అన్వేషించండి

TSPSC Group 4 Application Postponed: 'గ్రూప్-4' ఉద్యోగార్థులకు అలర్ట్, దరఖాస్తు ప్రక్రియ వాయిదా - అప్లికేషన్ కొత్త తేదీలివే!

గ్రూప్-4 పోస్టుల భర్తీకి సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ డిసెంబరు 23 నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా.. సాంకేతిక కారణాల వల్ల వారంపాటు వాయిదావేశారు. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేశారు.

రాష్ట్రంలోని మొత్తం 25 ప్రభుత్వ విభాగాల పరిధిలో 9168 గ్రూప్-4 పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే గ్రూప్-4 పోస్టుల భర్తీకి సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ డిసెంబరు 23 నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా.. సాంకేతిక కారణాల వల్ల వారంపాటు వాయిదావేశారు. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేశారు. తాజా ప్రకటన మేరకు డిసెంబరు 30 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. సరైన అర్హతలున్నవారు జనవరి 19 వరకు తమ దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ పోస్టుల భర్తీకి ఏప్రిల్‌ లేదా మే నెలలో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. 

గ్రూప్-4 ఉద్యోగాల్లో నాలుగు కేటగిరీ పోస్టులున్నాయి. వీటిలో కేటగిరీ-1లో జూనియర్ అకౌంటెంట్-429 పోస్టులు, కేటగిరీ-2లో జూనియర్ అసిస్టెంట్-6,859 పోస్టులు, కేటగిరీ-3లో జూనియర్ ఆడిటర్-18 పోస్టులు, వార్డు ఆఫీసర్-1,862 పోస్టులు ఉన్నాయి. విభాగాల వారీగా అత్యధికంగా పురపాలకశాఖ పరిధిలో 2,701 పోస్టులను భర్తీ చేయనున్నారు. రెవెన్యూశాఖ పరిధిలో 2,077 పోస్టులు ఉండగా.. వీటిలో సీసీఎల్ఏ పరిధిలో 1,294 ఉన్నాయి. సాధారణ, సంక్షేమ గురుకులాల్లో 991 పోస్టులున్నాయి. 

గ్రూప్-4 నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

దరఖాస్తులు భారీగా వచ్చే అవకాశం..
గ్రూప్-4 ఉద్యోగాలకు భారీ సంఖ్యలో దరఖాస్తులు వస్తాయని టీఎస్‌పీఎస్సీ భావిస్తోంది. కనీసం 6-7 లక్షల మధ్యలో రావొచ్చని అంచనా వేస్తోంది. 2018లో రాష్ట్రవ్యాప్తంగా 700 వీఆర్ఓ ఉద్యోగాలకు దాదాపు 10 లక్షల మందికిపైగా దరఖాస్తు చేశారు. పరీక్షకు 76 శాతం మంది హాజరయ్యారు. గ్రూప్-4 కేటగిరీలో 2 వేల లోపు పోస్టులతో ప్రకటన వెలువడినప్పుడు 4.8 లక్షల మంది దరఖాస్తు చేశారు. ప్రస్తుతం ఏకంగా 9,168 పోస్టులు ఉండటంతో భారీ సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశాలున్నాయి.


TSPSC Group 4 Application Postponed:  'గ్రూప్-4' ఉద్యోగార్థులకు అలర్ట్, దరఖాస్తు ప్రక్రియ వాయిదా - అప్లికేషన్ కొత్త తేదీలివే!
 
