News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

UPSC Civils Exam: వెబ్‌సైట్‌లో యూపీఎస్సీ సివిల్స్‌-2023 ప్రిలిమ్స్‌ ప్రశ్నపత్రం!

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మే 28న నిర్వహించిన సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. అభ్యర్థుల అవగాహన కోసం యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌‌లో ప్రశ్నపత్రాన్ని ఉంచింది.

FOLLOW US: 
Share:

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) మే 28న నిర్వహించిన సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. రెండు సెషన్లలో పరీక్ష నిర్వహించారు. ఉదయం 9:30 నుంచి 11:30 వరకు పేపర్-I (జనరల్ స్టడీస్), మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 4:30 వరకు పేపర్-II (సీశాట్) పరీక్ష నిర్వహించారు. తెలంగాణలో హైదరాబాద్‌, వరంగల్‌; ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, అనంతపురంలలో ఈ పరీక్ష జరిగింది.  అయితే తాజాగా ప్రిలిమినరీ పరీక్ష ప్రశ్నపత్రాన్ని యూపీఎస్సీ విడుదల చేసింది. అభ్యర్థుల అవగాహన కోసం యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌‌లో అందుబాటులో ఉంచింది. 

కఠినంగానే సివిల్స్‌ ప్రిలిమినరీ రాత పరీక్ష.. కటాఫ్‌ తగ్గే ఛాన్స్‌..

గత కొన్నేళ్ల ప్రశ్నపత్రాలతో పోలిస్తే ఈసారి ప్రశ్నల సరళి కఠినంగా ఉందని అభ్యర్థులు, నిపుణులు తెలిపారు. ఉదయం జరిగిన జనరల్‌ స్టడీస్‌ పేపర్‌లో ప్రశ్నలు ఎక్కువగా న్యూస్‌ పేపర్ చదివే వారు మాత్రమే జవాబులు రాయగలిగే విధంగా ఉన్నాయని నిపుణులు తెలిపారు. విభాగాల వారిగా చూస్తే.. పేపర్‌ 1 లో 100 ప్రశ్నలకు గానూ.. వర్తమాన వ్యవహారాలపై 11, ఆర్థికశాస్త్రం, సామాజికాభివృద్ధి 11, చరిత్ర-సంస్కృతి 12, రాజనీతిశాస్త్రం, పరిపాలన 17, పర్యావరణం 20, జాగ్రఫీ 15, జనరల్‌ నాలెడ్జ్‌పై 9, మరికొన్ని ఇతర అంశాల నుంచి ప్రశ్నలు వచ్చాయని నిపుణులు తెలిపారు.

ఇక మధ్యాహ్నం జరిగిన పేపర్‌-2 (సీశాట్‌) కొంత సులభంగా ఉందని, తెలుగు మాధ్యమం అభ్యర్థులు కూడా సులువుగా రాసేవిధంగా ఉన్నట్లు తెలిపారు. ఈసారి కటాఫ్‌ మార్కులు తగ్గే ఛాన్స్‌ ఉందని అభిప్రాయపడ్డారు. జూన్‌ 15 నాటికి ఈ పరీక్ష ఫలితాలు వెలువడే అవకాశం ఉందన్నారు. సివిల్స్‌లో ఈసారి 1105 ఖాళీలు భర్తీ చేయనున్నారు. 

రాతపరీక్ష విధానం..

➥ ప్రిలిమ్స్ పరీక్ష విధానం: 
మొత్తం 400 మార్కులకు సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహిస్తారు. ప్రిలిమినరీ పరీక్షలో రెండు పేపర్లుంటాయి. ఒక్కో పేపర్‌కు 200 మార్కులు కేటాయించారు. రెండు పేపర్లలో ప్రశ్నలు ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ ఛాయిస్ రూపంలో ఉంటాయి. రెండో పేపర్ జనరల్ స్టడీస్ క్వాలిఫైయింగ్ పేపర్‌గా ఉంటుంది. దీనిలో 33 శాతం అర్హత సాధించాల్సి ఉంటుంది. నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులను మెయిన్స్ రాయడానికి అనుమతిస్తారు. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో ఈ పరీక్షలుంటాయి.

➥ మెయిన్స్ పరీక్ష విధానం:
మొత్తం 1750 మార్కులకు యూపీఎస్సీ మెయిన్ పరీక్షలు నిర్వహిస్తారు. ఇక 275 మార్కులకు పర్సనాలిటీ టెస్ట్(ఇంటర్వ్యూ) ఉంటుంది. ఇవి రెండు కలిపి 2025 మార్కులకు తుది ఎంపిక ఉంటుంది. పరీక్షలో మొత్తం 7 పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపరుకు 250 మార్కులు కేటాయించారు. అయితే వీటిలో ఒక్కో పేపరుకు 300 మార్కుల చొప్పున క్వాలిఫయింగ్ పేపర్లు(పేపర్-ఎ, పేపర్-బి) ఉంటాయి. వీటి మార్కులను పరిగణనలోకి తీసుకోరు.  

