News
News
వీడియోలు ఆటలు
X

Indian Navy: ఇండియన్ నేవీలో 1365 అగ్నివీర్ (ఎస్‌ఎస్‌ఆర్‌) పోస్టులు, అర్హతలివే!

ఇండియన్ నేవీలో అగ్నివీర్ (సీనియర్ సెకండరీ రిక్రూట్-SSR) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీని ద్వారా మొత్తం 1,365 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

FOLLOW US: 
Share:

ఇండియన్ నేవీలో అగ్నివీర్ (సీనియర్ సెకండరీ రిక్రూట్-SSR) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీని ద్వారా మొత్తం 1,365 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అగ్నివీరులుగా ఎంపికైన అభ్యర్థులకు ఐఎన్‌ఎస్‌ చిల్కాలో (02/2023-నవంబర్‌ 23 బ్యాచ్‌) శిక్షణ ఉంటుంది. ఇంటర్‌ ఉత్తీర్ణులైన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మే 29న ప్రారంభంకానుంది. అభ్యర్థులు జూన్ 15 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. కంప్యూటర్ ఆధారిత ఆన్‌లైన్ పరీక్ష(సీబీఈ), రాత పరీక్ష, ఫిజికల్ ఈవెంట్లు, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

వివరాలు..

* అగ్నివీర్ (ఎస్‌ఎస్‌ఆర్‌)

మొత్తం ఖాళీలు: 1365 పోస్టులు(మెన్-1120, ఉమెన్-273)

అర్హత: ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. ఇంటర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్‌ ప్రధాన సబ్జెక్టులుగా ఉండాలి. కెమిస్ట్రీ/బయాలజీ/కంప్యూటర్ సైన్స్‌లో ఏదో ఒక సబ్జెక్టుతో ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.

కనిష్ఠ ఎత్తు ప్రమాణాలు: పురుషులు 157 సెం.మీ., స్త్రీలు 152 సెం.మీ. ఉండాలి.

వయోపరిమితి: 01.11.2002 – 31.04.2005 మధ్య జన్మించి ఉండాలి. 

దరఖాస్తు ఫీజు: రూ.550.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, కంప్యూటర్ ఆధారిత ఆన్‌లైన్ పరీక్ష(సీబీఈ), రాత పరీక్ష, శారీరక దార్ఢ్య పరీక్ష(పీఎఫ్‌టీ), వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు.

కంప్యూటర్ ఆధారిత పరీక్ష: ప్రశ్నపత్రం హిందీ/ ఇంగ్లిష్ భాషల్లో మొత్తం 100 బహుళైచ్ఛిక ప్రశ్నలతో ఒక్కొక్కటి 1 మార్కు చొప్పున 100 మార్కులను కలిగి ఉంటుంది. ఇంగ్లిష్, సైన్స్, మ్యాథమెటిక్స్, జనరల్ అవేర్‌నెస్.. నాలుగు విభాగాల్లో ఇంటర్మీడియట్‌ స్థాయిలో ప్రశ్నలుంటాయి. పరీక్ష వ్యవధి ఒక గంట. నెగెటివ్ మార్కింగ్ అమలులో ఉంటుంది. నాలుగు తప్పు సమాధానాలకు ఒక మార్కు కోత విధిస్తారు.

శిక్షణ వివరాలు: అగ్నివీరులుగా ఎంపికైన అభ్యర్థులకు ఒడిశా రాష్ట్రంలోని ఐఎన్‌ఎస్‌ చిల్కాలో వచ్చే ఏడాది నవంబర్‌ నెలలో కోర్సు శిక్షణ ప్రారంభమవుతుంది. శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్న తర్వాత ఆయా విభాగాల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.

జీత భత్యాలు: ఎంపికైన అభ్యర్థులకు మొదటి ఏడాది రూ.30,000, రెండో ఏడాది రూ.33,000, మూడో ఏడాది రూ.36,500, నాలుగో ఏడాది రూ.40,000 వేతనం లభిస్తుంది.

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపు ప్రారంభం: 29.05.2023.

➥ ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపు చివరి తేదీ: 15.06.2023.

➥ శిక్షణ ప్రారంభం: 2023, నవంబరులో.

