By: ABP Desam | Updated at : 20 Jan 2023 07:27 PM (IST)
Edited By: omeprakash
అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులు
తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌లో ఖాళీల భర్తీకి టీఎస్‌పీఎస్సీ డిసెంబరు 31 నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. దీనిద్వారా 78 పోస్టులకు భర్తీచేయనున్నారు. వీటిలో అకౌంట్స్ ఆఫీసర్-01, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్-13, సీనియర్ అకౌంటెంట్-64 పోస్టులు ఉన్నాయి. కామర్స్ డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
ఈ పోస్టుల భర్తీకి జనవరి 20న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఫిబ్రవరి 11 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. రాతపరీక్ష ద్వారా ఉద్యోగ ఎంపిక చేపట్టనున్నారు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.320 చెల్లించాలి. ఇందులో రూ.200 ఆన్‌లైన్ ప్రాసెసింగ్ ఫీజు కింద, రూ.80 పరీక్ష ఫీజు కింద చెల్లించాల్సి ఉంటుంది. నిరుద్యోగులకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు పరీక్ష ఫీజు చెల్లిస్తే సరిపోతుంది.
పోస్టుల వివరాలు..
ఖాళీల సంఖ్య: 78
1) అకౌంట్స్ ఆఫీసర్: 01
2) జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్: 13
3) సీనియర్ అకౌంటెంట్: 64
అర్హత: కామర్స్ డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
వయోపరిమితి: 01.07.2022 నాటికి 18-44 సంవత్సరాల మధ్య ఉండాలి. 02.07.1978 - 01.07.2004 మధ్య జన్మించి ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు ఫీజు: రూ.320. ఇందులో రూ.200 ఆన్‌లైన్ ప్రాసెసింగ్ ఫీజు కింద, రూ.80 పరీక్ష ఫీజు కింద చెల్లించాల్సి ఉంటుంది. నిరుద్యోగులకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు పరీక్ష ఫీజు చెల్లిస్తే సరిపోతుంది.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ రాతపరీక్ష ఆధారంగా.
పోస్టుల వివరాలు,నోటిఫికేషన్, పరీక్ష వివరాల కోసం క్లిక్ చేయండి..
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 20.01.2023.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 11.02.2023.
Also Read:
తెలంగాణ డిగ్రీ కాలేజీల్లో 544 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్, వివరాలు ఇలా!
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి మరో నోటిఫికేషన్ విడుదలైంది. కళాశాల విద్యాశాఖలో 544 ఉద్యోగాల భర్తీకి టీఎస్‌పీఎస్సీ డిసెంబరు 31న నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో డిగ్రీ లెక్చరర్లు, ఫిజికల్ డైరెక్టర్లు, లైబ్రేరియన్ల పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి జనవరి 31 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఫిబ్రవరి 20 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. అభ్యర్థులకు మే లేదా జూన్‌లో నియామక పరీక్ష నిర్వహించనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
తెలంగాణలో లైబ్రేరియన్ పోస్టుల భర్తీకి నోటిపికేషన్ - అర్హతలివే!
తెలంగాణలోని ఇంటర్, సాంకేతిక విద్యలో లైబ్రేరియన్ పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ డిసెంబరు 31 నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 71 లైబ్రేరియన్ పోస్టులకు భర్తీచేయనున్నారు. ఏదైనా డిగ్రీతోపాటు సంబంధిత విభాగంలో పీజీ డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి జనవరి 21 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. ఫిబ్రవరి 10 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. రాతపరీక్ష ద్వారా ఎంపికలు చేపడతారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
➥ తెలంగాణ 'గ్రూప్-3' నోటిఫికేషన్ వచ్చేసింది, 1365 ఖాళీల భర్తీకి 24 నుంచి దరఖాస్తులు!
➥ తెలంగాణలో 'గ్రూప్-2' నోటిఫికేషన్ విడుదల, పోస్టుల పూర్తి వివరాలు ఇలా! దరఖాస్తు తేదీలివే!
➥ 8039 పోస్టులకే 'గ్రూప్-4' నోటిఫికేషన్ - అర్హతలు, దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా!
High Court JCJ Posts: తెలంగాణ హైకోర్టులో సివిల్ జడ్జి పోస్టులు, అర్హతలివే!
TSPSC Group4 Application: 8180 'గ్రూప్-4' ఉద్యోగాల దరఖాస్తుకు నేడే ఆఖరు, ఇప్పటికే 9 లక్షలు దాటిన దరఖాస్తుల సంఖ్య!
TSPSC: 'గ్రూప్-4' రాతపరీక్ష తేదీని వెల్లడించిన టీఎస్‌పీఎస్సీ! ఎగ్జామ్ ఎప్పుడంటే?
TSSPDCL Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్- 1601 'కరెంటు' కొలువుల భర్తీకి నోటిఫికేషన్లు
Anganwadi Jobs: వైఎస్సార్ కడప జిల్లాలో 115 అంగన్వాడీ పోస్టులు, వివరాలివే!
Kishan Reddy On Governer Speech : అన్నీ అబద్దాలే - తమిళిసై ప్రసంగంపై కిషన్ రెడ్డి విమర్శలు !
Lokesh Padayatra Tension : లోకేశ్ పాదయాత్రలో మరోసారి ఉద్రిక్తత, బహిరంగ సభకు అనుమతి లేదని ప్రచార వాహనం సీజ్
Thalapathy67: కత్తులు, చాక్లెట్లు, విజయ్, విలన్స్ - ప్రోమోతోనే సిక్సర్ కొట్టిన లోకేష్ కనగరాజ్ - టైటిల్ ఏంటో తెలుసా?
Delhi YSRCP Mps : ప్రత్యేకహోదా కోసం ప్రైవేటు బిల్లు - ఢిల్లీలో వైఎస్ఆర్‌సీపీ ఎంపీల కీలక ప్రకటన !