By: ABP Desam | Updated at : 02 Dec 2022 05:10 AM (IST)
Edited By: omeprakash
టీఎస్‌పీఎస్సీ గ్రూప్-4 నోటిఫికేషన్
నిరుద్యోగులకు టీఎస్‌పీఎస్సీ గుడ్ న్యూస్ తెలిపింది. రాష్ట్రంలో 9168 గ్రూప్-4 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. వచ్చేఏడాది ఏప్రిల్ లేదా మే నెలలో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. ఇటీవలే ఈ పోస్టులకు ఆర్థికశాఖ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. దీంతో తాజాగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రూప్-4 పోస్టుల భర్తీకి డిసెంబరు 23 నుంచి జనవరి 12 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఏప్రిల్ లేదా మే నెలలో పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది.
గ్రూప్-4 ఉద్యోగాల్లో నాలుగు కేటగిరీ పోస్టులున్నాయి. వీటిలో కేటగిరీ-1లో జూనియర్ అకౌంటెంట్ - 429 పోస్టులు, కేటగిరీ-2లో జూనియర్ అసిస్టెంట్ - 6,859 పోస్టులు, కేటగిరీ-3లో జూనియర్ ఆడిటర్ - 18 పోస్టులు, వార్డు ఆఫీసర్ - 1,862 పోస్టులు ఉన్నాయి.
పోస్టుల వివరాలు...
1) జూనియర్ అకౌంటెంట్: 429 పోస్టులు
విభాగాలవారీగా ఖాళీలు: ఆర్థికశాఖ - 191, మున్సిపల్ శాఖ - 238
2) జూనియర్ అసిస్టెంట్: 6,859 పోస్టులు
విభాగాలవారీగా ఖాళీలు:
వ్యవసాయశాఖ-44 | బీసీ సంక్షేమశాఖ-307 | పౌరసరఫరాల శాఖ-72 | అటవీశాఖ-23 |
వైద్యారోగ్యశాఖ-338 | ఉన్నత విద్యాశాఖ-742 | హోంశాఖ-133 | నీటిపారుదల శాఖ-51 |
మైనార్టీ సంక్షేమశాఖ-191 | పురపాలక శాఖ-601 | పంచాయతీరాజ్-1,245 | రెవెన్యూశాఖ-2,077 |
సెకండరీ విద్యాశాఖ-97 | రవాణాశాఖ-20 | గిరిజన సంక్షేమ శాఖ-221 | మహిళా, శిశు సంక్షేమం-18 |
ఆర్థికశాఖ-46 | కార్మికశాఖ-128 | ఎస్సీ అభివృద్ధి శాఖ-474 | యువజన సర్వీసులు-13 |
3) జూనియర్ ఆడిటర్: 18 పోస్టులు
విభాగం: డైరెక్టరేట్ ఆఫ్ స్టేట్ ఆడిట్
4) వార్డ్ ఆఫీసర్: 1862 పోస్టులు
విభాగం: కమిషనర్ & డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్.
పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
Also Read:
తెలంగాణలో గెజిటెడ్ పోస్టులు, ఈ అర్హతలు ఉండాలి!
తెలంగాణలోని ప్రభుత్వ భూగర్భజల విభాగంలో గెజిటెడ్ పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 32 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. అభ్యర్థుల వయసు 18 - 44 సంవత్సరాల మధ్య ఉండాలి. సరైన అర్హతలున్నవారు డిసెంబరు 6 నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. డిసెంబరు 27 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. 2023 మార్చి లేదా ఏప్రిల్ నెలలో పరీక్ష నిర్వహిస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
తెలంగాణలో నాన్-గెజిటెడ్ పోస్టులు, అర్హతలివే!
తెలంగాణలోని ప్రభుత్వ భూగర్భజల విభాగంలో నాన్-గెజిటెడ్ పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 25 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. అభ్యర్థుల వయసు 18 - 44 సంవత్సరాల మధ్య ఉండాలి. సరైన అర్హతలున్నవారు డిసెంబరు 7 నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. డిసెంబరు 28 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. 2023 మార్చి లేదా ఏప్రిల్ నెలలో పరీక్ష నిర్వహిస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
APPSC Mains Exam Schedule: 'గ్రూప్-1' మెయిన్స్ షెడ్యూలు విడుదల, ఏ పరీక్ష ఎప్పుడంటే?
Post Office Jobs: పోస్టాఫీసుల్లో కొలువుల జాతర, 40 వేలకుపైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెల్లడి! తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
APPSC Group1 Prelims Results: గ్రూప్-1 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే! మెయిన్స్కు 6,455 మంది ఎంపిక!
NLC Apprenticeship: నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్లో 626 అప్రెంటిస్ ఖాళీలు, అర్హతలివే!
నిరుద్యోగులకు గుడ్ న్యూస్, మరో 2391 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వ అనుమతి!
IND vs NZ 1st T20: సుందర్ ఒంటరి పోరాటం సరిపోలేదు - మొదటి వన్డేలో టీమిండియా భారీ ఓటమి!
Tarak ratna Health Update : మెరుగైన వైద్యం కోసం బెంగళూరు ఆసుపత్రికి తారకరత్న, కుప్పం నుంచి గ్రీన్ ఛానల్
Perni Nani : అన్నీ మంచి చేస్తే రోడ్డెందుకు ఎక్కాల్సి వచ్చింది ? లోకేష్కు పేర్ని నాని కౌంటర్ !
Pawan Kalyan: ఈ పెళ్లిళ్ల గొడవ ఏంటయ్యా - వివాదాస్పద టాపిక్ టచ్ చేసిన బాలయ్య - పవర్ ప్రోమో చూశారా?