(Source: ECI/ABP News/ABP Majha)
TSPSC Paper Leak: 'ఓఎంఆర్' విధానానికి టీఎస్‌పీఎస్సీ గుడ్‌బై? ఇక నియామక పరీక్షలన్నీ ఆన్‌లైన్‌లోనే!
ఇకపై ఉద్యోగ నియామకాలకు సంబంధించిన రాతపరీక్షలను వేగంగా నిర్వహించి, వెంటనే ఫలితాలు వెల్లడించే దిశగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆన్‌లైన్ విధానంవైపు అడుగులు వేస్తోంది.
➥ ఎస్సెస్సీ, ఐబీపీఎస్ తరహాలో పరీక్షల నిర్వహణ
➥ మొదట ప్రొఫెషనల్ పోస్టులకు, తర్వాత గ్రూప్స్ ఉద్యోగాలకు అమలు యోచనలో టీఎస్‌పీఎస్సీ
రాష్ట్రంలో ప్రశ్నపత్రాల లీకేజీ నేపథ్యంలో పోటీపరీక్షల నిర్వహణ విధానంలో కీలక మార్పులు చేయాలని టీఎస్‌పీఎస్సీ భావిస్తోంది. ఈ మేరకు కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టబోతుంది. ఇకపై ఉద్యోగ నియామకాలకు సంబంధించిన రాతపరీక్షలను వేగంగా నిర్వహించి, వెంటనే ఫలితాలు వెల్లడించే దిశగా.. ఆన్‌లైన్ విధానంవైపు అడుగులు వేస్తోంది. పరీక్ష పత్రాల తయారీ, భద్రత, తదితర సాంకేతిక ఇబ్బందులు లేకుండా భారీ సంఖ్యలో ప్రశ్నలనిధి రూపొందించి, అభ్యర్థుల సంఖ్య ఎంత ఉన్నప్పటికీ విడతల వారీగా పరీక్షలు నిర్వహించనుంది. ప్రస్తుతం 25వేల మంది అభ్యర్థులు హాజరయ్యే పరీక్షలకు మాత్రమే కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహిస్తూ వస్తోంది. అంతకు మించి అభ్యర్థులు హాజరయ్యే పరీక్షలకు ఈ విధానాన్ని విస్తరించనుంది. అభ్యర్థులందరికీ ఒకేసారి కాకుండా విడతల వారీగా పరీక్షలు నిర్వహించి, నార్మలైజేషన్ విధానం అమలు చేయాలని కమిషన్ భావిస్తోంది.
మొదట ప్రొఫెషనల్ పోస్టులకు అమలు..
ఆన్‌లైన్ రాతపరీక్షలను మొదటగా ప్రొఫెషనల్ పోస్టుల ఉద్యోగాలతో ప్రారంభించి, తర్వాత అన్ని ఉద్యోగాలకు అమలు చేయాలని టీఎస్‌పీఎస్సీ నిర్ణయించింది. ఇతర రాష్ట్రాల పీఎస్సీల్లో ఈ విధానం ఇప్పటికే అమలవుతున్నందున ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించింది.
ఎస్సెస్సీ, ఐబీపీఎస్ తరహాలో..
స్టాఫ్ సెలక్షన్ సర్వీస్ కమిషన్, ఐబీపీఎస్, ఇతర పబ్లిక్ సర్వీస్ కమిషన్ల తరహాలోనే 'నార్మలైజేషన్' విధానాన్ని అమలు చేసే యోచనలో టీఎస్‌పీఎస్సీ భావిస్తోంది. ఉద్యోగాలకు పోటీపడే అభ్యర్థుల సంఖ్య ఓవైపు గణనీయంగా పెరుగుతోంది. లక్షల సంఖ్యలో అభ్యర్థులకు ఒకేరోజున పరీక్షలు నిర్వహించడం కష్టసాధ్యమే. ఈ నేపథ్యంలో అభ్యర్థులకు విడతల వారీగా ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహిస్తూ వస్తున్నాయి. ఒక్కోసారి ఈ పరీక్షలు వారం రోజులపాటు జరుగుతున్నాయి.
రాష్ట్రంలో ప్రస్తుతం ఇలా..
