అన్వేషించండి

Civils Final Results 2023: యూపీఎస్సీ సివిల్స్ తుది ఫలితాలు విడుదల - 1,016 మంది అభ్యర్థుల ఎంపిక

Upsc Civils Results: యూపీఎస్సీ సివిల్స్ - 2023 ఫలితాలను మంగళవారం విడుదల చేసింది. మొత్తం 1,016 మందికి ఎంపిక కాగా.. ఆదిత్య శ్రీవాత్సవ మొదటి ర్యాంక్ సాధించారు.

UPSC Civils Final Results 2023: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ - 2023 తుది ఫలితాలను (UPSC Main Results) యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ మంగళవారం విడుదల చేసింది. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో పీడీఎఫ్ ఫార్మాట్‌లో అందుబాటులో ఉంచింది. తుది ఫలితాల ద్వారా మొత్తం 1,016 మంది అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. వీరిలో జనరల్ - 347, ఈడబ్ల్యూఎస్ - 115, ఓబీసీ - 303, ఎస్సీ - 165, ఎస్టీ - 86 మంది అభ్యర్థులు ఉన్నారు. మెయిన్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించి తాజాగా తుది ఫలితాలను యూపీఎస్సీ ప్రకటించింది. నోటిఫికేషన్‌‌లో ప్రకటించిన ప్రకారం మొత్తం 1143 ఖాళీలకు గాను 1,016 మంది ఉద్యోగాలకు అర్హత సాధించారు. ఆదిత్య శ్రీవాత్సవ ఫస్ట్ ర్యాంక్ సాధించగా.. అనిమేష్ ప్రధాన్ రెండో ర్యాంకు, దోనూరి అనన్య రెడ్డి మూడో ర్యాంక్ సాధించారు.

అభ్యర్థులకు యూపీఎస్సీ సూచన

అభ్యర్థులకు ఫలితాలపై ఏమైనా సందేహాలు ఉంటే తమను సంప్రదించవచ్చునని యూపీఎస్సీ ఓ ప్రకటనలో తెలిపింది. సమాచారం కోసం గానీ, లేదా స్పష్టత కోసం అన్ని వర్కింగ్ డేస్‌లలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 011 23385271, 011 23098543, 011 23381125 ల్యాండ్ లైన్ నెంబర్లలో లేదా ఫెసిలిటేషన్ కౌంటర్‌లో సంప్రదించవచ్చని యూపీఎస్సీ సూచించింది.

ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలంటే..?

🔰 ముందుగా యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌: https://www.upsc.gov.in ఓపెన్‌ చెయ్యాలి.

🔰 హోమ్‌పేజ్‌లో కనిపించే 'Final Result - CIVIL SERVICES EXAMINATION, 2023' ఆప్షన్‌పై క్లిక్ చెయ్యాలి. 

🔰 క్లిక్ చేయగానే సివిల్ సర్వీసెస్ తుది ఫలితాలకు సంబంధించిన పీడీఎఫ్‌ కనిపిస్తుంది.

🔰  సివిల్స్‌ సర్వీసెస్ తుది ఫలితాలకు సంబంధించిన పీడీఎఫ్‌ ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.

🔰  మీ పేరును చెక్‌ చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ నంబర్/ రోల్ నంబర్‌తో చెక్ చేసుకోవాలి.

సివిల్ సర్వీసెస్ తుది ఫలితాల కోసం క్లిక్ చేయండి.. https://upsc.gov.in/FR-CSM-23-engl-160424.pdf 

గతేడాది సెప్టెంబ‌ర్ 15 నుంచి 24 వ‌ర‌కు సివిల్ సర్వీసెస్ మెయిన్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. మెయిన్ పరీక్ష ఫలితాలు డిసెంబరు 8న యూపీఎస్సీ విడుదల చేసింది. మెయిన్ పరీక్షలకు హాజరైన అభ్యర్థుల్లో మొత్తం 2,844 మంది ఇంటర్వ్యూలకు  అర్హత సాధించారు. మెయిన్ పరీక్ష ద్వారా ఎంపికైన అభ్యర్థుల‌ను ఇంట‌ర్వ్యూ (ప‌ర్సనాలిటీ టెస్ట్‌)కు షార్ట్ లిస్ట్ చేశారు. వీరికి ఢిల్లీలోని యూపీఎస్సీ కార్యాల‌యంలో ఇంట‌ర్వ్యూ నిర్వహిస్తారు. గత మే నెలలో జరిగిన ప్రిలిమ్స్ పరీక్షకు సుమారు 5.5 లక్షల మంది హాజరుకాగా.. అందులో 14,624 మంది ప్రధాన పరీక్షలకు అర్హత సాధించారు. మెయిన్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు మొదటి విడతలో జనవరి 2 నుంచి ఫిబ్రవరి  16 వరకు ఇంటర్వ్యూ(పర్సనాలిటీ టెస్ట్‌)లు నిర్వహించారు. మొదటి విడత ఇంటర్వ్యూకు మొత్తం 1026 మంది ఎంపికయ్యారు. ఇక రెండో విడత ఇంటర్వ్యూ షెడ్యూలును జనవరి 25న విడుదల చేయగా..1003 మంది ఎంపికయ్యారు. వీరికి ఫిబ్రవరి 19 నుంచి మార్చి 15 వరకు పర్సనల్ ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఇక చివరి విడతలో మార్చి 18 నుంచి ఏప్రిల్ 9 వరకు ఇంటర్వ్యూలు నిర్వహించింది. మొత్తం 817 మంది అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించింది. మొత్తం మూడు విడతలు కలిపి 2846 మంది అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించగా మొత్తం 1016 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు.

