(Source: ECI/ABP News/ABP Majha)
APSSS KGBV: ఏపీ సమగ్ర శిక్షా సొసైటీలో 1,358 టీచింగ్ పోస్టులు - వివరాలు ఇలా!
ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా సొసైటీ (పాఠశాల విద్యాశాఖ) ఆధ్వర్యంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా మొత్తం 1358 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా సొసైటీ (పాఠశాల విద్యాశాఖ) ఆధ్వర్యంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా మొత్తం 1358 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో ప్రిన్సిపల్-92 పోస్టులు, పీజీటీ- 846 పోస్టులు, సీఆర్‌టీ-374 పోస్టులు, పీఈటీ-46 పోస్టులు ఉన్నాయి. కాంట్రాక్ట్ విధానంలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన మహిళా అభ్యర్థులు దరఖాస్తు ఫీజు కింద రూ.100 చెల్లించి మే 29 నుంచి జూన్ 4 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక విధానం, జిల్లాలు, సబ్జెక్టుల వారీగా ఖాళీలు తదితర వివరాలకు సంబంధించిన సమగ్ర నోటిఫికేషన్ మే 29న వెల్లడి కానుంది.
వివరాలు...
🔰 ఖాళీల సంఖ్య: 1,358 పోస్టులు
1) ప్రిన్సిపాల్: 92 పోస్టులు
2) పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్(పీజీటీ): 846 పోస్టులు
3) సీఆర్‌టీ: 374 పోస్టులు
4) ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్(పీఈటీ): 46 పోస్టులు
అర్హత: పోస్టును అనుసరించి డిగ్రీ, పీజీ, బీఈడీ, బీపీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: జనరల్ అభ్యర్థులకు 18-42 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/ బీసీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు ఫీజు: రూ.100.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు..
➥ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 29.05.2023.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 04.06.2023 (11.59 PM)
Also Read:
సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్‌లో 608 ట్రేడ్, ఫ్రెషర్ అప్రెంటిస్ పోస్టులు- అర్హతలివే!
ఝార్ఖండ్ రాష్ట్రం రాంచీలోని సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్(సీసీఎల్) ట్రేడ్, ఫ్రెషర్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 608 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ట్రేడును అనుసరించి మెట్రిక్యులేషన్, ఐటీఐ, సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత ఉన్నవారు ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి. ఈ పోస్టులకి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా జూన్ 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఐడీబీఐ బ్యాంకులో 1036 ఎగ్జిక్యూటివ్ పోస్టులు, ఈ అర్హతలుండాలి!
ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఐడీబీఐ) ఒప్పంద ప్రాతిపదికన దేశవ్యాప్తంగా ఉన్న ఐడీబీఐ శాఖల్లో ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 1036 ఖాళీలను భర్తీచేయనున్నారు. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాతపరీక్ష, సర్టిఫికేట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్టుల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఈ పోస్టుల భర్తీకి మే 24 నుంచి జూన్ 7 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు స్వీకరించనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఇండియన్ నేవీలో 1365 అగ్నివీర్ (ఎస్‌ఎస్‌ఆర్) పోస్టులు, అర్హతలివే!
ఇండియన్ నేవీలో 1365 అగ్నివీర్ (ఎస్‌ఎస్‌ఆర్) పోస్టులు, అర్హతలివే!ఇండియన్ నేవీలో అగ్నివీర్ (సీనియర్ సెకండరీ రిక్రూట్-SSR) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీని ద్వారా మొత్తం 1,365 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అగ్నివీరులుగా ఎంపికైన అభ్యర్థులకు ఐఎన్‌ఎస్ చిల్కాలో (02/2023-నవంబర్ 23 బ్యాచ్) శిక్షణ ఉంటుంది. ఇంటర్ ఉత్తీర్ణులైన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మే 29న ప్రారంభంకానుంది. అభ్యర్థులు జూన్ 15 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. కంప్యూటర్ ఆధారిత ఆన్‌లైన్ పరీక్ష(సీబీఈ), రాత పరీక్ష, ఫిజికల్ ఈవెంట్లు, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..