయకపోయినా వారానికి ఇన్ని సార్లు స్కలించాల్సిందే, లేకపోతే..

నేచురిస్ట్ అంటే?: నేచురిస్ట్ అంటే నగ్నంగానే ఉండాలనే రూల్ లేదు. కానీ, ప్రకృతిని గౌరవించడం కోసం అంతా నగ్నంగా మారతారు. న్యూడిస్టులు కేవలం నగ్నంగా జీవించడానికి మాత్రమే ఇష్టపడతారు. నేచురిస్టులంతా సమూహాలుగా ఉండేందుకు ఇష్టపడతారు. సూర్యరశ్మి, స్వచ్ఛమైన గాలిని ఆస్వాదించడం, మద్యపానం, మాంసం, పొగాకు దూరంగా ఉండటం, ప్రకృతికి దగ్గరగా ఉండటం వీరి సిద్ధాంతాలు. ప్రతి ఒక్కరికి బట్టలు ధరించకుండా ఉండే హక్కు ఉందనేది వీరి వాదన. 

Published at : 09 Aug 2021 10:47 AM (IST) Tags: naturist couple naturist couple in UK naturist What is naturism naturism John Helen Donson Chippenham Wiltshire నేచురిస్ట్

సంబంధిత కథనాలు

matki dal uses: మట్కి పప్పు రుచి అమోఘం, పోషకాలు పుష్కలం

matki dal uses: మట్కి పప్పు రుచి అమోఘం, పోషకాలు పుష్కలం

World Biryani Day: బిర్యానీ లవర్స్, ఈ రోజు మీరు కచ్చితంగా బిర్యానీ తినాల్సిందే, హ్యాపీ ఫస్ట్ బిర్యానీ డే

World Biryani Day: బిర్యానీ లవర్స్, ఈ రోజు మీరు కచ్చితంగా బిర్యానీ తినాల్సిందే, హ్యాపీ ఫస్ట్ బిర్యానీ డే

Papaya turns toxic: బొప్పాయిని ఇలా తింటే ఆరోగ్యానికి అనర్ధమే

Papaya turns toxic: బొప్పాయిని ఇలా తింటే ఆరోగ్యానికి అనర్ధమే

Talking in Sleep: నిద్రలో మాట్లాడడం చిన్న సమస్యేమీ కాదు, అది మానసిక అనారోగ్యానికి సూచన, ఏం చేయాలి?

Talking in Sleep: నిద్రలో మాట్లాడడం చిన్న సమస్యేమీ కాదు, అది మానసిక అనారోగ్యానికి సూచన, ఏం చేయాలి?

Cancer: సెల్‌ఫోన్లు క్యాన్సర్ కారకాలుగా మారుతున్నాయా? ఈ రెండింటికీ మధ్య లింకేంటి?

Cancer: సెల్‌ఫోన్లు క్యాన్సర్ కారకాలుగా మారుతున్నాయా? ఈ రెండింటికీ మధ్య లింకేంటి?

టాప్ స్టోరీస్

BJP Executive Meeting: బీజేపీ మీటింగ్‌లోకి ఇంటెలిజెన్స్ అధికారి ఎంట్రీ, అవి ఫోటోలు తీస్తుండగా పట్టేసిన నేతలు!

BJP Executive Meeting: బీజేపీ మీటింగ్‌లోకి ఇంటెలిజెన్స్ అధికారి ఎంట్రీ, అవి ఫోటోలు తీస్తుండగా పట్టేసిన నేతలు!

Watch Video: దటీజ్ ఇండియన్ ఆర్మీ - అమర్​నాథ్ యాత్రికుల కోసం 4 గంటల్లోనే బ్రిడ్జి నిర్మాణం

Watch Video: దటీజ్ ఇండియన్ ఆర్మీ - అమర్​నాథ్ యాత్రికుల కోసం 4 గంటల్లోనే బ్రిడ్జి నిర్మాణం

Software Engineer Suicide: జాబ్‌లో జాయినింగ్ అని హైదరాబాద్ బయలుదేరిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ - తల్లికి మెస్సేజ్ చేసి సూసైడ్

Software Engineer Suicide: జాబ్‌లో జాయినింగ్ అని హైదరాబాద్ బయలుదేరిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ - తల్లికి మెస్సేజ్ చేసి సూసైడ్

Naresh and Pavithra Lokesh: మైసూరు హోటల్‌లో నరేష్, పవిత్ర - చెప్పుతో కొట్టబోయిన మూడో భార్య రమ్య

Naresh and Pavithra Lokesh: మైసూరు హోటల్‌లో నరేష్, పవిత్ర - చెప్పుతో కొట్టబోయిన మూడో భార్య రమ్య