SSC CGL Exam: ప్రభుత్వ ఉద్యోగం పొందడానికి మంచి అవకాశం, SSC CGL పరీక్ష ఎప్పుడు? పూర్తి వివరాలు తెలుసుకోండి!
SSC CGL Exam: ఆగస్టు 2025లో SSC పరీక్షలు నిర్వహించనున్నారు. SSC CGL 2025 పరీక్ష ఆగస్టు 13-30 వరకు ఉంటాయి. అడ్మిట్ కార్డులు వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

SSC CGL Exam: మీరు కూడా ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నట్లయితే, ఈ వార్త మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) అంటే SSC, కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ (CGL) టైర్ 1 పరీక్ష 2025 తేదీలను ప్రకటించింది. ఈ పరీక్ష ఎప్పుడు జరుగుతుంది? అడ్మిట్ కార్డ్ ఎప్పుడు విడుదలవుతుందో? పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. పరీక్షకు సంబంధించిన ఇతర వివరాలను కూడా తెలుసుకోండి.
పరీక్ష తేదీలు, షెడ్యూల్
SSC CGL 2025 పరీక్ష ఆగస్టు 13 నుంచి ఆగస్టు 30, 2025 వరకు నిర్వహించనున్నారు. పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న వారు త్వరలో SSC అధికారిక వెబ్‌సైట్ ssc.gov.inలో తమ రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్‌ను నమోదు చేయడం ద్వారా తమ అడ్మిట్ కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
అడ్మిట్ కార్డ్ ఎప్పుడు విడుదలవుతుంది
పరీక్షకు 3-4 రోజుల ముందు అడ్మిట్ కార్డ్ అందుబాటులో ఉంటుంది. అడ్మిట్ కార్డ్ లేకుండా పరీక్షకు అనుమతించరు. ఫోటో గుర్తింపు కార్డును కూడా తీసుకురావడం తప్పనిసరి. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో సులభంగా అడ్మిట్ కార్డ్‌ను పొందవచ్చు.
అడ్మిట్ కార్డ్‌ను ఎలా డౌన్‌లోడ్ చేయాలి
- ముందుగా, SSC అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
- తరువాత, CGL అడ్మిట్ కార్డ్ లింక్‌పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీ స్క్రీన్‌పై కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
- ఇక్కడ అడిగిన అన్ని వివరాలు ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టండి
- తరువాత, అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డ్ స్క్రీన్పై కనిపిస్తుంది.
- ఆ అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ చేసి ప్రింట్ అవుట్ తీసుకోవాలి.
- SSC CGL పరీక్ష టైర్-1 పరీక్షా సరళిని తెలుసుకోండి
SSC CGL పరీక్ష టైర్-1 సరళి గురించి మాట్లాడితే, ఈ పరీక్షలో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ నుంచి 200 మార్కులకు 100 ప్రశ్నలు ఉంటాయి. ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి 1 గంట సమయం ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.50 మార్కులు నెగటివ్ మార్కు కూడా ఉంటుంది. ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ విభాగాన్ని మినహాయించి, అన్ని ప్రశ్నలు ఇంగ్లీష్, హిందీలో ఉంటాయి.
ఎన్ని పోస్టులకు నియామకం
SSC విడుదల చేసిన అధికారిక నోటీసు ప్రకారం, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ SSC CGL 2025 రిక్రూట్‌మెంట్ పరీక్ష ద్వారా 14,582 ఖాళీలను భర్తీ చేస్తుంది. ఇందులో 6183 పోస్టులు అన్‌రిజర్వ్‌డ్ కేటగిరీకి, 2,167 పోస్టులు SC, STలకు, 1,088 OBCలకు, 3,721, EWSలకు 1423 పోస్టులు ఉన్నాయి.





















