అన్వేషించండి

TSPSC: 'గ్రూప్‌-1' ప్రిలిమ్స్‌కు ఏర్పాట్లు పూర్తి, ఒకట్రెండు రోజుల్లో హాల్‌టికెట్లు!

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కారణంగా రాష్ట్రంలో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను జూన్ 11న తిరిగి నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో పరీక్ష నిర్వహణకు టీఎస్‌పీఎస్సీ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది.

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కారణంగా రాష్ట్రంలో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను తిరిగి నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణకు టీఎస్‌పీఎస్సీ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ప్రకారం జూన్ 11న ప్రిలిమ్స్ పరీక్ష పరీక్ష నిర్వహించనుంది. అభ్యర్థులకు పూర్తిస్థాయి తనిఖీలు నిర్వహించి, బయోమెట్రిక్ ధ్రువీకరణ తర్వాతే అనుమతించేలా ఏర్పాట్లు చేసింది. 

నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే అభ్యర్థులపై కఠిన చర్యలు తీసుకునేలా చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో నియామక నిబంధనల ప్రకారం పరీక్ష తేదీకి వారం రోజులు ముందుగా పరీక్ష కేంద్రాలను పేర్కొంటూ హాల్‌టికెట్లు జారీ చేసేందుకు కమిషన్ ర్యాండమైజేషన్ ప్రక్రియ నిర్వహిస్తోంది. ఇది మరో రెండు రోజుల్లో ముగియనుంది. గ్రూప్-1 హాల్‌టికెట్లు జూన్ 3 లేదా 4న అందుబాటులోకి రానున్నాయి. ప్రిలిమినరీ పరీక్షను ఓఎంఆర్ పద్ధతిలోనే నిర్వహించనున్నారు.

నిబంధనలను అతిక్రమిస్తే డీబారే..
సర్వీస్ కమిషన్ పరీక్షల్లో ఇక నుంచి ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కమిషన్ నిబంధనల ప్రకారం భవిష్యత్తులో ఎలాంటి పరీక్షలు రాయకుండా డిబార్ చేయాలని నిర్ణయించింది. టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసుతో సంబంధాలున్న 50 మందిని రెండు రోజుల వ్యవధిలో కమిషన్ డిబార్ చేసిన సంగతి తెలిసిందే. పరీక్ష కేంద్రాల్లో అల్లరి చేసినా, ఎలక్ట్రానిక్ పరికరాలతో పట్టుబడినా పోలీసు కేసులతో పాటు చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.

తెలంగాణ గ్రూప్ -1 పరీక్షకు సంబంధించి మొత్తం 503 పోస్టులకు 3,80,202 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో పోస్టుకు సగటున 756 మంది చొప్పున పోటీపడుతున్నారు. గ్రూప్-1 ప్రకటనలో మొత్తం 503 పోస్టుల్లో మహిళలకు 225 కేటాయించారు. వీటికి 1,51,192 మంది దరఖాస్తు చేయగా.. ఒక్కో పోస్టుకు సగటున 672 మంది పోటీపడుతున్నారు. ప్రిలిమినరీ పరీక్ష నుంచి ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున మెయిన్ పరీక్షకు అభ్యర్థులను ఎంపికచేస్తారు.

తొలుత అక్టోబరు 16న జరిగిన ప్రిలిమినరీ పరీక్షకు 2.85 లక్షల మంది హాజరయ్యారు. ఐతే టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ నేపథ్యంలో ఆ పరీక్షను రద్దు చేశారు. తిరిగి జూన్‌ 11న తిరిగి నిర్వహిస్తున్నారు. ఐతే లీకేజీ వ్యవహారం నేపథ్యంలో కమిషన్‌ ఈసారి పకడ్బందీగా పరీక్షల నిర్వహణకు సన్నాహాలు చేస్తోంది. దీంతో పరీక్షల నిర్వహణ కోసం కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ పోస్టును సృష్టించి, ఐఏఎస్‌ అధికారికి బాధ్యతలను టీఎస్‌పీఎస్సీ అప్పగించింది. గ్రూప్‌-1 రాత పరీక్ష ప్రక్రియను ఈ ప్రత్యేక విభాగం పర్యవేక్షణలో జరుగుతుంది.

పరీక్ష విధానం, సిలబస్ వివరాలు ఇలా..

Also Read:

గ్రూప్‌-1 ప్రిలిమినరీకి ఏర్పాట్లు మొదలుపెట్టిన టీఎస్‌పీఎస్సీ, OMR విధానంలోనే పరీక్ష!
తెలంగాణలో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షపై స్టే ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించిన సంగతి తెలిసిందే. దీంతో పరీక్ష నిర్వహణపై నెలకొన్న అనిశ్చితికి తెరపడినట్టయింది. దీంతో ఇప్పటికే ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జూన్‌ 11న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించేందుకు టీఎస్‌పీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది. గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష తేదీకి వారం రోజుల ముందుగా హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచనున్నారు. గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షను ఓఎంఆర్‌ విధానంలోనే నిర్వహించాలని కమిషన్ నిర్ణయించింది. 
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Tirumala : తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Tirumala : తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Hyderabad News: డబ్బులు పంచుతానంటూ ఇన్ స్టాలో ప్రచారం - కొండాపూర్ ఏఎంబీ మాల్‌లో బౌన్సర్లతో యువకుడి హల్చల్
డబ్బులు పంచుతానంటూ ఇన్ స్టాలో ప్రచారం - కొండాపూర్ ఏఎంబీ మాల్‌లో బౌన్సర్లతో యువకుడి హల్చల్
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
Gavaskar Standing Ovation: నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
Embed widget