Also Read:

ఏపీ సమగ్ర శిక్షా సొసైటీలో 1,358 టీచింగ్‌ పోస్టులు - వివరాలు ఇలా!
ఆంధ్రప్రదేశ్‌ సమగ్ర శిక్షా సొసైటీ (పాఠశాల విద్యాశాఖ) ఆధ్వర్యంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా మొత్తం 1358 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో ప్రిన్సిపల్-92 పోస్టులు, పీజీటీ- 846 పోస్టులు, సీఆర్‌టీ-374 పోస్టులు, పీఈటీ-46 పోస్టులు ఉన్నాయి.  కాంట్రాక్ట్ విధానంలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన మహిళా అభ్యర్థులు దరఖాస్తు ఫీజు కింద రూ.100 చెల్లించి మే 29 నుంచి జూన్‌ 4 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక విధానం, జిల్లాలు, సబ్జెక్టుల వారీగా ఖాళీలు తదితర వివరాలకు సంబంధించిన సమగ్ర నోటిఫికేషన్‌ మే 29న వెల్లడి కానుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్‌లో 608 ట్రేడ్, ఫ్రెషర్ అప్రెంటిస్ పోస్టులు- అర్హతలివే!
ఝార్ఖండ్ రాష్ట్రం రాంచీలోని సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్(సీసీఎల్) ట్రేడ్, ఫ్రెషర్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 608 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ట్రేడును అనుసరించి మెట్రిక్యులేషన్, ఐటీఐ, సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత ఉన్నవారు ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి. ఈ పోస్టులకి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా జూన్ 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

Published at : 30 May 2023 10:00 AM (IST) Tags: UPSC Civils Question Paper Civils Prelims Paper UPSC Question Paper UPSC Civil Services Prelims Question Paper

ఇవి కూడా చూడండి

JNTUH: జేఎన్‌టీయూ హైదరాబాద్‌లో అకడమిక్ అసిస్టెంట్/ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు

JNTUH: జేఎన్‌టీయూ హైదరాబాద్‌లో అకడమిక్ అసిస్టెంట్/ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు

ESIC Recruitment 2023: ఈఎస్‌ఐసీ ఆసుపత్రుల్లో 1,038 పారామెడికల్ స్టాఫ్ పోస్టులు, తెలంగాణ రీజియన్‌లో ఎన్ని పోస్టులంటే?

ESIC Recruitment 2023: ఈఎస్‌ఐసీ ఆసుపత్రుల్లో 1,038 పారామెడికల్ స్టాఫ్ పోస్టులు, తెలంగాణ రీజియన్‌లో ఎన్ని పోస్టులంటే?

IOCL: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో గ్రాడ్యుయేట్ ఇంజినీర్ పోస్టులు, సంక్షిప్త ప్రకటన విడుదల

IOCL: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో గ్రాడ్యుయేట్ ఇంజినీర్ పోస్టులు, సంక్షిప్త ప్రకటన విడుదల

NBE Jobs: నేషనల్‌ బోర్డు ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ ఇన్‌ మెడికల్‌ సైన్సెస్‌‌లో 48 ఖాళీలు

NBE Jobs: నేషనల్‌ బోర్డు ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ ఇన్‌ మెడికల్‌ సైన్సెస్‌‌లో 48 ఖాళీలు

AAICLAS: ఏఏఐసీఎల్‌ఏఎస్‌-లద్దాఖ్‌లో సెక్యూరిటీ స్క్రీనర్ ఉద్యోగాలు, ఈ అర్హతలుండాలి

AAICLAS: ఏఏఐసీఎల్‌ఏఎస్‌-లద్దాఖ్‌లో సెక్యూరిటీ స్క్రీనర్ ఉద్యోగాలు, ఈ అర్హతలుండాలి

టాప్ స్టోరీస్

TDP Protest: న్యాయం కోసం ఎంతవరకైనా వెళ్తాం, త్వరలోనే టీడీపీ జైలు భరో చేస్తుంది: చినరాజప్ప

TDP Protest: న్యాయం కోసం ఎంతవరకైనా వెళ్తాం, త్వరలోనే టీడీపీ జైలు భరో చేస్తుంది: చినరాజప్ప

Bigg Boss Season 7 Telugu: శివాజీ అనర్హుడు అని ప్రకటించిన కంటెస్టెంట్స్ - దీంతో నాగార్జున అలాంటి నిర్ణయం!

Bigg Boss Season 7 Telugu: శివాజీ అనర్హుడు అని ప్రకటించిన కంటెస్టెంట్స్ - దీంతో నాగార్జున అలాంటి నిర్ణయం!

HCA Election Notification: హెచ్‌సీఏ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వచ్చేసింది, ముఖ్యమైన తేదీలివే

HCA Election Notification: హెచ్‌సీఏ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వచ్చేసింది, ముఖ్యమైన తేదీలివే

Hari Teja: నటి హరితేజకు విడాకులు- కూల్ గా ఆన్సర్ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ

Hari Teja: నటి హరితేజకు విడాకులు- కూల్ గా ఆన్సర్ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