New Zones In Telangana: గవర్నమెంట్ జాబ్స్‌కు ప్రిపేర్ అవుతున్నారా - జోన్లు, మల్టీజోన్లు వివరాలు ఇక్కడ తెలుసుకోండి
Telangana Jobs 2022: తెలంగాణలో 7 జోన్‌లలో కలిపి 18,866 ఖాళీలు, మల్టీ జోన్‌లలో 13,170 పోస్టులు ఖాళీగా ఉన్నాయని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో చెప్పారు.
New Zones In Telangana: తెలంగాణ ఏర్పాటైన సమయంలో ఉన్న 10 జిల్లాలను 31 చేశారు. ఆపై మరో 2 జిల్లాలను చేర్చడంతో రాష్ట్రంలో మొత్తం జిల్లాల సంఖ్య 33 అయింది. 7 జోన్లను, రెండు మల్టీ జోన్లను తెలంగాణ ప్రభుత్వం ఖరారు చేసింది. రాష్ట్ర ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడంతో తెలంగాణలో జోన్ల విధానానికి లైన్ క్లియర్ అయింది. ఉద్యోగుల నియామకం సైతం ఇదే తీరుగా చేపట్టనున్నారు. ఇటీవల అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల సందర్బంగా సీఎం కేసీఆర్ 80 వేలకు పైగా ఉద్యోగాలపై ప్రకటన చేశారు.
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలు (Telangana Jobs 2022)
మొత్తం 91 వేల ఉద్యోగాలు నోటిఫై చేయగా, 11 వేల కాంట్రాక్ట్ ఉద్యోగాలను రెగ్యూలరైజ్ చేసినట్లు ప్రకటించారు. తెలంగాణలో 7 జోన్‌లలో కలిపి 18,866 ఖాళీలు, మల్టీ జోన్‌లలో 13,170 పోస్టులు ఖాళీగా ఉన్నాయని సీఎం కేసీఆర్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదం తెలపడంతో 2021లో తుది ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆ ఉత్తర్వులకు అనుగుణంగా స్థానిక క్యాడర్ వ్యవస్థీకరణ ప్రక్రియ గడేడాది ఆగస్టులో పూర్తయింది. జోన్లు, మల్టీజోన్ల వివరాలు ఇలా ఉన్నాయి.
జోన్ల వారీగా ఖాళీలు..
కాళేశ్వరం జోన్ - 1,630
బాసర జోన్ - 2,328
రాజన్న జోన్ - 2,403
భద్రాద్రి జోన్ - 2,858
యాదాద్రి జోన్ - 2,160
చార్మినార్ జోన్ - 5,297
జోగులాంబ జోన్ - 2,190
మొత్తం పోస్టులు - 18,866
మల్టీజోన్లలో ఖాళీలు
మల్టీజోన్ 1 - 6,800
మల్టీజోన్ 2 - 6,370
మొత్తం పోస్టులు - 13,170
మల్టీజోన్ 1 కింద జోన్ 1 కాళేశ్వరం జోన్, జోన్ 2 బాసర జోన్, జోన్ 3 రాజన్న జోన్, జోన్ 4 భద్రాద్రి జోన్
మల్టీజోన్ 2 కింద జోన్ 5 యాదాద్రి జోన్, జోన్ 6 చార్మినార్, జోన్ 7 జోగులాంబ జోన్ ఉన్నాయి.
అయితే జోన్ 1 కింద వచ్చే జిల్లాలు ఇవే
1. కాళేశ్వరం జోన్
ఆసిఫాబాద్, కొమురం భీమ్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, జయశంకర్, ములుగు
2. బాసర జోన్
ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాలు
3. రాజన్న జోన్
కరీంనగర్, సిరిసిల్ల రాజన్న, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి జిల్లాలు
4. భద్రాద్రి జోన్
కొత్తగూడెం - భద్రాద్రి, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ రూరల్, హన్మకొండ జిల్లాలు
మల్టీ జోన్ 2 జిల్లాలు ఇవే..
5. యాదాద్రి జోన్
సూర్యాపేట, నల్లగొండ, యాదాద్రి భువనగిరి, జనగాం జిల్లాలు
6. చార్మినార్ జోన్
మేడ్చల్ - మల్కాజ్ గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలు
7. జోగుళాంబ జోన్
మహబూబ్‌నగర్, నారాయణ్ పేట, జోగుళాంబ - గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాలు