News
News
వీడియోలు ఆటలు
X

TSPSC Paper Leak: 'గ్రూప్-1' పేపర్ లీక్ స్కాంలో సిట్ దూకుడు, మరో ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు!

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ ఘటనలో సిట్ విచారణపై దూకుడు పెంచింది. నిందితులను విచారిస్తున్న సిట్.. పేపర్ లీక్ ఘటనలో మరో ముగ్గురు టీఎస్‌పీఎస్సీ ఉద్యోగుల హస్తం ఉన్నట్లు సిట్ గుర్తించింది.

FOLLOW US: 
Share:

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ ఘటనలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణపై దూకుడు పెంచింది. నిందితులను విచారిస్తున్న సిట్.. కీలక ఆధారాలు సేకరిస్తుంది. పేపర్ లీక్ ఘటనలో మరో ముగ్గురు టీఎస్‌పీఎస్సీ ఉద్యోగుల హస్తం ఉన్నట్లు సిట్ గుర్తించింది. వాళ్లు కూడా పేపర్ లీక్‌లో భాగస్వామ్యం అయ్యారని గుర్తించిన సిట్.. వాళ్లపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ప్రస్తుతం వారు పరారీలో ఉన్నారు. వాళ్లకోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు సిట్ అధికారులు తెలిపారు. అయితే, వాళ్ల వివరాలేవీ తెలియరాలేదు. ఈ ముగ్గురే కాకుండా టీఎస్పీఎస్సీలో పనిచేస్తున్న మరో 30 మందికి సిట్ నోటీసులు జారీ చేసింది. అంతేకాకుండా గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో ర్యాంకు సాధించిన వాళ్లలో నిందితుడు రాజశేఖర్ సన్నిహితుడు సురేశ్ ఉన్నట్లు సిట్ దర్యాప్తులో వెల్లడైంది. టీఎస్‌పీఎస్సీ నుంచి పేపర్‌ తీసుకొచ్చి సురేష్‌కు ఇచ్చినట్లు గుర్తించారు.

పేపరులీకేజీలో నిందితులుగా ఉన్న 9 మందిని 7 గంటలపాటు ప్రశ్నించిన సిట్.. సురేష్‌ ఎంత మందికి పేపర్‌ ఇచ్చాడన్నదానిపై ప్రశ్నించింది. రేణుక, నీలేష్‌, గోపాల్‌ మధ్య జరిగిన రూ.14 లక్షల లావాదేవీలపై, రాజశేఖర్‌ వాట్సాప్‌ చాటింగ్‌పైనా సిట్ అధికారులు ఆరా తీశారు. పలు అంశాలపై ఆధారాలు సేకరించినట్లు సైబర్‌క్రైమ్‌ టెక్నికల్‌ టీమ్‌ తెలిపింది. టీఎస్‌పీఎస్సీలో పనిచేస్తున్న 42 మందికి సిట్‌ నోటీసులు ఇచ్చింది. TSPSCలో పనిచేస్తున్న వారందరినీ విచారిస్తున్నట్లు దర్యాప్తు సంస్థ చెప్పింది. ప్రవీణ్‌, రాజశేఖర్‌తో సంబంధాలున్న వారందరిపై విచారణ చేపట్టారు. ఇప్పటికే శంకర్‌లక్ష్మిని రెండుసార్లు, టెక్నికల్‌ డిపార్ట్‌మెంట్‌తో సంబంధం ఉన్నవారందరినీ సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు.

Also Read:  'పేపర్ లీక్' దర్యాప్తు ముమ్మరం, 40 మంది టీఎస్‌పీఎస్సీ సిబ్బందికి నోటీసులు జారీ!

103 మందికి 100 మార్కులుపైగా..
గ్రూప్-1లో 103 మందికి 100 మార్కులుపైగా వచ్చినట్లు గుర్తించారు. వీరిలో 20 మంది టీఎస్‌పీఎస్సీలో ఉద్యోగం చేస్తూ.. ర్యాంక్‌లు సంపాదించినవారు ఉన్నట్లు తేలింది. ఈ 20 మందిలో మెయిన్స్ పరీక్షకు 8 మంది అర్హత సాధించినట్లు సిట్ విచారణలో బహిర్గతమైంది. ఇందులో ఇద్దరికి 100కి పైగా మార్కులు వచ్చాయి. అయితే పరీక్ష రాసిన 20 మందిలో ముగ్గురిని నిందితుల జాబితాలో సిట్ చేర్చింది.