త్వరలో గ్రూప్-2, గ్రూప్-3 నోటిఫికేషన్లు..
తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న గ్రూప్-2 నోటిఫికేషన్ మరో వారంలో వెలువడే అవకాశం ఉంది. తర్వాత వారం నుంచి రెండు వారాల వ్యవధిలో గ్రూప్ -3 నోటిఫికేషన్ వెలువడనున్నట్లు సమాచారం. గ్రూప్ -2లో భాగంగా 726 ఉద్యోగాలు, గ్రూప్ -3లో 1,373 ఉద్యోగాలు భర్తీ చేయనుంది. గతంలో గ్రూప్-2లో 663 ఉద్యోగాలకు ఆర్థికశాఖ అనుమతి ఇవ్వగా.. తాజా చేర్పుల అనంతరం ఆ సంఖ్య 726కు చేరింది. ప్రభుత్వం గ్రూప్-2లో మరో 6 రకాల పోస్టులు రాష్ట్ర ఎన్నికల సంఘం, ఇతర శాఖలకు చెందిన ఎఎస్‌ఒ, జువైనల్ డిస్ట్రిక్ట్ ప్రొబేషనరీ ఆఫీసర్, అసిస్టెంట్ బిసి వెల్ఫేర్  ఆఫీసర్, అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులును చేర్చింది.
 
అలాగే గ్రూప్-3లో గిరిజన సంక్షేమశాఖ అకౌంటెంట్, హెచ్‌ఒడిల్లోని సీనియర్ అసిస్టెంట్, సీనియర్ అకౌంటెంట్, జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్ పోస్టులను చేర్చింది. గతంలో ప్రభుత్వం ప్రభుత్వం అనుమతించిన పోస్టులకు అదనంగా తాజాగా అనుమతించిన పోస్టులను కలిపి కమిషన్ ప్రకటనలు జారీ చేయనున్నది. కొత్తగా అనుమతించిన పోస్టులకు సంబంధించి ప్రభుత్వ విభాగాల నుంచి కమిషన్‌కు ఇప్పటికే ప్రతిపాదనలు అందాయి. అదనంగా చేర్చినవాటితో కలిపి త్వరలో నోటిఫికేషన్లు జారీ చేసేందుకు టీఎస్‌పీఎస్సీ కసరత్తు చేస్తోంది. 

Also Read:

నిరుద్యోగులకు టీఎస్‌పీఎస్సీ గుడ్ న్యూస్, 207 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు!
తెలంగాణ‌లో ఉద్యోగాల జాత‌ర కొన‌సాగుతూనే ఉంది. ఇప్పటికే ప‌లు ఉద్యోగ నోటిఫికేష‌న్లు వెలువ‌డ‌గా, తాజాగా మ‌రో రెండు నోటిఫికేష‌న్లు విడుద‌లయ్యాయి. వెట‌ర్నరీ, హార్టిక‌ల్చర్ డిపార్ట్‌మెంట్లలో ఖాళీగా ఉన్న 207 ఉద్యోగాల భ‌ర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేష‌న్లు విడుద‌ల చేసింది. వీటిలో వెటర్నరీ విభాగంలో 185 వెట‌ర్నరీ అసిస్టెంట్ స‌ర్జన్ పోస్టుల‌ు ఉండగా, హార్టిక‌ల్చర్ విభాగంలో 22 హార్టిక‌ల్చర్ ఆఫీస‌ర్ పోస్టులు ఉన్నాయి. 

వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Panchayat Elections :  ఏడాది చివరిలోపు స్థానిక ఎన్నికలూ పూర్తి - రేవంత్ పక్కా ప్లాన్‌తో వెళ్తున్నారా ?
ఏడాది చివరిలోపు స్థానిక ఎన్నికలూ పూర్తి - రేవంత్ పక్కా ప్లాన్‌తో వెళ్తున్నారా ?
Jagan On Congress: ఢిల్లీలో వైసీపీ ధర్నాకు కాంగ్రెస్‌ దూరంగా ఉందా? జగన్ దూరం పెట్టారా?
ఢిల్లీలో వైసీపీ ధర్నాకు కాంగ్రెస్‌ దూరంగా ఉందా? జగన్ దూరం పెట్టారా?
Erraballi Dayakar Rao: బీఆర్ఎస్‌తో అంటీముట్టనట్లుగా ఎర్రబెల్లి! సొంత పార్టీలోనే ఇబ్బందులా?
బీఆర్ఎస్‌తో అంటీముట్టనట్లుగా ఎర్రబెల్లి! సొంత పార్టీలోనే ఇబ్బందులా?
Paris Olympics 2024: చరిత్రలో నిలిచిపోయేలా, క్రీడా ప్రపంచం అబ్బురపడేలా
చరిత్రలో నిలిచిపోయేలా, క్రీడా ప్రపంచం అబ్బురపడేలా
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

