అన్వేషించండి

TSPSC: 'గ్రూప్‌-1' పరీక్ష రాయాలంటే ఇవి పాటించాల్సిందే!! లేకపోతే ఇబ్బందులే!!

గ్రూప్‌–1' ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అక్టోబరు 9న విడుదల చేసిన సంగతి తెలిసిందే. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు.

తెలంగాణ తొలి 'గ్రూప్‌-1' పరీక్షకు సమయం దగ్గర పడుతోంది. అక్టోబరు 16న రాష్ట్రవ్యాప్తంగా పరీక్ష నిర్వహించనున్నారు. మొత్తం 503 పోస్టులకు 3,80,202 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఎక్కువ మంది మొదటిసారి గ్రూప్-1 పరీక్ష రాస్తున్నవారే. వడపోతలో భాగంగా ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున ఎంపిక చేసేందుకు ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు. ఓఎంఆర్ షీట్ విధానంలోనే ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ తెలిపింది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల కోసం కీలక సూచనలు వెల్లడించింది.

గ్రూప్‌–1' ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అక్టోబరు 9న విడుదల చేసిన సంగతి తెలిసిందే. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు టీఎస్‌పీఎస్సీ ఐడీ, పుట్టినతేది వివరాలు నమోదుచేసి గ్రూప్-1 హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం అక్టోబరు 16న గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహించనున్నారు.

 
గ్రూప్-1 ప్రిలిమ్స్ హాల్‌టికెట్లు, పరీక్ష విధానం కోసం క్లిక్ చేయండి..

:: అభ్యర్థులకు ముఖ్య సూచనలు ::

➨ పాస్‌పోర్టు, పాన్‌కార్డు, ఓటర్‌ ఐడీ కార్డు, అధార్‌ కార్డుతోపాటు ఇతర ప్రభుత్వ గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి తప్పనిసరిగా తీసుకెళ్లాలి.

➨ హాల్‌ టికెట్‌లో ఫొటో కనిపించకపోయినా, సరిగా ముద్రణ కాకపోయినా, గెజిటెడ్‌ ఆఫీసర్‌తో ధ్రువీకరణ తీసుకోవాలి. దీనితోపాటు మూడు పాస్‌పోర్టు సైజు ఫొటోలపై సంతకం చేయించుకుని పరీక్ష కేంద్రంలో చీఫ్‌ సూపరింటెండెంట్‌ను సంప్రదించాలి.

➨మెహందీ, టాటూలతో పరీక్షకు వెళ్లొద్దు. చేతులపై అవి ఉంటే బయోమెట్రిక్‌ సమయంలో ఇబ్బంది కావొచ్చు. థంబ్‌ తీసుకునేటప్పుడు ఇబ్బంది కలిగే అవకాశం ఉన్నది.

➨ పరీక్షకు బూట్లు అనుమతించరు. సాక్సులు కూడా వేసుకోకూడదు. చెప్పులు మాత్రమే వేసుకుని వెళ్లాలి.

➨ అభ్యర్థులు డౌన్‌లోడ్‌ చేసుకున్న హాల్‌టికెట్‌ తప్పనిసరిగా తీసుకెళ్లాలి. అదికూడా ఏ4 సైజులో ఉండాలి. అవకాశం ఉంటే కలర్‌ జిరాక్సు తీసుకెళితే మంచిది.

➨ పరీక్ష ఉదయం 10.30కి ప్రారంభం అవుతుంది. అయితే.. పరీక్ష కేంద్రంలోకి మాత్రం ఉదయం 8.30 గంటల నుంచే అనుమతిస్తారు. అభ్యర్థులు చివరి నిమిషంలో వచ్చి క్యూ పెరిగిపోయి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు టీఎస్‌పీఎస్సీ ఈ నిర్ణయం తీసుకొన్నది.

➨ ఉదయం 10.15 గంటల వరకు మాత్రమే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. ఆ తర్వాత ప్రధాన ద్వారం మూసేస్తారు. 10.15 తర్వాత వచ్చిన అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు.

➨ సహాయకుడు కావాలని ముందుగా దరఖాస్తు చేసిన వారికి మాత్రమే స్ర్కైబ్‌ను కేటాయిస్తారు. పరీక్ష నిర్వహణ అధికారులే స్ర్కైబ్‌ను ఇస్తారు. అనుమతి లేకుండా అభ్యర్థులు ఎవరినైనా తీసుకొస్తే అనుమతించరు.

➨ గ్రూప్‌-1 అభ్యర్థుల కోసం టీఎస్‌పీఎస్సీ ప్రత్యేక కాల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. హాల్‌ టికెట్‌ డౌన్‌లోడ్‌ సమయంలో ఇబ్బందులు తలెత్తితే ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల లోపు 040- 23542 185 / 23542187 నంబర్‌లో సంప్రదించవచ్చు. లేదా టీఎస్‌పీఎస్సీకి helpdesk@tspsc.gov.in మెయిల్‌ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు.