పేపర్ లీకేజీలో ముగిసిన నిందితుల కస్టడీ..
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసు ఐదోరోజు సిట్ విచారణ ముగిసింది. 9 మంది నిందితులను సిట్ అధికారులు 7 గంటలపాటు ప్రశ్నించారు. సైబర్ క్రైమ్ టెక్నికల్ టీమ్ సాంకేతిక ఆధారాలు సేకరించింది. రేణుక, నీలేష్, గోపాల్ మధ్య రూ.14 లక్షల ఆర్ధిక లావాదేవీలపై సిట్ అధికారులు ఆరా తీసినట్లు తెలుస్తోంది. రాజశేఖర్ కాంటాక్ట్స్, వాట్సాప్ చాటింగ్ వివరాలపై దర్యాప్తు అధికారులు ప్రశ్నించారు. రాజశేఖర్ స్నేహితుడు సురేష్ ఎవరికైనా ప్రశ్నాపత్రం లీక్ చేశాడా?.. అనే కోణంలో సురేష్ను విచారించారు. సురేష్, రాజశేఖర్ లావాదేవీలు, వాట్సాప్, కాల్ డేటాపై సిట్ అధికారులు ప్రశ్నించారు. 

టీఎస్‌పీఎస్సీలో పని చేస్తున్న 30 మందికి పైగా ఉద్యోగులకు నోటీసులు జారీ చేశారు. వీరిలో ఒక్కొక్కరిని సిట్ అధికారులు విడివిడిగా విచారణ చేయనున్నారు. మార్చి 23న మరోసారి కాన్ఫిడెన్షియల్ రూం సెక్షన్ అధికారి శంకర్ లక్ష్మీ స్టేట్‌మెంట్ రికార్డ్ చేయనున్నారు. టీఎస్ పీఎస్సీ ఉద్యోగులతోపాటు..లీకేజీలో కీలకంగా ఉన్న రేణుకతో సన్నిహితంగా ఉన్న కోచింగ్ సెంటర్ నిర్వాహకలు, అభ్యర్థులను సైతం విచారించాలని నిర్ణయించింది సిట్.  గ్రూప్ 1 ర్యాంక్ సాధించిన రాజశేఖర్ ఫ్రెండ్ రమేష్ పాత్రపైనా అనుమానాలు ఉండటంతో అతన్ని కూడా మరోసారి విచారించాలని నిర్ణయించారు.

Also Read: 

'గ్రూప్‌-1' పేపర్‌ మొదటి టార్గెట్, జూన్‌లోనే పేపర్‌ లీకేజీకి స్కెచ్‌!
టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ వ్యవహారంలో నిందితుల నుంచి సిట్‌ అధికారుల దర్యాప్తు కొనసాగుతోంది. ప్రధాన నిందితులైన ప్రవీణ్‌కుమార్‌, రాజశేఖర్‌రెడ్డి గ్రూప్‌-1 పేపర్‌ కోసం జూన్‌ నుంచే ప్రయత్నాలు మొదలు పెట్టి, అక్టోబర్‌ మొదటి వారంలో పేపర్‌ను అపహరించినట్లు విచారణలో వెల్లడైంది. పేపర్‌ లీకేజీ ఘటనలో నిందితులుగా 9 మందిని మూడో రోజు సిట్‌ అధికారులు విచారించారు. వీరి నుంచి పలు ప్రశ్నలపై సమాధానాలు రాబట్టారు. మొదటి రెండు రోజులు ఒక్కొక్కరిని, ఇద్దరిద్దరిని కలిపి విచారించిన సిట్‌, మూడో రోజు కొద్ది సేపు అందరినీ కలిపి విచారించింది.
మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి..