Also Read: Vote ID card: ఓటర్‌ ఐడీ కార్డును డౌన్‌లోడ్‌ చేసుకోవాలా... అయితే ఇలా చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Target Revanth Reddy :  రేవంత్‌ను టార్గెట్ చేస్తే కాంగ్రెస్ బలహీనమైనట్లే -  పక్కా ప్లాన్ ప్రకారమే బీఆర్ఎస్ రాజకీయం !
రేవంత్‌ను టార్గెట్ చేస్తే కాంగ్రెస్ బలహీనమైనట్లే - పక్కా ప్లాన్ ప్రకారమే బీఆర్ఎస్ రాజకీయం !
Chandrababu Skill Case: స్కిల్ కేసులో కొత్త సంచలనం - డీజీపీకి పీవీ రమేష్ లేఖ - ఫేక్ కేసులో ఎవరెవరు ఇరుక్కుంటారు ?
స్కిల్ కేసులో కొత్త సంచలనం - డీజీపీకి పీవీ రమేష్ లేఖ - ఫేక్ కేసులో ఎవరెవరు ఇరుక్కుంటారు ?
Revanth Reddy: కేసీఆర్ అనే మొక్కను మళ్లీ మొలకెత్తనివ్వం, రాసి పెట్టుకోండి- వరంగల్ సభలో రేవంత్ రెడ్డి సంచలనం
కేసీఆర్ అనే మొక్కను మళ్లీ మొలకెత్తనివ్వం, రాసి పెట్టుకోండి- వరంగల్ సభలో రేవంత్ రెడ్డి సంచలనం
AP News: ఫ్యామిలీ మొత్తం ఊరెళ్తున్నారా ? తక్షణం ఈ పని చేస్తే మీ ఇల్లు సేఫ్
ఫ్యామిలీ మొత్తం ఊరెళ్తున్నారా ? తక్షణం ఈ పని చేస్తే మీ ఇల్లు సేఫ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Marquee players list IPL 2025 Auction | ఐపీఎల్ వేలంలో ఫ్రాంచైజీల చూపు వీరి మీదే | ABP DesamRishabh pant IPL 2025 Auction | స్పైడీ రిషభ్ పంత్ కొత్త రికార్డులు సెట్ చేస్తాడా.? | ABP DesamRishabh Pant Border Gavaskar Trophy Heroics | ఒక్క ఇన్నింగ్స్ తో టెస్ట్ క్రికెట్ క్రేజ్ మార్చేశాడుPujara Great Batting at Gabba Test | బంతి పాతబడటం కోసం బాడీనే అడ్డం పెట్టేశాడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Target Revanth Reddy :  రేవంత్‌ను టార్గెట్ చేస్తే కాంగ్రెస్ బలహీనమైనట్లే -  పక్కా ప్లాన్ ప్రకారమే బీఆర్ఎస్ రాజకీయం !
రేవంత్‌ను టార్గెట్ చేస్తే కాంగ్రెస్ బలహీనమైనట్లే - పక్కా ప్లాన్ ప్రకారమే బీఆర్ఎస్ రాజకీయం !
Chandrababu Skill Case: స్కిల్ కేసులో కొత్త సంచలనం - డీజీపీకి పీవీ రమేష్ లేఖ - ఫేక్ కేసులో ఎవరెవరు ఇరుక్కుంటారు ?
స్కిల్ కేసులో కొత్త సంచలనం - డీజీపీకి పీవీ రమేష్ లేఖ - ఫేక్ కేసులో ఎవరెవరు ఇరుక్కుంటారు ?
Revanth Reddy: కేసీఆర్ అనే మొక్కను మళ్లీ మొలకెత్తనివ్వం, రాసి పెట్టుకోండి- వరంగల్ సభలో రేవంత్ రెడ్డి సంచలనం
కేసీఆర్ అనే మొక్కను మళ్లీ మొలకెత్తనివ్వం, రాసి పెట్టుకోండి- వరంగల్ సభలో రేవంత్ రెడ్డి సంచలనం
AP News: ఫ్యామిలీ మొత్తం ఊరెళ్తున్నారా ? తక్షణం ఈ పని చేస్తే మీ ఇల్లు సేఫ్
ఫ్యామిలీ మొత్తం ఊరెళ్తున్నారా ? తక్షణం ఈ పని చేస్తే మీ ఇల్లు సేఫ్
AR Rahman Divorce: విడాకులు తీసుకున్న ఏఆర్ రెహమాన్ దంపతులు, నిర్ణయం ప్రకటించిన సైరా బాను
విడాకులు తీసుకున్న ఏఆర్ రెహమాన్ దంపతులు, నిర్ణయం ప్రకటించిన సైరా బాను
Allu Arha - Allu Arjun: మనుచరిత్రలో పద్యం చెప్పిన అల్లు అర్హ ..ఆ పద్యానికి భావం, సందర్భం ఏంటో తెలుసా!
మనుచరిత్రలో పద్యం చెప్పిన అల్లు అర్హ ..ఆ పద్యానికి భావం, సందర్భం ఏంటో తెలుసా!
Unhappy Leave : మీరు హ్యాపీగా లేరా? అయితే లీవ్ తీసుకోండి.. ఒక రోజు కాదు పది రోజులు పెయిడ్ లీవ్, ఎక్కడంటే
మీరు హ్యాపీగా లేరా? అయితే లీవ్ తీసుకోండి.. ఒక రోజు కాదు పది రోజులు పెయిడ్ లీవ్, ఎక్కడంటే
Mahasena Rajesh: కూటమి ప్రభుత్వంలోనూ తప్పుడు కేసులు! మహాసేన రాజేష్‌ సంచలన వ్యాఖ్యలు
కూటమి ప్రభుత్వంలోనూ తప్పుడు కేసులు నమోదు! మహాసేన రాజేష్‌ సంచలన వ్యాఖ్యలు
Embed widget