➨ బంగారు అభరణాలను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. మంగళసూత్రం వరకూ మాత్రం అనుమతి ఉంటుంది. మిగిలిన అలంకరణ వస్తువులు, చేతి రింగులు, బ్రేస్‌లెట్లు వంటి వాటికి అనుమతి లేదు. అలాంటివి పెట్టుకొని వెళితే పరీక్ష కేంద్రం వద్ద ఇబ్బందులు తప్పవు.

➨ టీఎస్‌పీఎస్సీ పరీక్షను పకడ్బందీగా నిర్వహించేందుకు చేసిన కొత్త సవరణల్లో జంబ్లింగ్‌ విధానం కూడా ఒకటి. ఇప్పటి వరకూ ఏ, బీ, సీ, డీ సిరీస్‌ల పేరుతో నాలుగు ప్రశ్నపత్రాలు అభ్యర్థులకు వరుస క్రమంలో ఇచ్చేవారు. కానీ ఇకపై ఎక్కువ సిరీస్‌లలో వచ్చేలా ప్రశ్నపత్రాలను సిద్ధం చేశారు. ఆ ప్రశ్నలను కంప్యూటర్‌లో జంబ్లింగ్‌ చేశారు. పక్కపక్కనే ఉన్న ఇద్దరికి ఒకటో నంబర్‌లో వేర్వేరు క్వశ్చన్స్‌ ఉంటాయి. ఒకే ప్రశ్నలో ఇద్దరికీ 4 చాయిస్‌లు వేర్వేరుగా ఇస్తారు. ఫలితంగా మాస్‌ కాపీయింగ్‌కు అవకాశమే లేదు.

➨ టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1లో తొలిసారిగా బయోమెట్రిక్‌ విధానాన్ని అమలు చేస్తున్నది. ప్రిలిమినరీ పరీక్ష సమయంలో బయోమెట్రిక్‌ తీసుకుంటారు. మెయిన్స్‌ పరీక్షకు వచ్చినప్పుడు థంబ్‌ పెట్టగానే అభ్యర్థి పూర్తి వివరాలు వస్తాయి. ఈ రెండు సందర్భాల్లో థంబ్‌ సరిపోకపోతే మెయిన్స్‌ పరీక్షకు అభ్యర్థిని అనుమతించరు.

➨ గ్రూప్‌-1కు పీహెచ్‌ కోటా కింద దరఖాస్తు చేసిన ప్రతిఒక్కరూ తెలంగాణ ప్రభుత్వం అందించిన సదరం సర్టిఫికెట్‌ తీసుకొని రావాలి. అప్పుడు మాత్రమే వాళ్లను వికలాంగ కోటా కింద పరిగణిస్తారు.

➨ వినికిడి యంత్రాలు తీసుకుళ్లే వాళ్లు తప్పనిసరిగా అందుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రం వెంట తీసుకెళ్లాలి. అప్పుడు మాత్రమే వినికిడి యంత్రాలను అనుమతిస్తారు.

➨ కంటి చూపు సమస్య ఉంటే కళ్లజోళ్లు అనుమతిస్తారు. కానీ కూలింగ్‌ గ్లాసులను మాత్రం అనుమతించరు.

➨ ప్రభుత్వం పరీక్ష కేంద్రాల్లో తాగునీటి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. కాబట్టి.. పరీక్ష కేంద్రాల్లోకి వాటర్‌ బాటిళ్లు అనుమతించరు.

➨ పరీక్షకు చేతి గడియారాలు పెట్టుకుని వెళ్లకూడదు. కాలిక్యులేటర్‌, మ్యాథమెటికల్‌ టేబుల్స్‌, లాగ్‌ బుక్స్‌, సెల్‌ఫోన్లు, పెన్‌డ్రైవ్‌లు, బ్లూటూత్‌ డివైజెస్‌, పర్సు, హ్యాండ్‌బాగ్స్‌, రైటింగ్‌పాడ్స్‌, చార్ట్స్‌, తెల్ల కాగితాలు వంటివి పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు.

➨ పరీక్ష పత్రం ఇచ్చిన వెంటనే అందులో 150 ప్రశ్నలు ఉన్నాయో? లేదో? సరిచూసుకోవాలి. లేనిచో వెంటనే ఇన్విజిలేటర్‌తో మాట్లాడి మరో ప్రశ్నపత్రం తీసుకోవాలి. తక్కువ ప్రశ్నలు వచ్చినా అలాగే పరీక్ష రాస్తే అభ్యర్థి నష్టపోయే ప్రమాదమున్నది.