TTD Special Focus on Tirumala Laddu | తిరుమల లడ్డూపై టీటీడీ ఎందుకు దృష్టి పెట్టాల్సి వచ్చింది..?YS Jagan To Join In India Alliance.. ?| ఇండియా కూటమిలోకి జగన్..? ఇవే టాప్- 5 కారణాలు | ABP DesamOld Music Instruments Repair | ఆనాటి వాయిద్యాల కంటే నేటి ప్లాస్టిక్ చప్పుళ్లపైనే అందరికి మోజు3 Teams May Target Rohit Sharma in the IPL 2025 Mega Auction | ముంబయికి రోహిత్ గుడ్ బై..| ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Panchayat Elections :  ఏడాది చివరిలోపు స్థానిక ఎన్నికలూ పూర్తి - రేవంత్ పక్కా ప్లాన్‌తో వెళ్తున్నారా ?
ఏడాది చివరిలోపు స్థానిక ఎన్నికలూ పూర్తి - రేవంత్ పక్కా ప్లాన్‌తో వెళ్తున్నారా ?
Jagan On Congress: ఢిల్లీలో వైసీపీ ధర్నాకు కాంగ్రెస్‌ దూరంగా ఉందా? జగన్ దూరం పెట్టారా?
ఢిల్లీలో వైసీపీ ధర్నాకు కాంగ్రెస్‌ దూరంగా ఉందా? జగన్ దూరం పెట్టారా?
Erraballi Dayakar Rao: బీఆర్ఎస్‌తో అంటీముట్టనట్లుగా ఎర్రబెల్లి! సొంత పార్టీలోనే ఇబ్బందులా?
బీఆర్ఎస్‌తో అంటీముట్టనట్లుగా ఎర్రబెల్లి! సొంత పార్టీలోనే ఇబ్బందులా?
Paris Olympics 2024: చరిత్రలో నిలిచిపోయేలా, క్రీడా ప్రపంచం అబ్బురపడేలా
చరిత్రలో నిలిచిపోయేలా, క్రీడా ప్రపంచం అబ్బురపడేలా
Old City Bonalu 2024 : లాల్‌ దర్వాజా  సింహ వాహిని బోనాల వేడుకలు..28,29 తేదీల్లో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలివే!
లాల్‌ దర్వాజా సింహ వాహిని బోనాల వేడుకలు..28,29 తేదీల్లో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలివే!
Double iSmart: 'డబుల్‌ ఇస్మార్ట్‌' సాంగ్‌లో కేసీఆర్ వాయిస్‌ వాడటంపై వివాదం - వివరణ ఇచ్చిన మ్యూజిక్‌ డైరెక్టర్ మణిశర్మ
'డబుల్‌ ఇస్మార్ట్‌' సాంగ్‌లో కేసీఆర్ వాయిస్‌ వాడటంపై వివాదం - వివరణ ఇచ్చిన మ్యూజిక్‌ డైరెక్టర్ మణిశర్మ
వయస్సును రివర్స్ చేయొచ్చు - నమ్మడం లేదా? తన ఏజ్‌ను 22 ఏళ్లకు తగ్గించుకున్న ఈ 78 ఏళ్ల డాక్టర్ సీక్రెట్ ఇదే
వయస్సును రివర్స్ చేయొచ్చు - నమ్మడం లేదా? తన ఏజ్‌ను 22 ఏళ్లకు తగ్గించుకున్న ఈ 78 ఏళ్ల డాక్టర్ సీక్రెట్ ఇదే
Wine Shops Closed : మందుబాబులకు బ్యాడ్ న్యూస్, రెండ్రోజులు వైన్స్ షాపులు బంద్
మందుబాబులకు బ్యాడ్ న్యూస్, రెండ్రోజులు వైన్స్ షాపులు బంద్
Embed widget