అన్వేషించండి

TGPSC Group 2 Exams: గ్రూప్‌-2 పరీక్ష వాయిదా, అధికారిక ప్రకటన విడుదల చేసిన టీజీపీఎస్సీ

TGPSC: తెలంగాణలో గ్రూప్ - 2 పరీక్షలు వాయిదాపడ్డాయి. ప్రభుత్వ నిర్ణయం మేరకు.. ఆగస్టు 7, 8 తేదీల్లో నిర్వహించాల్సిన పరీక్షలను డిసెంబరుకు వాయిదావేస్తున్నట్లు కమిషన్ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

TGPSC Group2 Exam Postponed: తెలంగాణలో గ్రూప్-2 పరీక్షలను వాయిదావేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే జులై 19న సాయంత్రం గ్రూప్-2 పరీక్ష వాయిదాకు సంబంధించి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఆగస్టు 7, 8 తేదీల్లో జరగాల్సిన గ్రూప్‌-2 పరీక్షలను డిసెంబర్‌కు రీషెడ్యూల్ చేయాలని నిర్ణయించింది. పరీక్షల నిర్వహణ తేదీని తర్వాత ప్రకటించనున్నట్లు టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 783 గ్రూప్-2 ఉద్యోగాలకు మొత్తం 5.51లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. అభ్యర్థులకు ఆగస్టు 7, 8 తేదీల్లో పరీక్షలు జరగాల్సి ఉండగా.. డిసెంబరులో పరీక్షలను నిర్వహించనున్నట్లు కమిషన్ ప్రకటించింది. 

గ్రూప్-2 అభ్యర్థుల కోరిక మేరకు..
డీఎస్సీ, గ్రూప్-2 పరీక్షల మధ్య వారం రోజులు మాత్రమే వ్యవధి ఉండటంతో.. గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేయాలంటూ అభ్యర్థుల ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జులై 19న ఉదయం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఎంపీలు మల్లురవి, కిరణ్ గ్రూప్-2 అభ్యర్థులతో చర్చలు జరిపారు. అనంతరం పరీక్షల వాయిదాపై నిర్ణయం తీసుకున్నారు. 

గ్రూప్-3 పరీక్షలూ వాయిదా?
ఒకవైపు ఆగస్టులో జరగాల్సిన గ్రూప్-2 పరీక్షలను డిసెంబరుకు వాయిదావేయగా.. మరోవైపు 1,388 గ్రూప్-3 ఉద్యోగాల భర్తీకి నవంబరులో నిర్వహించనున్న రాతపరీక్షలను కూడా వాయిదాపడే అవకాశం ఉంది. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. నవంబర్ 17, 18 తేదీల్లో గ్రూప్ -3 పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్-3 పోస్టులకు మొత్తం 5 లక్షల మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఒకవేళ పరీక్షలు వాయిదాపడితే.. వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో నిర్వహించే అవకాశం ఉంది.

TGPSC Group 2 Exams: గ్రూప్‌-2 పరీక్ష వాయిదా, అధికారిక ప్రకటన విడుదల చేసిన టీజీపీఎస్సీ

తెలంగాణలోని ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 783 'గ్రూప్-2' పోస్టుల భర్తీకి 2022, డిసెంబరు 29న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా మున్సిపల్ కమిషనర్, ఏసీటీవో, తహసిల్దార్, సబ్-రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, మండల పంచాయతీ అధికారి, ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్, అసిస్టెంట్ బీసీ డెవలప్‌మెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

* గ్రూప్-2 పోస్టుల వివరాలు

మొత్తం ఖాళీల సంఖ్య: 783

1) మున్సిపల్ కమిషనర్ (గ్రేడ్-3): 11 పోస్టులు

విభాగం: మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్. 

2) అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ (ఏసీటీవో): 59 పోస్టులు

విభాగం: కమిషనర్ ఆఫ్ స్టేట్ టాక్సెస్ డిపార్ట్‌మెంట్.

3) నాయబ్ తహసిల్దార్: 98 పోస్టులు

విభాగం: ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్.

4) సబ్-రిజిస్ట్రార్ (గ్రేడ్-2): 14 పోస్టులు

విభాగం: రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్‌మెంట్.

5) అసిస్టెంట్ రిజిస్ట్రార్: 63 పోస్టులు

విభాగం: కంట్రోల్ ఆఫ్ కమిషనర్- కోఆపరేషన్ & రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్.

6) అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్: 09 పోస్టులు

విభాగం: కమిషనర్ ఆఫ్ లేబర్ డిపార్ట్‌మెంట్.

7) మండల్ పంచాయత్ ఆఫీసర్: 126 పోస్టులు

విభాగం: పంచాయతీరాజ్ & రూరల్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్.

8) ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్: 97 పోస్టులు

విభాగం: ప్రొహిబిషన్ & ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్.

9) అసిస్టెంట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్: 38 పోస్టులు

 విభాగం: హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్‌టైల్స్ డిపార్ట్‌మెంట్.

10) అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్: 165 పోస్టులు

 విభాగం: జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్.

11) అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్: 15 పోస్టులు

 విభాగం: లెజిస్లేటివ్ సెక్రటేరియట్.

12) అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్: 25 పోస్టులు

 విభాగం: ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్.

13) అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్: 07 పోస్టులు

 విభాగం: లా డిపార్ట్‌మెంట్.

14) అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్: 02 పోస్టులు

 విభాగం: తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్. 

15) డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్ (గ్రేడ్-2): 11 పోస్టులు

 విభాగం: జువైనల్ కరెక్షనల్ సర్వీసెస్ & వెల్ఫేర్ ఆఫ్ స్ట్రీట్ చిల్డ్రన్ డిపార్ట్‌మెంట్. 

16) అసిస్టెంట్ బీసీ డెవలప్‌మెంట్ ఆఫీసర్: 17 పోస్టులు

 విభాగం: బీసీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్. 

17) అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్/అసిస్టెంట్ ట్రైబల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్: 09 పోస్టులు

 విభాగం: ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్. 

18) అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్/అసిస్టెంట్ ఎస్సీ డెవలప్‌మెంట్ ఆఫీసర్: 17 పోస్టులు

 విభాగం: ఎస్సీ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్. 

Group2 Revised Breakup

Group2 Notification

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Latest News : తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
Manchu Family Issue: మంచు ఫ్యామిలీలో చల్లారని వివాదం- మరోసారి పోలీస్‌స్టేషన్‌కు మనోజ్‌
మంచు ఫ్యామిలీలో చల్లారని వివాదం- మరోసారి పోలీస్‌స్టేషన్‌కు మనోజ్‌
AP CM Chandra Babu: పొట్టి శ్రీరాముల పేరుతో తెలుగు యూనివర్శిటీ- విజయవాడలో ప్రకటించిన సీఎం చంద్రబాబు 
ఏపీలో పొట్టి శ్రీరాముల పేరుతో తెలుగు యూనివర్శిటీ- విజయవాడలో ప్రకటించిన సీఎం చంద్రబాబు 
MLC Kavitha Tour: జగిత్యాలలో 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహం- ప్రభుత్వ జీవో ధిక్కరించి భూమి పూజ చేసిన కవిత 
జగిత్యాలలో 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహం- ప్రభుత్వ జీవో ధిక్కరించి భూమి పూజ చేసిన కవిత 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!చంద్రబాబును ఫోటో అడిగిన బాలిక, వచ్చేయమన్న సీఎం-అంతా షాక్వీడియో: మహిళపై చిరుతపులి దాడి, ముఖమంతా రక్తం!నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Latest News : తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
Manchu Family Issue: మంచు ఫ్యామిలీలో చల్లారని వివాదం- మరోసారి పోలీస్‌స్టేషన్‌కు మనోజ్‌
మంచు ఫ్యామిలీలో చల్లారని వివాదం- మరోసారి పోలీస్‌స్టేషన్‌కు మనోజ్‌
AP CM Chandra Babu: పొట్టి శ్రీరాముల పేరుతో తెలుగు యూనివర్శిటీ- విజయవాడలో ప్రకటించిన సీఎం చంద్రబాబు 
ఏపీలో పొట్టి శ్రీరాముల పేరుతో తెలుగు యూనివర్శిటీ- విజయవాడలో ప్రకటించిన సీఎం చంద్రబాబు 
MLC Kavitha Tour: జగిత్యాలలో 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహం- ప్రభుత్వ జీవో ధిక్కరించి భూమి పూజ చేసిన కవిత 
జగిత్యాలలో 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహం- ప్రభుత్వ జీవో ధిక్కరించి భూమి పూజ చేసిన కవిత 
Jamaili Elections: జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
PV Sindhu Meets Pawan Kalyan: సార్‌, పెళ్లికి రండీ! డిప్యూటీ సీఎం పవన్‌ను ఆహ్వానించిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు
సార్‌, పెళ్లికి రండీ! డిప్యూటీ సీఎం పవన్‌ను ఆహ్వానించిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు
Upcoming 5G Smartphones: వచ్చే వారం మార్కెట్లోకి మూడు బడ్జెట్ ఫోన్లు - రూ.9 వేలలోపే 5జీ మొబైల్ కూడా!
వచ్చే వారం మార్కెట్లోకి మూడు బడ్జెట్ ఫోన్లు - రూ.9 వేలలోపే 5జీ మొబైల్ కూడా!
Allu Arjun Meets Chiranjeevi: బిగ్ బాస్ ఇంటికి బన్నీ... అరెస్ట్, జైలు తర్వాత మావయ్య దగ్గరకు మొదటిసారి, పుష్ప 2 టీ షర్ట్ లేకుండా
బిగ్ బాస్ ఇంటికి బన్నీ... అరెస్ట్, జైలు తర్వాత మావయ్య దగ్గరకు మొదటిసారి, పుష్ప 2 టీ షర్ట్ లేకుండా
Embed widget