రాష్ట్రంలో ప్రస్తుతం 25వేల మంది అభ్యర్థుల వరకు మాత్రమే ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహించేందుకు మౌలిక వనరులు ఉన్నాయి. తాజాగా ఇంజినీరింగ్, ప్రొఫెషనల్ కళాశాలల్లోని కంప్యూటర్ ల్యాబ్‌లు వినియోగించుకుంటే 50వేల మంది వరకు పెరుగుతుందని అంచనా. అభ్యర్థుల సంఖ్య ఇంకా పెరిగినా ఇబ్బందులు లేకుండా అవసరమైతే విడతల వారీగా నిర్వహించాలన్న ఆలోచన చేస్తోంది. ఇంజినీరింగ్, ఇతర ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఈ పరీక్షలు, విధానంపై ఇప్పటికే అభ్యర్థుల్లో అవగాహన ఉందని భావిస్తోంది. టీఎస్‌పీఎస్సీ నిర్వహించే వెటర్నరీ అసిస్టెంట్, డ్రగ్ ఇన్‌స్పెక్టర్, ఏఎంవీఐ, పాలిటెక్నిక్ లెక్చరర్లు, ఏఈ, ఏఈఈ తదితర పరీక్షలకు ఆన్‌లైన్ విధానాన్ని అమలు చేయనుంది. గ్రూపు సర్వీసుల ఉద్యోగాలకు ఈ విధానం అమలు చేయాలని గతంలోనే భావించినప్పటికీ, నిరుద్యోగుల్లో కొంత గందరగోళం నెలకొంటుందని పాత విధానాన్ని కొనసాగించింది. ప్రస్తుతం ఓఎంఆర్ పద్ధతి అవలంబించినప్పటికీ, భవిష్యత్తులో నార్మలైజేషన్ ఆధారితంగా విడతల వారీగా పరీక్షలు పూర్తిచేసేలా నిబంధనలు సవరించనుంది.
నార్మలైజేషన్‌తో మార్కుల ఖరారు..
ఏదైనా ఉద్యోగ నియామక పరీక్ష, ప్రవేశపరీక్షకు లక్షల సంఖ్యలో అభ్యర్థులు ఉన్న పక్షంలో విడతల వారీగా నియామక సంస్థలు వివిధ సెట్లు నిర్వహిస్తున్నాయి. ఉదయం, మధ్యాహ్న వేళల్లో వీటిని రెండు, మూడు రోజుల పాటు అందరూ హాజరయ్యేలా షెడ్యూలు ప్రకారం పరీక్షలు నిర్వహిస్తున్నాయి. రాష్ట్రంలో ప్రవేశ పరీక్షలన్నీ ఇప్పటికే ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తున్నారు. ఉదయం కొంత మందికి, మధ్యాహ్నం మరికొంత మందికి పరీక్షలు జరుగుతున్నాయి. ఒక సెషనలో నిర్వహించిన పరీక్షకు హాజరైన అభ్యర్థులకు వచ్చిన ప్రశ్నలు మరోసెషనల్‌లో నిర్వహించే పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు రావు. ఈ మేరకు భారీ సంఖ్యలో ప్రశ్నల నిధి ఉంటుంది. ప్రశ్నల కాఠిన్యతలోనూ తేడా ఉంటుంది. ఉదయం పూట పరీక్ష ప్రశ్నల కాఠిన్యత ఎక్కువగా ఉంటే, ఇక మధ్యాహ్నం కాఠిన్యత తక్కువగా ఉండొచ్చు. ఈ వ్యత్యాసాల నేపథ్యంలో నార్మలైజేషన్ విధానాన్ని అవలంబిస్తున్నాయి. ఉదయం నిర్వహించిన పరీక్షలో గరిష్ఠంగా మార్కులు వచ్చిన అభ్యర్థుల సగటు, స్టాండర్డ్ డీవియేషన్ తీసుకుని మార్కులు లెక్కిస్తారు. అలాగే మధ్యాహ్నం పూట పరీక్షరాసిన అభ్యర్థులకు ఇదే పద్ధతిని పాటించి నార్మలైజేషన్ ఫార్ములా ప్రకారం తుది మార్కులు లెక్కిస్తారు.
పేపర్ లీకేజీ ఎఫెక్ట్, ప్రక్షాళన దిశగా టీఎస్‌పీఎస్సీ!
