Vote ID card: ఓటర్ ఐడీ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవాలా... అయితే ఇలా చేయండి
Elections 2024: ఓటు హక్కు ఉన్నా.. ఓటర్ ఐడీ కార్డు లేదా..? డౌన్‌లోడ్ చేసుకోవాలని అనుకుంటున్నా..? అది చేతిలో పనే... మొబైల్ ఉంటే చాలు.. మీరు ఎక్కడ ఉన్నా క్షణాల్లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
Andhra Pradesh News: ఓటు ఉన్న ప్రతిఒక్కరికీ ఓటర్ ఐడీ కార్డు చాలా అవసరం. కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్లకు... ఓటర్ ఐడీ కార్డు మంజూరు చేస్తుంది. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో మన దగ్గర ఓటర్ ఐడీ కార్డు ఉంటే.. ఎంతో మంచిది. ఓటర్ ఐడీ కార్డు.. ఓటు వేసే సమయంలో గుర్తింపు కార్డుగానే కాదు.. చాలా సందర్భాల్లో కూడా ఉపయోపడుతుంది. చాలా మంది ఓటర్ ఐడీ కార్డును ఇంట్లో భద్రంగా దాచుకుంటారు. ఎప్పుడూ వెంట పెట్టుకోరు. ఒక్కోసారి బయటికి వెళ్లినప్పుడు ఈ కార్డు అవసరం అవుతుంది. అలాంటప్పుడు ఏం చేయాలో పాలుపాదు. కార్డు లేకపోతే.. పని జరగకపోవచ్చు. అలాంటి సందర్భంగా... ఈజీగా మీ స్మార్ట్‌ఫోన్ నుంచి డిజిటల్ ఓటర్ ఐడీ కార్డును వెంటనే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఓటర్ ఐడీ కార్డును డౌన్‌లోడ్ చేసుకునే విధానం
మీ ఇంట్లో ఉన్న కంప్యూటర్‌లోగానీ.. లేక స్మార్ట్‌ఫోన్‌లో గానీ... కేంద్ర ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్ https://voters.eci.gov.in/loginను ఓపెన్ చేయాలి. మీరు ముందుగానే రిజిస్ట్రర్ చేసుకున్నట్టయితే... ఆ వివరాలతో లాగిన్ అయితే సరిపోతుంది. లేదంటే.. కోత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ కోసం మీ మొబైల్ నంబర్ ఇవ్వాలి. ఆ తర్వాత మీ మొబైల్‌కి ఒక ఓటీపీ (OTP) వస్తుంది. దాన్ని ఎంటర్ చేస్తే.. పాస్‌వర్డ్ సెట్ చేసుకోమని అడుగుతుంది. మీకు గుర్తండే నెంబర్లతో పాస్‌వర్డ్ పెట్టుకోండి. దీంతో... రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. తర్వాత మీరు మొబైల్ నంబర్, పాస్‌వర్డ్ ఇచ్చి... కాప్చా ఎంటర్ చేస్తే.. లాగిన్ అయిపోవచ్చు.
వెబ్‌సైట్‌లో లాగిన్ అయిన తర్వాత హోమ్ పేజీలో e-epic Download ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి. ఆ తర్వాత... మీ ఓటర్ కార్డు నెంబర్ అడుగుతుంది. ఓటర్ కార్డు నెంబర్ ఎంటర్ చేయాలి. ఆపై.. మీ రాష్ట్రం పేరు సెలెక్ట్ చేసి సెర్చ్ బటన్ నొక్కాలి. వివరాలు అన్ని పూర్తి చేసిన తర్వాత... Send OTP అనే బటన్‌పై క్లిక్ చేయాలి. ఓటర్ ఐడీ కార్డుకు లింక్ అయిన మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మొబైల్ నెంబర్ వెరిఫై అవుతుంది. ఆ తర్వాత క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి Download e-EPIC పైన క్లిక్ చేయాలి. నాన్ ఎడిటెబుల్ పీడీఎఫ్ ఫార్మాట్‌లో డిజిటల్ ఓటర్ ఐడీ కార్డ్ డౌన్‌లోడ్ అవుతుంది. అంతే చాలా ఈజీగానే ఉంది కదూ. నిమిషాల్లోనే మీ స్మార్ట్ ఫోన్‌లో డిజిటల్ కార్డు డౌన్‌లోన్ చేసుకోవచ్చు. మీరు ఎక్కడ ఉన్నా.. చేతిలో స్మార్ట్‌ఫోన్, ఇంటర్‌నెట్ సదుపాయం ఉంటే చాలు... ఈజీగా ఓటర్ కార్డు డౌన్‌లోడ్ చేసేసుకోవచ్చు.
డిజిటల్ కార్డు డౌన్‌లోడ్ స్టెప్స్ వారీగా...
1. ఫోన్ లేదా కంప్యూటర్‌లో ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్ http://eci.gov.in/e-epic ఓపెన్ చేయాలి
2. ఈసీ వెబ్‌సైట్‌లో ఇప్పటికే రిజిస్టర్ చేసుకున్నట్టయితే ఆ వివరాలతో లాగిన్ కావాలి
3. రిజిస్ట్రర్ చేసుకోకపోతే... కొత్తగా రిజిస్ట్రేషన్ చేయాలి
4. వెబ్‌సైట్‌లో లాగిన్ అయిన తర్వాత హోమ్‌పేజీలో e-epic Download ఆప్షన్ క్లిక్ చేయాలి
5. మీ ఓటర్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి.. మీ రాష్ట్రం పేరు సెలెక్ట్ చేసి.. సెర్చ్ చేయాలి
6. తర్వాత Send OTP బటన్‌పై క్లిక్ చేయాలి
7. ఓటర్ ఐడీ కార్డుకు లింకైన మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది... ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మొబైల్ నెంబర్ వెరిఫై పూర్తవుతుంది
8. ఆ తర్వాత క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి... Download e-EPIC పై క్లిక్ చేయాలి
9. పీడీఎఫ్ ఫార్మాట్‌లో డిజిటల్ ఓటర్ ఐడీ కార్డ్ డౌన్‌లోడ్ అవుతుంది
డౌన్‌లోడ్ అయిన ఓటర్ ఐడీ కార్డు మీ మొబైల్ ఫోన్‌లో PDF ఫార్మాట్‌లో సేవ్ అవుతుంది. దాన్ని మీరు ప్రింట్ తీసుకోవచ్చు లేదా ఆధార్ కార్డ్ తరహాలో లేమినేషన్ చేయించుకోవచ్చు. మొబైల్‌లోనే సేవ్ చేసుకుని పెట్టుకుని... అవసరమైనప్పుడు ఉపయోగించుకోవచ్చు.