➨ పరీక్షలో పెన్సిల్‌ ఉపయోగించరాదు. ఎటువంటి స్కెచ్‌ పెన్లు, కలర్‌ పెన్సిళ్లకు అనుమతి లేదు. బ్లూ లేదా బ్లాక్‌ బాల్‌ పాయింట్‌ పెన్నుతో మాత్రమే బబ్లింగ్‌ చేయాలి.

➨ పరీక్ష హాల్‌లోకి వెళ్లిన తర్వాత పక్క వాళ్లతో మాట్లాడటం కుదరదు. అందుకే.. ప్రతిఒక్కరూ పరీక్షకు వెళ్లేటప్పుడే అడిషనల్‌ పెన్నులు వెంట తీసుకెళ్లాలి.

➨ గ్రూప్‌-1 పరీక్ష కేంద్రాల్లో గోడ గడియారాలు నిషేధం. అందుకే.. ఎక్కడా గోడ గడియారాలు ఉండవు.

➨ ప్రతి అరగంటకు ఓ సారి అలర్ట్‌ చేసేలా గంట మోగిస్తారు. మొదటి అరగంటకు ఒకసారి, గంట తర్వాత రెండుసార్లు, గంటన్నరకు మూడుసార్లు, రెండు గంటలకు నాలుగుసార్లు, రెండున్నర గంటల తర్వాత ఐదుసార్లు.. ఇలా గంట మోగించడం ద్వారా అభ్యర్థులను ఎప్పటికప్పుడు అలర్ట్‌ చేస్తుంటారు. పరీక్ష ప్రారంభంలో, ముగింపులో లాంగ్‌ బెల్‌ మోగిస్తారు.

➨ వైట్‌నర్‌, ఎరైజర్‌, చాక్‌ పౌడర్‌, బ్లేడ్‌.. ఇలాంటివి పరీక్షలో ఉపయోగించరాదు. ఒకవేళ ఎవరైనా ఓఎంఆర్‌ షీట్‌పై వీటిని ఉపయోగిస్తే ఆ పేపర్‌ మూల్యాంకనం చేయరు.

➨ కర్చీఫ్‌లు తెచ్చుకోవచ్చు. టవల్స్‌ మాత్రం పరిస్థితిని బట్టి అనుమతిస్తారు.

➨ బీపీ, షుగర్‌ ఉన్నవారు.. మందులు వెంట తెచ్చుకోవచ్చు. ఇన్సులిన్‌ వాడేవాళ్లు తెచ్చుకోవచ్చు. అయితే పరీక్షాకేంద్రాల్లో ఓఆర్‌ఎస్‌ ద్రావణం, మందులు వంటివి అందుబాటులో ఉంటాయి.

➨ పరీక్ష కేంద్రంలో, కేటాయించిన సీటులో మాత్రమే పరీక్ష రాయాలి. హాల్లోకి ప్రవేశించేందుకు సహచర విద్యార్థుల సహకారం తీసుకోవచ్చు. వీల్‌చైర్లు అధికారులే సమకూరుస్తారు.

➨ కారు, బైక్‌లకు సంబంధించిన తాళపు చెవి వరకు మాత్రమే అనుమతిస్తారు. కీ చైన్లు, ఇన్‌హేలర్లు ఉన్న కీలు, ఇతరత్రా డిజైన్లు గల కీలను, వస్తుసామగ్రిని అనుమతించరు. కార్లకు ఎలక్ట్రానిక్‌ కీలుంటాయి. వాటిని పరీక్షకేంద్రంలోని కౌంటర్‌లో జమచేయాలి.

➨ ఒకసారి పరీక్షా కేంద్రంలోకి ప్రవేశించిన తర్వాత బయటికెళ్లడం కుదరదు. పరీక్ష పూర్తయినా.. మూడు గంటల పాటు పరీక్షకేంద్రం బయటికి పంపించరు. ఎవరైనా మాస్‌ కాపీయింగ్‌ చేస్తూ దొరికినా సరే మూడు గంటలపాటు పోలీసుల సమక్షంలోనే ఉంచుతారు.

➨ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షకు మూడు భాషల్లో ప్రశ్నపత్రాలు ఇస్తారు. తెలుగు, ఇంగ్లిష్‌, ఉర్దూ మీడియంలో ప్రశ్నలు ఇస్తారు. ఓఎంఆర్‌లో సమాధానాలు బబ్లింగ్‌ చేస్తే సరిపోతుంది.