తెలంగాణలో టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం తీవ్ర దుమారానికి దారితీసిన సంగతి తెలిసిందే. ఇంటిదొంగలే మోసం చేశారని సాక్షాత్తు టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ గోడు వెల్లబోసుకోవాల్సి వచ్చిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. దీంతో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో ప్రక్షాళన మొదలుపెట్టింది. కమిషన్‌లో అంతర్గత బదిలీలకు రంగం సిద్ధమైంది. టీఎస్‌పీఎస్సీ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ప్రవీణ్‌కుమార్, సిస్టమ్ అడ్మిన్ రాజశేఖర్‌రెడ్డి కలిసి ప్రశ్నపత్రాలను లీక్ చేసినట్టు తేలడంతో కొత్త సంస్కరణలకు కమిషన్ శ్రీకారం చుట్టింది. కార్యాలయంలో సిబ్బంది తక్కువగా ఉండటం, పనిభారం ఎక్కువ కావడం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటూనే.. బదిలీలు చేయాలని కమిషన్ భావిస్తోంది.
మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి..
Also Read:
పేపర్ లీకేజీ ఎఫెక్ట్, ప్రక్షాళన దిశగా టీఎస్‌పీఎస్సీ!
తెలంగాణలో టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం తీవ్ర దుమారానికి దారితీసిన సంగతి తెలిసిందే. ఇంటిదొంగలే మోసం చేశారని సాక్షాత్తు టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ గోడు వెల్లబోసుకోవాల్సి వచ్చిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. దీంతో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో ప్రక్షాళన మొదలుపెట్టింది. కమిషన్‌లో అంతర్గత బదిలీలకు రంగం సిద్ధమైంది. టీఎస్‌పీఎస్సీ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ప్రవీణ్‌కుమార్, సిస్టమ్ అడ్మిన్ రాజశేఖర్‌రెడ్డి కలిసి ప్రశ్నపత్రాలను లీక్ చేసినట్టు తేలడంతో కొత్త సంస్కరణలకు కమిషన్ శ్రీకారం చుట్టింది. కార్యాలయంలో సిబ్బంది తక్కువగా ఉండటం, పనిభారం ఎక్కువ కావడం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటూనే.. బదిలీలు చేయాలని కమిషన్ భావిస్తోంది.
మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి..
'గ్రూప్-1' పేపర్ మొదటి టార్గెట్, జూన్‌లోనే పేపర్ లీకేజీకి స్కెచ్!
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో నిందితుల నుంచి సిట్ అధికారుల దర్యాప్తు కొనసాగుతోంది. ప్రధాన నిందితులైన ప్రవీణ్‌కుమార్, రాజశేఖర్‌రెడ్డి గ్రూప్-1 పేపర్ కోసం జూన్ నుంచే ప్రయత్నాలు మొదలు పెట్టి, అక్టోబర్ మొదటి వారంలో పేపర్‌ను అపహరించినట్లు విచారణలో వెల్లడైంది. పేపర్ లీకేజీ ఘటనలో నిందితులుగా 9 మందిని మూడో రోజు సిట్ అధికారులు విచారించారు. వీరి నుంచి పలు ప్రశ్నలపై సమాధానాలు రాబట్టారు. మొదటి రెండు రోజులు ఒక్కొక్కరిని, ఇద్దరిద్దరిని కలిపి విచారించిన సిట్, మూడో రోజు కొద్ది సేపు అందరినీ కలిపి విచారించింది.
మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి..
'గ్రూప్-1' పేపర్ లీకేజీలో ఎక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థుల జాబితా సిద్ధం!
తెలంగాణలో రోజురోజుకి ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం మరింత వేడెక్కుతోంది. 'గ్రూప్-1' ప్రశ్నపత్రాన్ని రాజశేఖర్ రెడ్డి ముఠా అనేక మందికి అమ్మినట్లు సిట్ భావిస్తోంది. ప్రస్తుతం ఎవరెవరికి అందిందనేది నిగ్గు తేల్చేందుకు ప్రయత్నిస్తోంది. గ్రూప్-1 పరీక్షలో సుమారు 25 వేల మంది మెయిన్స్‌కు అర్హత సాధించారు. అందులో 100 స్కోర్ దాటిన వారు ఎంతమంది ఉన్నారు? వారికి ప్రవీణ్, రాజశేఖర్, రేణుకకు ఎలాంటి సంబంధాలున్నాయనే అంశాలపై ఫోకస్ పెట్టారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం 100కు పైగా మార్కులు సాధించిన 'గ్రూప్-1' అభ్యర్థుల జాబితా రూపొందించిన సిట్ అధికారులు వారిలో అనుమానితులను విచారించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.
మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి..