SSC CHSL 2025: SSC ఉద్యోగాలకు అప్లై చేయడానికి చివరి అవకాశం! ఈరోజుతో ముగియనున్న రిజిస్ట్రేషన్, వెంటనే అప్లై చేసుకోండి!
SSC CHSL Exam 2025: 3131 గ్రూప్ సీ పోస్టుల భర్తీ కోసం ఎస్‌ఎస్‌సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాల భర్తీకి శుక్రవారమే ఆఖరి తేదీ.

SSC CHSL Exam 2025: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ SSC CHSL పరీక్ష రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఇవాళ్టి(జూలై 18) తో ముగియనుంది. కంబైన్డ్ హయ్యర్ సెకండరీ (10+2) లెవల్ ఎగ్జామినేషన్‌కి దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులకు ఇదే చివరి అవకాశం. ఇప్పటికైనా అభ్యర్థులు అప్లై చేయాలనుకుంటే SSC అధికారిక వెబ్‌సైట్ ssc.gov.inలోకి వెళ్లి అప్లై చేయవచ్చు.
అప్లై చేయాలనునే వాళ్లు ప్రైమరీ దరఖాస్తు నింపేందుకు ఇవాళే ఆఖరు తేదీ. ఆన్‌లైన్‌లో ఫీజును రేపటి వరకు చెల్లించవచ్చు. అప్లికేషన్‌లో దిద్దుకోసం విండో జులై 23న ప్రారంభమవుతుంది. తర్వాత రోజు జులై 24న ముగుస్తుంది.
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ SSC CHSL రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా 3131 గ్రూప్ సి పోస్టులు భర్తీ చేయనుంది. వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం & ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ, సాంస్కృతిక మంత్రిత్వ శాఖలో సిబ్బంది భర్తీ కోసం ఈ రిక్రూట్‌మెంట్ చేస్తున్నారు.
డేటా ఎంట్రీ ఆపరేటర్ (DEO) గ్రేడ్ A పోస్టులు: ఈ పోస్టులకు అప్లై చేయాలని అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి మ్యాథ్స్ ఒక సబ్జెక్టుగా కలిగి ఉండే సైన్స్ స్ట్రీమ్‌లో ఇంటర్ పాస్ అయిన వాళ్లు అర్హులు.
LDC/JSA అండ్ DEO/DEO గ్రేడ్ A : గుర్తింపు పొందిన బోర్డు లేదా విశ్వవిద్యాలయం నుంచి 12వ తరగతి లేదా తత్సమాన పరీక్షలో పాస్ అయి ఉండాలి.
SSC CHSL ఉద్యోగాల కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి
పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు ఈ స్టెప్స్ ఫాలో అవ్వాలి.
- 1. ssc.gov.inలో SSC అధికారిక వెబ్‌సైట్ సందర్శించాలి.
- 2. హోమ్ పేజీలో ఉన్న లాగిన్ లింక్‌పై క్లిక్ చేయాలి.
- 3. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ వివరాలను నమోదు చేయాలి. తర్వాత కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
- 4. అందులో వివరాలు సబ్మిట్ చేసి క్లిక్ చేసి ఖాతాలోకి లాగిన్ అవ్వండి.
- 5. దరఖాస్తు ఫారమ్ నింపి తర్వాత ఫీజుల చెల్లించాలి.
- 6. సబ్మిట్‌పై క్లిక్ చేసి కన్ఫామ్ పేజీని డౌన్‌లోడ్ చేసి పెట్టుకోవాలి.
అభ్యర్థులు దరఖాస్తు చేయాలంటే వంద రూపాయల ఫీజు చెల్లించాలి. నెట్‌బ్యాంకిగ్ ద్వారా, యూపీఐ, వీసా, మాస్ట్రో, రూపే, డెబిట్ లేదా క్రెడిట్ కార్డులను ఉపయోగించవచ్చు. మహిళా, ఎస్సీ, ఎస్టీ, PwBD, మాజీ సైనికులకు ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు.




















