TSPSC HO Exam Halltickets: జూన్ 11 నుంచి హార్టికల్చర్ హాల్‌టికెట్లు అందుబాటులోకి! పరీక్ష ఎప్పుడంటే?
తెలంగాణలో హార్టికల్చర్ ఆఫీసర్ పరీక్షను జూన్ 17న నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. జూన్ 11న సాయంత్రం 5 గంటల నుంచి హాల్‌టికెట్లు అందుబాటులో ఉంచనున్నారు.
ప్రశ్నపత్రాల లీకేజీ నేపథ్యంలో వాయిదా పడిన హార్టికల్చర్ ఆఫీసర్ పరీక్షను జూన్ 17న నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం (జూన్ 11) నుంచి అభ్యర్థులు తమ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకునేందుకు టీఎస్‌పీఎస్సీ అనుమతించింది. జూన్ 11న సాయంత్రం 5 గంటల నుంచి హాల్‌టికెట్లు అందుబాటులో ఉంచుతామని ఓ ప్రకటనలో తెలిపింది. అంతేకాకుండా అభ్యర్థులు ప్రాక్టీస్ కోసం మాక్ టెస్ట్ లింకును కూడా అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు తెలిపింది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ హార్టికల్చర్ విభాగంలో ఖాళీల భర్తీకీ గతేడాది డిసెంబరు 22న టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా మొత్తం 22 హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగాల్లో డిగ్రీ లేదా పీజీ డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థుల నుంచి జనవరి 3 నుంచి 24 వరకు దరఖాస్తులు స్వీకరిచింది.
టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసు తరువాత సిట్ అధికారుల సూచనలు మేరకు టీఎస్‌పీఎస్సీ ఇప్పటికే నిర్వహించిన గ్రూప్ -1 ప్రిలిమ్స్, ఏఈఈ, డీఏవో, ఏఈ పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. అంతే కాకుండా ఈ నెలలో జరగాల్సిన టీపీబీవో, వెటర్నరీ అసిస్టెంట్ పోస్టుల పరీక్షలను సైతం కమిషన్ వాయిదా వేసింది. వీటితోపాటు హార్టికల్చర్ ఆఫీసర్ పరీక్షను కూడా టీఎస్‌పీస్సీ వాయిదా వేసింది.
హార్టికల్చర్ ఆఫీసర్ పరీక్ష విధానం..
➥ మొత్తం 450 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు.
➥ ఇందులో పేపర్-1 (జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ): 150 ప్రశ్నలు-150 మార్కులు, పేపర్-2 (హార్టీకల్చర్-డిగ్రీ స్థాయి): 150 ప్రశ్నలు-300 మార్కులు ఉంటాయి.
➥ పేపర్-1లో ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు, పేపర్-2లో ఒక్కో ప్రశ్నలకు 2 మార్కులు ఉంటాయి.
➥ పేపర్-1 ప్రశ్నపత్రం ఇంగ్లిష్, తెలుగులోనూ, పేపర్-2 ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌లో మాత్రమే ఉంటుంది.
నోటిఫికేషన్, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..
Also Read:
DRDO: డీఆర్‌డీఓ ఆర్‌ఏసీలో 181 సైంటిస్ట్ పోస్టులు, ఈ అర్హతలుండాలి!
ఢిల్లీలోని డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్‌డీఓ) ఆధ్వర్యంలోని రిక్రూట్‌మెంట్ అండ్ అసెస్‌మెంట్ సెంటర్(ఆర్‌ఏసీ) సైంటిస్ట్ పోస్టుల భర్తీకి మే 25న నోటిఫికేషన్ వెలువడింది. త్వరలోనే ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైన నాటినుంచి 21 రోజుల్లో అభ్యర్థులు తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. గేట్ స్కోర్, షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ/ ఇంజినీరింగ్ డిగ్రీ/ మాస్టర్స్‌డిగ్రీ ఉత్తీర్ణత. గేట్ పరీక్షలో అర్హత సాధించాలి.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
టాటా స్టీల్-ఇంజినీర్ ట్రెయినీ పోస్టులు, ఎంపికైతే ఏడాదికి రూ.7లక్షల జీతం!
టాటా స్టీల్ సంస్థ అస్పైరింగ్ ఇంజినీర్స్ ప్రోగ్రామ్ ద్వారా ఇంజినీర్ ట్రెయినీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంజినీరింగ్ డిగ్రీ లేదా ఎంటెట్/ఎంఎస్సీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆన్‌లైన్ ద్వారా అభ్యర్థులు జూన్ 11 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. కాగ్నిటివ్, టెక్నికల్ టెస్ట్‌లో మెరిట్ సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. అందులో ప్రతిభ చూపిన వారిని తుది ఎంపిక చేస్తారు.
పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..