By: ABP Desam | Updated at : 29 May 2023 09:28 PM (IST)
Edited By: omeprakash
టాటా స్టీల్ ఇంజినీరింగ్ ట్రైయినీ ఉద్యోగాలు
టాటా స్టీల్ సంస్థ అస్పైరింగ్ ఇంజినీర్స్ ప్రోగ్రామ్ ద్వారా ఇంజినీర్ ట్రెయినీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంజినీరింగ్ డిగ్రీ లేదా ఎంటెట్/ఎంఎస్సీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆన్‌లైన్ ద్వారా అభ్యర్థులు జూన్ 11 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. కాగ్నిటివ్, టెక్నికల్ టెస్ట్‌లో మెరిట్ సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. అందులో ప్రతిభ చూపిన వారిని తుది ఎంపిక చేస్తారు
వివరాలు...
* టాటా స్టీల్ అస్పైరింగ్ ఇంజినీర్స్ ప్రోగ్రామ్-2023
ఇంజినీర్ ట్రెయినీ పోస్టులు
విభాగాలు: సివిల్ & స్ట్రక్చరల్, సిరామిక్, కెమికల్, ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ ఇన్‌స్ట్రుమెంటేషన్/పవర్ ఎలక్ట్రానిక్స్, ఎన్విరాన్‌మెంట్ ఇంజినీరింగ్, మెకానికల్, మెటలర్జీ, మినరల్, మైనింగ్, బెనిఫికేషన్ ఇంజినీరింగ్, ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్, మెకాట్రోనిక్స్, జియోఇన్‌ఫర్మాటిక్స్, ఎంటెక్/ ఎంఎస్సీ (జియోలజీ, జియోఫిజిక్స్, రిమోట్ సెన్సింగ్, జీఐఎస్)
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/ బీటెక్/ బీఎస్సీ/ఎంటెక్/ఎంఎస్సీ అర్హత ఉండాలి.
వయోపరిమితి: 01.06.2023 వరకు 30 సంవత్సరాలకు మించకూడదు. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 32 ఏళ్లు వరకు వయసులో సడలింపు ఉంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: కాగ్నిటివ్, టెక్నికల్ టెస్ట్‌లో మెరిట్ సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. అందులో ప్రతిభ చూపిన వారిని తుది ఎంపిక చేస్తారు.
జీతభత్యాలు: ఇంజినీర్ ట్రెయినీ శిక్షణను పూర్తిచేసిన అభ్యర్థులకు ఫిక్స్‌డ్ టర్మ్ ప్రాతిపదికన అసిస్టెంట్ మేనేజర్ హోదాలో ఉద్యోగం కల్పిస్తారు. శిక్షణ సమయంలో స్టైపెండ్ నెలకు రూ.30,000 చెల్లిస్తారు. ఉద్యోగంలో చేరిన తర్వాత ఏటా రూ.7 లక్షలు చెల్లిస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తు చివరితేది: 11.06.2023
Also Read:
ఏపీ సమగ్ర శిక్షా సొసైటీలో 1,358 టీచింగ్ పోస్టులు - వివరాలు ఇలా!
ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా సొసైటీ (పాఠశాల విద్యాశాఖ) ఆధ్వర్యంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా మొత్తం 1358 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో ప్రిన్సిపల్-92 పోస్టులు, పీజీటీ- 846 పోస్టులు, సీఆర్‌టీ-374 పోస్టులు, పీఈటీ-46 పోస్టులు ఉన్నాయి. కాంట్రాక్ట్ విధానంలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన మహిళా అభ్యర్థులు దరఖాస్తు ఫీజు కింద రూ.100 చెల్లించి మే 29 నుంచి జూన్ 4 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక విధానం, జిల్లాలు, సబ్జెక్టుల వారీగా ఖాళీలు తదితర వివరాలకు సంబంధించిన సమగ్ర నోటిఫికేషన్ మే 29న వెల్లడి కానుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్‌లో 608 ట్రేడ్, ఫ్రెషర్ అప్రెంటిస్ పోస్టులు- అర్హతలివే!
ఝార్ఖండ్ రాష్ట్రం రాంచీలోని సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్(సీసీఎల్) ట్రేడ్, ఫ్రెషర్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 608 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ట్రేడును అనుసరించి మెట్రిక్యులేషన్, ఐటీఐ, సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత ఉన్నవారు ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి. ఈ పోస్టులకి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా జూన్ 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ESIC Recruitment 2023: ఈఎస్ఐసీ ఆసుపత్రుల్లో 1,038 పారామెడికల్ స్టాఫ్ పోస్టులు, తెలంగాణ రీజియన్‌లో ఎన్ని పోస్టులంటే?
IOCL: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో గ్రాడ్యుయేట్ ఇంజినీర్ పోస్టులు, సంక్షిప్త ప్రకటన విడుదల
NBE Jobs: నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మెడికల్ సైన్సెస్‌లో 48 ఖాళీలు
AAICLAS: ఏఏఐసీఎల్ఏఎస్-లద్దాఖ్‌లో సెక్యూరిటీ స్క్రీనర్ ఉద్యోగాలు, ఈ అర్హతలుండాలి
PJTSAU Jobs: జయశంకర్ వ్యవసాయ వర్సిటీలో ఉద్యోగాలు, వివరాలు ఇలా
Breaking News Live Telugu Updates: చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఏపీ వ్యాప్తంగా మోత మోగిస్తున్న టీడీపీ శ్రేణులు
Bhadrachalam: మంత్రి కేటీఆర్ పర్యటనలో విషాదం- నాలాలో పడి మహిళా హెడ్ కానిస్టేబుల్ మృతి
Lyca Productions: మలయాళంలో లైకా ప్రొడక్షన్స్ ఎంట్రీ - బ్లాక్‌బస్టర్ మూవీ సీక్వెల్‌తో
Rs 2,000 Exchange Deadline: రూ. 2000 నోట్లు మార్చుకోలేదా, అయితే మీకు RBI శుభవార్త - చివరి తేదీ ఇదే
/body>