➨ పరీక్షలో ఓఎంఆర్ షీటులో జవాబులు బబ్లింగ్‌ చేసే సమయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అభ్యర్థి తనకు కేటాయించిన నంబర్‌ను ఓఎంఆర్‌ షీటులో సరిగా బబ్లింగ్‌ చేయకపోయినా, లేదా అభ్యర్థి, ఇన్విజిలేటర్‌ సంతకాలు లేకపోయినా అతని పేపర్‌ను మూల్యాంకనం చేయరు. ఈ విషయంలో హైకోర్టు ఆదేశాలు కూడా ఉన్నాయి. కాబట్టి.. అభ్యర్థులు ఎవరూ కోర్టును సైతం ఆశ్రయించే అవకాశం లేదు. అందుకే బబ్లింగ్‌ చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవాలి.

➨ స్వెట్టర్‌, మఫ్లర్‌ వంటి వేసుకుని రాకూడదు. అవసరమైన పక్షంలో అధికారులే అనుమతిస్తారు.

➨ ప్రిలిమ్స్‌ పరీక్ష ముగిసిన తర్వాత ప్రతి ఒక్కరి ఓఎంఆర్‌ షీటును (రెస్పాన్స్ షీట్) అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు. పరీక్ష రాసిన ప్రతి అభ్యర్థి తన ఓఎంఆర్‌ షీటును చెక్‌ చేసుకోవచ్చు.

➨ టీఎస్‌పీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రిలిమ్స్ పరీక్ష కీని అందుబాటులో ఉంచుతారు. ఆన్సర్ కీపై అభ్యంతరాలకు తెలిపేందుకు తగినంత సమయం ఇస్తారు. ఏమైనా అభ్యంతరాలు తెలిపితే నిపుణుల కమిటీ నేతృత్వంలో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. ఆ తర్వాత ఫైనల్ కీ విడుదల చేసి ఫలితాలను కూడా వెల్లడిస్తారు. 


వీళ్ల పరీక్షలు రాయకపోవడమే బెటర్..

➨  క్రిమినల్‌ కేసులు ఉంటే పరీక్ష రాయకపోవడమే ఉత్తమం. చివరి దశలో వెరిఫికేషన్‌ సమయంలో తెలిసిపోతుంది. అప్పుడు ఆ అభ్యర్థిని డిస్‌క్వాలిఫై కింద ప్రకటిస్తారు.

టాప్ హెడ్ లైన్స్

Vijayawada Durga Temple: విజయవాడ దుర్గమ్మ దసరా ఉత్సవాల వేళ చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ మార్పు
విజయవాడ దుర్గమ్మ దసరా ఉత్సవాల వేళ చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ మార్పు
Deputy CM Pawan Kalyan: 2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
Software Engineer Suicide: ముఖానికి కవర్ చుట్టుకుని, హీలియం గ్యాస్ పీల్చి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సూసైడ్.. హైదరాబాద్‌లో ఘటన
ముఖానికి కవర్ చుట్టుకుని, హీలియం గ్యాస్ పీల్చి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సూసైడ్.. హైదరాబాద్‌లో ఘటన
Air Fryer : ఎయిర్ ఫ్రైయర్ మొదటిసారి ఉపయోగిస్తుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. చేయకూడని తప్పులుఇవే
ఎయిర్ ఫ్రైయర్ మొదటిసారి ఉపయోగిస్తుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. చేయకూడని తప్పులుఇవే

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayawada Durga Temple: విజయవాడ దుర్గమ్మ దసరా ఉత్సవాల వేళ చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ మార్పు
విజయవాడ దుర్గమ్మ దసరా ఉత్సవాల వేళ చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ మార్పు
Deputy CM Pawan Kalyan: 2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
Software Engineer Suicide: ముఖానికి కవర్ చుట్టుకుని, హీలియం గ్యాస్ పీల్చి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సూసైడ్.. హైదరాబాద్‌లో ఘటన
ముఖానికి కవర్ చుట్టుకుని, హీలియం గ్యాస్ పీల్చి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సూసైడ్.. హైదరాబాద్‌లో ఘటన
Air Fryer : ఎయిర్ ఫ్రైయర్ మొదటిసారి ఉపయోగిస్తుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. చేయకూడని తప్పులుఇవే
ఎయిర్ ఫ్రైయర్ మొదటిసారి ఉపయోగిస్తుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. చేయకూడని తప్పులుఇవే
Abhishek World Record: సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
Tiger Rescue Operation: దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
IndiGo Flight Emergency Landing: విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
Small Hybrid Cars: ఇక చిన్న కార్లలోనూ హైబ్రిడ్ టెక్నాలజీ.. దాని వల్ల మైలేజ్ పెరుగుతుందా ?
Small Hybrid Cars: ఇక చిన్న కార్లలోనూ హైబ్రిడ్ టెక్నాలజీ.. దాని వల్ల మైలేజ్ పెరుగుతుందా ?
Embed widget