UCIL Recruitment: యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో 239 అప్రెంటిస్ పోస్టులు
ఝార్ఖండ్ రీజియన్ జాదుగూడ మైన్స్‌లోని యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(UCIL) ట్రేడ్ అప్రెంటీస్‌షిప్ శిక్షణకు దరఖాస్తులు కోరుతుంది. దీని ద్వారా మొత్తం 239 అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు.
ఝార్ఖండ్ రీజియన్ జాదుగూడ మైన్స్‌లోని యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(UCIL) ట్రేడ్ అప్రెంటీస్‌షిప్ శిక్షణకు దరఖాస్తులు కోరుతుంది. దీని ద్వారా మొత్తం 239 అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. మెట్రిక్యులేషన్/ పదోతరగతితో పాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. మెరిట్, ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. సరైన అర్హతలు గల అభ్యర్ధులు నవంబర్ 30 లోపు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తుచేసుకోవాల్సి ఉంటుంది.
వివరాలు:
ట్రేడ్ అప్రెంటీస్‌షిప్: 239 ఖాళీలు
ట్రేడుల వారీగా ఖాళీలు:
1) ఫిట్టర్: 80
2) ఎలక్ట్రీషియన్: 80
3)వెల్డర్(గ్యాస్ & ఎలక్ట్రిక్): 40
4) టర్నర్/ మెషినిస్ట్: 12
5) ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్: 05
6) మెకానిక్(డీజిల్/ఎంవీ): 12
7) కార్పెంటర్: 05
8) ప్లంబర్: 05
యూనిట్ల వారీగా ఖాళీలు: జాదుగూడ యూనిట్- 106, నర్వాపహార్ యూనిట్- 52, తురమ్దిహ్ యూనిట్- 81.
అర్హత: మెట్రిక్యులేషన్/ పదోతరగతి, సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణత.
వయోపరిమితి: 30.11.2022 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: మెరిట్ ప్రాతిపదికన, ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా.
ముఖ్యమైన తేదీలు..
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభతేది: 29.10.2022
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 30.11.2022.
Also Read:
సీటెట్-2022 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం - పరీక్ష విధానం, ముఖ్య తేదిలివే!
కేంద్రీయ పాఠశాలల్లో టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించే 'సెంట్రల్ టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (సీటెట్)-2022' దరఖాస్తు ప్రక్రియ అక్టోబరు 31న ప్రారంభమైంది. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 31 నుంచి నవంబర్ 24 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఫీజు చెల్లించడానికి నవంబరు 25 వరకు అవకాశం ఉంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా ఒక్క పేపర్‌కు అయితే రూ.1000 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.500), రెండు పేపర్లకు అయితే రూ.1200 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.500) చెల్లించాల్సి ఉంటుంది. సీటెట్ ఆన్‌లైన్ టెస్టును డిసెంబర్, వచ్చే ఏడాది జనవరి మధ్య నిర్వహించనున్నారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
SSC Recruitment: 24,369 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ! దరఖాస్తు చేసుకోండి! (చివరి తేది: 30.11.2022)
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ)-2022 నోటిఫికేషన్ విడుదలైంది. దీనిద్వారా వివిధ కేంద్ర బలగాల్లో 24,369 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం పోస్టుల్లో పురుషులకు 21,579 పోస్టులు, మహిళలకు 2626 పోస్టులు కేటాయించారు. పదో తరగతి ఉత్తీర్ణత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఇండియన్ నేవీలో ఆఫీసర్ పోస్టులు, ప్రారంభ జీతం రూ.56,100
భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ నేవీ షార్ట్ సర్వీస్ కమిషన్ (SSC) ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అవివాహిత పురుషులు, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఏదైనా డిగ్రీ లేదా పీజీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అకడమిక్ మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు. ఎంపికైనవారికి కేరళ రాష్ట్రం ఎజిమలలోని ఇండియన్ నేవల్ అకాడమీలో జూన్ 2023 ప్రారంభమయ్యే 23వ కోర్సులో సంబంధిత శాఖలు/ కేడర్/ స్పెషలైజేషన్లలో శిక్షణ ఇస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..