TSPSC Group 2 Syllabus: తెలంగాణ గ్రూప్ 2 అభ్యర్థులకు గమనిక - జాబ్ సెలక్షన్, పేపర్ల వివరాలు ఇవే
TSPSC Group 2 Syllabus: సీఎం కేసీఆర్ రాష్ట్రంలో మొత్తం 91 వేల ఉద్యోగాలు నోటిఫై చేశారు. గ్రూప్ 2లో 582 పోస్టులు మంజూరు చేశారు. గ్రూప్ 2 పరీక్షా విధానం ఇలా ఉంటుంది.
TSPSC Group 2 Syllabus: తెలంగాణలో త్వరలోనే ఉద్యోగాల జాతర మొదలుకానుంది. బడ్జెట్ సమావేశాలలో పాల్గొన్న సీఎం కేసీఆర్ రాష్ట్రంలో మొత్తం 91 వేల ఉద్యోగాలు నోటిఫై చేశారు. అయితే అందులో 11 వేల పోస్టులు కాంట్రాక్ట్ ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో 80,039 ఖాళీలు ఉన్నాయి. ఆయా శాఖల్లో పోస్టులను త్వరలోనే నోటిఫికేషన్లు విడుదల చేసి భర్తీ చేస్తామని అసెంబ్లీలో కేసీఆర్ పేర్కొన్నారు.
గ్రూప్ 2లో 582 పోస్టులకు త్వరలోనే నోటిఫికేషన్
గ్రూపుల వారీగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి. గ్రూప్ 1- 503 పోస్టులు ఉండగా, గ్రూప్ 2- 582 పోస్టులు భర్తీ చేయనున్నారు. గ్రూప్ 3 – 1,373 పోస్టులు, గ్రూప్ 4- 9168 పోస్టులు ఉన్నాయి. సిలబస్ తెలుసుకుని ప్రిపేర్ కావడం ముఖ్యం. ఇదివరకే ప్రిపేర్ అవుతున్న వారు మరోసారి సిలబస్ చెక్ చేసుకుని ప్రిపరేషన్‌ను ప్లాన్ చేసుకుని చదివితే జాబ్ సాధ్యమవుతుంది. ఇందులో ముఖ్యంగా గ్రూప్ 2 ఉద్యోగాలకు అధిక పోటీ ఉంటుంది. సివిల్స్, గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యేవారితో పాటు వీటికి ప్రిపేర్ అవ్వలేం అనుకున్న అభ్యర్థులు సైతం గ్రూప్ 2 జాబ్ కోసం ఎదురుచూస్తుంటారు.
గ్రూప్ 2లో మొత్తం 4 పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్‌కు 150 మార్కులు. అబ్జెక్టివ్ విధానంలో పరీక్షను టీఎస్‌పీఎస్సీ నిర్వహిస్తోంది. మెరిట్ విద్యార్థులను కెటగిరీల వారీగా 1:2 నిష్పత్తిలో ఇంటర్వ్యూకు సెలక్ట్ చేస్తారు. ఫైనల్‌గా ఎగ్జామ్ మార్కులు, ఇంటర్వ్యూ స్కోరు ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక పక్రియ జరుగుతుందని టీఎస్‌పీఎస్సీ గతంలోనే తెలిపింది.
టీఎస్‌పీఎస్సీ గ్రూప్ 2 పేపర్ల (TSPSC Group 2 Papers) వివరాలు సమగ్రంగా..
పేపర్-I - జనరల్ స్టడీస్ & జనరల్ ఎబిలిటీస్ 150 మార్కులు
పేపర్-II - హిస్టరీ, పాలిటిక్స్, సొసైటీ 150 (3x50)
పేపర్-III ఎకనామిక్స్ అండ్ డెవలప్‌మెంట్ 150 (3x50)
పేపర్-IV - తెలంగాణ ఉద్యమం మరియు రాష్ట్ర సాధన 150 (3x50)
విద్యార్హతలు: అభ్యర్థులు దేశంలోని ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ డిగ్రీ. చేయబడింది, ప్రాంతీయ చట్టం, రాష్ట్ర చట్టం లేదా సంస్థ ద్వారా గుర్తించబడిన సంస్థలలో యు.జి.సి. లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి.