అన్వేషించండి

TGPSC Exams: సీడీపీవో, ఈవో పోస్టుల రాతపరీక్షలను రద్దుచేసిన టీజీపీఎస్సీ - త్వరలో రీఎగ్జామ్ తేదీల వెల్లడి

TGPSC: తెలంగాణ రాష్ట్ర మహిళాశిశు సంక్షేమ శాఖలో సీడీపీవో, ఈవో పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షలను రద్దుచేస్తున్నట్లు టీజీపీఎస్సీ తెలిపింది. పేపర్ లీక్ అయినట్లు తేలడంతో రద్దుచేసినట్లు స్పష్టం చేసింది.

TGPSC CDPO, EO Exams Cancelled: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) గతంలో నిర్వహించిన మరో రెండు నియామక పరీక్షను రద్దు చేసింది. గతేడాది  ప్రశ్నపత్రాల లీకేజీ నేపథ్యంలో... సిట్ అధికారులు జరిపిన విచారణలో మహిళాశిశు సంక్షేమ శాఖలో సీడీపీవో ((శిశు అభివృద్ధి ప్రాజెక్టు ఆఫీసర్) (Notification No.13/2022), ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ (Notification No.11/2022) ప్రశ్నపత్రాలు లీకైనట్లు వెల్లడైంది. సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (CFSL), ప్రత్యేక దర్యాప్తు బృందం(SIT) నివేదిక ఆధారంగా 2023 జనవరి 3, 8 తేదీల్లో నిర్వహించిన పరీక్షలు రద్దు చేసినట్లు టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ తెలిపారు. ఈ మేరకు జులై 19న అధికారిక ప్రకటన విడుదల చేశారు. పరీక్షల రీఎగ్జా్మ్ తేదీలను త్వరలోనే వెల్లడించనున్నట్లు ఆయన తెలిపారు. ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో గతంలోనే గ్రూప్-1, ఏఈఈ, ఏఈ పరీక్షలు రద్దు చేశారు. ఈ పరీక్షలపై మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సిట్, ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక వచ్చిన తరువాత నిర్ణయం తీసుకుంటామని అప్పట్లోనే కమిషన్ తెలిపింది. తాజాగా ఈ నివేదిక రావడంతో పరీక్షలు రద్దు చేసింది. TGPSC Exams: సీడీపీవో, ఈవో పోస్టుల రాతపరీక్షలను రద్దుచేసిన టీజీపీఎస్సీ - త్వరలో రీఎగ్జామ్ తేదీల వెల్లడి

తెలంగాణ మహిళా శిశు సంక్షేమశాఖలో 23 సీడీపీవో, 181 ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి 2022లో నోటిఫికేషన్లు వెలువడిన సంగతి తెలిసిందే. సీడీపీవో పోస్టులకు 19,182 మంది;  ఈవో పోస్టులకు 26,751 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. సీడీపీవో పోస్టులకు 2023 జనవరి 3న, ఈవో పోస్టులకు జనవరి 8న కంప్యూటర్ ఆధారిత నియామక పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు సంబంధించిన తుదికీలను సైతం పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. అయితే ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంతో అధికారులు అప్పుడు ఫలితాలను ప్రకటించలేదు. అయితే రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం రావడం, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన కావడంతో.. సీడీపీవో పోస్టులకు 23 మందితో ఎంపిక జాబితాను టీజీపీఎస్సీ ప్రకటించింది. అయితే తాజాగా ఈ పరీక్ష రద్దవడంతో ఎంపిక జాబితా కూడా రద్దు అయినట్లేనని టీజీపీఎస్సీ వర్గాలు వెల్లడించాయి. 

పోస్టింగుల సమయంలో పరీక్ష రద్దు..
అయితే గ‌తంలో CDPO పోస్టుల భర్తీకి నిర్వహించిన రాతపరీక్ష ఫ‌లితాల‌ను విడుద‌ల చేసి, ఎంపికైన అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలన కూడా నిర్వహించిన సంగతి తెలిసిందే. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ముగిసినా.. అభ్యర్థులకు పోస్టింగులు ఇవ్వలేదు. దీంతో ఈ ప‌రీక్షల్లో విజ‌యం సాధించిన అభ్యర్థులు తమకు పోస్టింగులు ఇవ్వాల‌ని కోర్డును ఆశ్రయించారు. అలాగే ఈ ప‌రీక్ష విజ‌యం సాధించ‌ని అభ్యర్థులు కూడా.. గ్రూప్‌-1 ప‌రీక్షలాగా.. సీడీపీవో ప్రశ్నపత్రం కూడా లీక్ అయింద‌ని అభ్యర్థులు హైకోర్టు ఆశ్రయించారు. అలాగే గ్రూప్‌-1లో మాదిరిగా.. ఈవో ప‌రీక్షలో బ‌యోమెట్రిక్ తీసుకోలేద‌ని, కొంద‌రు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. ఈ పరిణామాలు, అధికారుల నివేదిక ఆధారంగా పరీక్షలను రద్దుచేస్తున్నట్లు కమిషన్ ప్రకటించింది.

గ్రూప్-2 పరీక్షలు వాయిదా..
తెలంగాణలో గ్రూప్-2 పరీక్షలను వాయిదావేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో.. పరీక్ష వాయిదాకు సంబంధించి టీజీపీఎస్సీ జులై 19న సాయంత్రం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఆగస్టు 7, 8 తేదీల్లో జరగాల్సిన గ్రూప్‌-2 పరీక్షలను డిసెంబర్‌కు రీషెడ్యూల్ చేయనున్నట్లు వెల్లడించింది.  పరీక్షల నిర్వహణ తేదీలను తర్వాత ప్రకటిస్తామని టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ పేర్కొన్నారు. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Harish Rao: 'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
Kashmir Elections : కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

హైదరాబాద్ దాటిన హైడ్రా బుల్‌డోజర్లు, ఇకపై రాష్ట్రవ్యాప్తంగా కూల్చివేతలులెబనాన్‌లో పేజర్ పేలుళ్ల కలవరం, ఇజ్రాయేల్‌పై ఆరోపణలుభారత్, బంగ్లాదేశ్‌ల మధ్య తొలి టెస్టు నేడే‘కూలీ’లో నాగార్జున సైమన్ లుక్ లీక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Harish Rao: 'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
Kashmir Elections : కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
Naga Babu-Jani Master: నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
Kadambari Jethwani 'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
Balineni Srinivasa Reddy: జగన్‌ తీరు నచ్చలేదు- పార్టీ నుంచి బయటకు పంపే కుట్రలు చేశారు: బాలినేని కీలక వ్యాఖ్యలు
జగన్‌ తీరు నచ్చలేదు- పార్టీ నుంచి బయటకు పంపే కుట్రలు చేశారు: బాలినేని కీలక వ్యాఖ్యలు
Telangana: తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
Embed widget