'గ్రూప్-1' పేపర్ లీకేజీలో ఎక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థుల జాబితా సిద్ధం!
తెలంగాణలో రోజురోజుకి ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం మరింత వేడెక్కుతోంది. 'గ్రూప్-1' ప్రశ్నపత్రాన్ని రాజశేఖర్ రెడ్డి ముఠా అనేక మందికి అమ్మినట్లు సిట్ భావిస్తోంది. ప్రస్తుతం ఎవరెవరికి అందిందనేది నిగ్గు తేల్చేందుకు ప్రయత్నిస్తోంది. గ్రూప్‌-1 పరీక్షలో సుమారు 25 వేల మంది మెయిన్స్‌కు అర్హత సాధించారు. అందులో 100 స్కోర్‌ దాటిన వారు ఎంతమంది ఉన్నారు? వారికి ప్రవీణ్‌, రాజశేఖర్‌, రేణుకకు ఎలాంటి సంబంధాలున్నాయనే అంశాలపై ఫోకస్‌ పెట్టారు.  విశ్వసనీయ సమాచారం ప్రకారం 100కు పైగా మార్కులు సాధించిన 'గ్రూప్-1' అభ్యర్థుల జాబితా రూపొందించిన సిట్ అధికారులు వారిలో అనుమానితులను విచారించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.
మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

Published at : 23 Mar 2023 10:48 AM (IST) Tags: Paper leak Group 1 paper leak TSPSC Paper Leakage TSPSC Group 1 Paper Leakage Group 1 Paper Leakage

సంబంధిత కథనాలు

TSPSC: నేడే 'గ్రూప్‌-1' ప్రిలిమినరీ పరీక్ష, 15 నిమిషాల ముందే గేట్లు మూసివేత! అభ్యర్థులకు ముఖ్య సూచనలు!

TSPSC: నేడే 'గ్రూప్‌-1' ప్రిలిమినరీ పరీక్ష, 15 నిమిషాల ముందే గేట్లు మూసివేత! అభ్యర్థులకు ముఖ్య సూచనలు!

TSPSC HO Exam Halltickets: జూన్ 11 నుంచి హార్టికల్చర్‌ హాల్‌టికెట్లు అందుబాటులోకి! పరీక్ష ఎప్పుడంటే?

TSPSC HO Exam Halltickets: జూన్ 11 నుంచి హార్టికల్చర్‌ హాల్‌టికెట్లు అందుబాటులోకి! పరీక్ష ఎప్పుడంటే?

Postal Jobs: 12,828 పోస్టాఫీసు ఉద్యోగాల దరఖాస్తుకు రేపే ఆఖరు, వెంటనే దరఖాస్తు చేసుకోండి!

Postal Jobs: 12,828 పోస్టాఫీసు ఉద్యోగాల దరఖాస్తుకు రేపే ఆఖరు, వెంటనే దరఖాస్తు చేసుకోండి!

TSPSC Group 1 Exam: వారికీ గ్రూప్-1 హాల్‌టికెట్లు ఇవ్వండి, టీఎస్‌పీఎస్సీని ఆదేశించిన హైకోర్టు!

TSPSC Group 1 Exam: వారికీ గ్రూప్-1 హాల్‌టికెట్లు ఇవ్వండి, టీఎస్‌పీఎస్సీని ఆదేశించిన హైకోర్టు!

TS Group-1: రేపే 'గ్రూప్‌-1' ప్రిలిమినరీ పరీక్ష, అభ్యర్థులకు ముఖ్య సూచనలు!

TS Group-1: రేపే 'గ్రూప్‌-1' ప్రిలిమినరీ పరీక్ష, అభ్యర్థులకు ముఖ్య సూచనలు!

టాప్ స్టోరీస్

KTR About Dharani: భూమి సమస్యలను పరిష్కరించే బ్రహ్మాస్త్రం ధరణి - కేటీఆర్ నోట కేసీఆర్ మాట

KTR About Dharani: భూమి సమస్యలను పరిష్కరించే బ్రహ్మాస్త్రం ధరణి - కేటీఆర్ నోట కేసీఆర్ మాట

Weather Latest Update: నేడు రాయలసీమకు వర్ష సూచన, రుతుపవనాల గమనం ఎలా ఉందంటే

Weather Latest Update: నేడు రాయలసీమకు వర్ష సూచన, రుతుపవనాల గమనం ఎలా ఉందంటే

Visakha Temperature: విశాఖలో భానుడి ప్రతాపం- 100 ఏళ్లలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు, ఎంతంటే!

Visakha Temperature: విశాఖలో భానుడి ప్రతాపం- 100 ఏళ్లలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు, ఎంతంటే!

IND VS AUS: ఆశలన్నీ ఆదివారం పైనే - ఈ ఒక్క రోజు ఆడితే కప్పు మనదే!

IND VS AUS: ఆశలన్నీ ఆదివారం పైనే - ఈ ఒక్క రోజు ఆడితే కప్పు మనదే!