Group1 Exam: నేడే 'గ్రూప్-1' ప్రిలిమినరీ పరీక్ష, ఈ రూల్స్ మరవద్దు!
అక్టోబరు 16న రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్-1 పరీక్ష జరగనుంది. మొత్తం 503 పోస్టులకు 3,80,202 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 33 జిల్లాల్లో 1019 పరీక్ష కేంద్రాల్లో గ్రూప్-1 పరీక్ష నిర్వహించనున్నారు.
తెలంగాణ రాష్ట్ర తొలి 'గ్రూప్–1' ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత జరుగుతున్న తొలి గ్రూప్ వన్ ఎగ్జామ్ కావడంతో టీఎస్‌పీఎస్సీ దీనిని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. అక్టోబరు 16న రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్-1 పరీక్ష నిర్వహించనున్నారు. మొత్తం 503 పోస్టులకు 3,80,202 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 33 జిల్లాల్లో 1019 పరీక్ష కేంద్రాల్లో గ్రూప్-1 పరీక్ష నిర్వహించనున్నారు.
గ్రూప్-1 ప్రిలిమ్స్ హాల్‌టికెట్లు, పరీక్ష విధానం కోసం క్లిక్ చేయండి..
అక్టోబరు 16న ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ పరీక్ష జరగనుంది. పరీక్ష రాసే అభ్యర్థులకు ఉదయం 8.30 గంటల నుంచే హాల్‌లోకి అనుమతి ఇవ్వనున్నారు. నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతించేది లేదని అధికారులు చెబుతున్నారు. పరీక్ష ప్రారంభమయ్యే పదిహేను నిమిషాల ముందే గేట్లు మూసేస్తామంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉదయం10.15 తర్వాత హాల్ లోకి అభ్యర్థులను అనుమతించమని అధికారులు చెబుతున్నారు.
'గ్రూప్-1' పరీక్ష రాయాలంటే ఈ నిబంధనలు పాటించాల్సిందే..
సీసీ కెమెరాల నిఘాలో..
కాగా అభ్యర్థులు హాల్‌టికెట్లతో పాటు ఏదైనా ఒరిజినల్ ఐడీ ప్రూఫ్ తీసుకురావాలని టీఎస్‌పీఎస్సీ సూచించింది. పరీక్షా హాల్‌లోకి హాల్ టికెట్‌తోపాటు ఏదైనా ఐడీ కార్డ్, పెన్, పెన్సిల్‌ను మాత్రమే అనుమతిస్తామంటున్నారు. షూస్ అండ్ వాచ్ ధరించి రావొద్దని సూచిస్తున్నారు. అభ్యర్ధులకు ఏమైనా అనుమానాలుంటే ఆయా జిల్లాల్లో ఏర్పాటుచేసిన హెల్ప్ సెంటర్లకి ముందే కాల్‌చేయాలి. ఎవరైనా మాల్ ప్రాక్టీస్‌కి పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
కాగా హైదరాబాద్‌లోనే 100 వరకు ఎగ్జామ్ సెంటర్లను ఏర్పాటుచేసినట్లు తెలుస్తోంది. ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా పారదర్శకత కోసం సీసీ కెమెరాల నీడలో ఈ ఎగ్జామ్ ను నిర్వహించనున్నారు. అన్ని కేంద్రాల్లోని సీసీ కెమెరాలను టీఎస్పీఎస్సీ కార్యాలయంలోని కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేయనున్నారు. అలాగే హైదరాబాద్ లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ కు సైతం అనుసంధానం చేయనున్నారు.
Also Read:
TSPSC AE Jobs: తెలంగాణలో 837 ఇంజినీరింగ్ ఉద్యోగాలు, దరఖాస్తు చేసుకోండి!
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్‌సీ) నుంచి మరో నోటిఫికేషన్ వెలువడింది. వివిధ విభాగాల్లో 833 అసిస్టెంట్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సెప్టెంబరు 12న నోటిఫికేషన్ వెలువడింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సంబంధిత విభాగాల్లో ఇంజినీరింగ్ డిగ్రీ/డిప్లొమా అర్హత ఉన్నవారు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సెప్టెంబరు 28 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. రాతపరీక్ష ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
TSPSC Recruitment: 1540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, పూర్తి వివరాలు!
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరో భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 1540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఏఈఈ) పోస్టులను భర్తీచేయనున్నారు. సరైన అర్హతలున్న అభ్యర్థులు అక్టోబర్15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించవచ్చు. మిషన్ భగీరథ, ఇరిగేషన్, పంచాయతీరాజ్ రూరల్ డెవలప్‌మెంట్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ట్రైబల్ వెల్ఫేర్, అర్అండ్‌బీ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. వీటిని డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ విధానం ద్వారా భర్తీ చేయనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
TSPSC Jobs: తెలంగాణ మున్సిపల్ శాఖలో 175 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, వివరాలు ఇలా!
తెలంగాణలో మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. మున్సిపల్ శాఖలో 175 టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ ఉద్యోగాల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 20 నుంచి అక్టోబరు 13 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నారు. సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపికచేయనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
APPSC MO Recruitment: ఏపీలో 151 మెడికల్ ఆఫీసర్ పోస్టులు, ఈ అర్హతలు ఉండాలి!
ఏపీలోని ఆయుష్ విభాగంలో మెడికల్ ఆఫీసర్ (యునాని/హోమియో/ఆయుర్వేద) పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెప్టెంబరు 28న నోటిఫికేషన్ విడుదల చేసింది. కమిషన్ వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ అందుబాటులో ఉంచింది. యునానీ డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అక్టోబరు 6 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు అక్టోబరు 21 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అక్టోబరు 20 లోపు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
APPSC Recruitment: ఏపీలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు, వివరాలు ఇలా!
ఏపీ ఇన్స్యూరెన్స్ మెడికల్ సర్వీసెస్‌లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెప్టెంబరు 28న నోటిఫికేషన్ విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ అందుబాటులో ఉంచింది. దీనిద్వారా రాష్ట్రంలోని వివిధ జోన్ల పరిధిలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంబీబీఎస్ డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అక్టోబరు 27 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు నవంబరు 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే నవంబరు 15లోపు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..