TSPSC Exams: టీఎస్‌పీఎస్సీ పరీక్షల రీషెడ్యూలు! గ్రూప్-2, 4 పరీక్షలపై సందిగ్ధత!
ఇప్పటికే జరిగిన గ్రూప్-1 ప్రిలిమ్స్, ఏఈఈ, డీఏవో, ఏఈ పరీక్షల్ని టీఎస్‌పీఎస్సీ రద్దు కాగా.. మార్చిలో జరగాల్సిన టీపీబీవో, వెటర్నరీ అసిస్టెంట్ పోస్టుల పరీక్షలను వాయిదా వేసింది.
![TSPSC Exams: టీఎస్పీఎస్సీ పరీక్షల రీషెడ్యూలు! గ్రూప్-2, 4 పరీక్షలపై సందిగ్ధత! tspsc exams may reschedule, ambiguity on group 2 and group 4 exams TSPSC Exams: టీఎస్పీఎస్సీ పరీక్షల రీషెడ్యూలు! గ్రూప్-2, 4 పరీక్షలపై సందిగ్ధత!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/13/c05b810a500405dacac3710be15313c91678715381738235_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
తెలంగాణలో ప్రశ్నపత్రాల లీకేజీతో వివిధ పరీక్షల తేదీలు మారే అవకాశం ఉంది. పరీక్షలను రీషెడ్యూలు చేయాలని టీఎస్‌పీఎస్సీ భావిస్తోంది. వేటిని రీషెడ్యూలు చేసే అవకాశముంది? వేటిని యథాతథంగా కొనసాగించవచ్చన్న విషయమై కసరత్తు చేస్తోంది. ముందుగా తక్కువ సంఖ్యలో అభ్యర్థులు హాజరయ్యే పరీక్షలను త్వరగా ముగించాలని కమిషన్ భావిస్తోంది. కార్యాచరణ సిద్ధం చేస్తోంది.
ఇప్పటికే జరిగిన గ్రూప్-1 ప్రిలిమ్స్, ఏఈఈ, డీఏవో, ఏఈ పరీక్షల్ని టీఎస్‌పీఎస్సీ రద్దు చేసింది. మార్చిలో జరగాల్సిన టీపీబీవో, వెటర్నరీ అసిస్టెంట్ పోస్టుల పరీక్షలను వాయిదా వేసింది. ఏప్రిల్, మేలో జరగాల్సిన పరీక్షల తేదీలూ రీషెడ్యూలయ్యే అవకాశముంది. రద్దుచేసిన, వాయిదా వేసిన పరీక్షలకు నెలాఖరులోగా తేదీలను ప్రకటించే అవకాశమున్నట్లు తెలిసింది.
సాధారణంగా ఏదైనా పోటీ పరీక్షకు రెండు నెలల ముందుగా ప్రశ్నపత్రాలు సిద్ధమవుతాయి. రానున్న రెండు నెలల్లో జరగాల్సిన పరీక్షలకు ప్రశ్నపత్రాలను సిద్ధం చేయడానికి కొంత సమయం పట్టనుంది. నలభై వేల మంది కన్నా ఎక్కువ మంది అభ్యర్థులు హాజరయ్యే పోటీ పరీక్షలను కమిషన్ ఓఎంఆర్ పద్ధతిలో నిర్వహిస్తోంది. అంతకు తక్కువగా ఉంటే కంప్యూటర్ ఆధారితంగా పరీక్షలు పెడుతోంది.
ఓఎంఆర్ పద్ధతిలో నిర్వహించడానికి కనీసం మూడు నెలల సమయం అవసరం. ప్రశ్నపత్రం సిద్ధం చేసి, ముద్రించి, పరీక్ష కేంద్రాల వరకు సరఫరా చేయడానికి సమయం పడుతుంది. కొన్ని పోటీ పరీక్షలకు ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ ముగియడంతో తక్కువ సంఖ్యలో అభ్యర్థులున్న వాటికి కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించాలని భావిస్తోంది. వాటిని వేగంగా నిర్వహించడంతోపాటు ఫలితాలనూ వెంటనే ఇచ్చేందుకు అవకాశముందని కమిషన్ వర్గాలు భావిస్తున్నాయి.
గ్రూప్-4, 2 పరీక్ష తేదీలపై సందిగ్ధత..
గత షెడ్యూలు ప్రకారం జూన్‌లో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు జరగాల్సిఉంది. అదేనెలలో యూపీఎస్‌సీ, జేఈఈ పరీక్షలున్నాయి. ఈ నేపథ్యంలో ప్రిలిమ్స్ పరీక్షను జూన్ 11న నిర్వహించాలని కమిషన్ నిర్ణయించింది. ఇప్పటికే గ్రూప్-4, 2 పరీక్షల తేదీలను ప్రకటించింది. వీటిని అనుకున్న సమయానికే నిర్వహించాలా? అనే విషయమై ఆలోచిస్తోంది. తొలుత గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష జరగనుంది. జులై 1న గ్రూప్-4, ఆగస్టు 29, 30 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు జరగనున్నాయి. ఈ మూడింటినీ వరుసగా నిర్వహిస్తే అభ్యర్థులకు ఇబ్బందులు తలెత్తుతాయా? సిద్ధమయ్యేందుకు సమయం సరిపోతుందా? అనే విషయాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయించే అవకాశముంది.
ALso Read:
అక్టోబర్ నుంచే లీకులు మొదలెట్టేశారు- సిట్ విచారణలో షాకింగ్ విషయాలు
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీసె కమిషన్ - టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీక్ వ్యవహారంలో షాకింగ్ విషయాలు బయటకొస్తున్నాయి. సిట్ అధికారుల దర్యాప్తులో విస్మయ పరిచే విషయాలు వెలుగుచూస్తున్నాయి. సిస్టమ్ అనలిస్ట్ రాజశేఖర్, కార్యదర్శి పీఏ ప్రవీణ్ ఇద్దరు కలిసి అక్టోబర్ నుంచి ప్రశ్నాపత్రాలు లీక్ చేస్తున్నట్లు సిట్ అధికారులు గుర్తించారు. టీఎస్పీఎస్సీ కార్యాలయంలో అంతా తానే వ్యవహరించే రాజశేఖర్.. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎలాంటి వివరాలను అయినా దొంగలించి ప్రవీణ్ కు అందజేసే వాడని తేలింది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
21 నుంచి ఎస్సీటీ ఎస్‌ఐ పరీక్ష హాల్‌టికెట్లు! పరీక్ష ఎప్పుడంటే?
తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (టీఎస్ఎల్‌పీఆర్‌బీ) మార్చి 26న ఎస్‌సీటీ ఎస్‌ఐ టెక్నికల్ పేపర్ రాతపరీక్ష నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లు మార్చి 21 నుంచి అందుబాటులో ఉండనున్నాయి. అభ్యర్థలు మార్చి 21న ఉదయం 8 గంటల నుంచి హాల్‌టికెట్లు వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మార్చి 24న అర్ధరాత్రి 12 గంటల వరకు అభ్యర్థులు తమ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ మేరకు పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు అధికారిక ప్రకటన విడుదల చేసింది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)