Notification

Website

                                       

 

Also Read:

సశస్త్ర సీమాబల్‌లో 914 హెడ్‌ కానిస్టేబుల్ పోస్టులు, అర్హతలివే!
న్యూఢిల్లీలోని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన సశస్త్ర సీమా బల్ (ఎస్‌ఎస్‌బీ), హెడ్‌ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రాతపరీక్ష, ఫిజికల్ ఈవెంట్స్, స్కిల్ టెస్ట్, మెడికల్ టెస్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఎస్‌ఎస్‌బీ పరిధిలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

ఇండియన్ నేవీలో 372 ఛార్జ్‌మ్యాన్ పోస్టులు, అర్హతలివే!
ఇండియన్‌ నేవీలో సివిలియన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ ద్వారా ఛార్జ్‌మ్యాన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. సంబంధిత విభాగంలో డిప్లొమా లేదా డిగ్రీ ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఎంపికైన అభ్యర్థులు హెడ్‌క్వార్టర్స్ వెస్ట్రన్ నేవల్ కమాండ్ (ముంబయి), హెడ్‌క్వార్టర్స్ ఈస్టర్న్ నేవల్ కమాండ్ (విశాఖపట్నం), హెడ్‌క్వార్టర్స్ సదరన్ నేవల్ కమాండ్ (కొచ్చి), హెడ్‌క్వార్టర్స్ అండమాన్ అండ్‌ నికోబార్ కమాండ్ (పోర్ట్ బ్లెయిర్) యూనిట్లలో పని చేయాల్సి ఉంటుంది. ఈ పోస్టుల భర్తీకి మే 15న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు మే 29 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికలు చేపడతారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

Published at : 26 May 2023 09:06 AM (IST) Tags: Indian Navy Recruitment Indian Navy Jobs Indian Navy Agniveer Notification Indian Navy Agniveer SSR Recruitment

సంబంధిత కథనాలు

AP KGBV: కేజీబీవీల్లో 1,358  పోస్టుల దరఖాస్తుకు జూన్ 8 వరకు అవకాశం!

AP KGBV: కేజీబీవీల్లో 1,358 పోస్టుల దరఖాస్తుకు జూన్ 8 వరకు అవకాశం!

GDS Recruitment: 12,828 పోస్టాఫీసు ఉద్యోగాల దరఖాస్తుకు ఇక నాలుగు రోజులే గడువు, వివరాలు ఇలా!

GDS Recruitment: 12,828 పోస్టాఫీసు ఉద్యోగాల దరఖాస్తుకు ఇక నాలుగు రోజులే గడువు, వివరాలు ఇలా!

Navy Recruitment: నావల్ డాక్‌యార్డులో 281 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు, వివరాలు ఇలా!

Navy Recruitment: నావల్ డాక్‌యార్డులో 281 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు, వివరాలు ఇలా!

RITES: రైట్స్‌ లిమిటెడ్‌లో 30 సివిల్ ఇంజినీర్‌ పోస్టులు, వివరాలు ఇలా!

RITES: రైట్స్‌ లిమిటెడ్‌లో 30 సివిల్ ఇంజినీర్‌ పోస్టులు, వివరాలు ఇలా!

DRDO Recruitment: హైదరాబాద్‌ డీఆర్‌డీఓ-ఆర్‌సీఐలో 150 అప్రెంటిస్‌ పోస్టులు, అర్హతలివే!

DRDO Recruitment: హైదరాబాద్‌ డీఆర్‌డీఓ-ఆర్‌సీఐలో 150 అప్రెంటిస్‌ పోస్టులు, అర్హతలివే!

టాప్ స్టోరీస్

Odisha Train Accident: ఒడిశాలో మరో రైలు విషాదం, బోగీల కింద నలిగి ఆరుగురు మృతి!

Odisha Train Accident: ఒడిశాలో మరో రైలు విషాదం, బోగీల కింద నలిగి ఆరుగురు మృతి!

Dimple Hayathi Case: అరెస్ట్ చేయవద్దని నటి డింపుల్‌ హయతి పిటిషన్, హైకోర్టు ఏం చెప్పిందంటే!

Dimple Hayathi Case: అరెస్ట్ చేయవద్దని నటి డింపుల్‌ హయతి పిటిషన్, హైకోర్టు ఏం చెప్పిందంటే!

10,000 టికెట్లు ఫ్రీ, ‘ఆదిపురుష్’ నిర్మాత కీలక నిర్ణయం - కేవలం వాళ్లకు మాత్రమే!

10,000 టికెట్లు ఫ్రీ, ‘ఆదిపురుష్’ నిర్మాత కీలక నిర్ణయం - కేవలం వాళ్లకు మాత్రమే!

IND VS AUS: టీమిండియాకు ‘హెడ్’ షాట్ - ఫైనల్ తొలి రోజు ఆస్ట్రేలియాదే!

IND VS AUS: టీమిండియాకు ‘హెడ్’ షాట్ - ఫైనల్ తొలి రోజు ఆస్ట్రేలియాదే!