![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Medical Officer Posts: వైద్యారోగ్య శాఖలో 156 మెడికల్ ఆఫీసర్ పోస్టులు, దరఖాస్తు గడువు పొడిగింపు - చివరితేది ఇదే!
తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఆయుష్ విభాగంలో మెడికల్ ఆఫీసర్ పోస్టుల నియామకానికి రాష్ట్ర వైద్యారోగ్య సేవల రిక్రూట్‌మెంట్ బోర్డు(ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) దరఖాస్తు చివరి తేదీని పొడిగించింది.
![Medical Officer Posts: వైద్యారోగ్య శాఖలో 156 మెడికల్ ఆఫీసర్ పోస్టులు, దరఖాస్తు గడువు పొడిగింపు - చివరితేది ఇదే! ts mhsrb has extended medical-officer application last date apply now Medical Officer Posts: వైద్యారోగ్య శాఖలో 156 మెడికల్ ఆఫీసర్ పోస్టులు, దరఖాస్తు గడువు పొడిగింపు - చివరితేది ఇదే!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/14/b6c5d72037ad6968486050731369a5e71692014805950522_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Medical Officer Recruitment: తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఆయుష్ విభాగంలో మెడికల్ ఆఫీసర్ పోస్టుల నియామకానికి రాష్ట్ర వైద్యారోగ్య సేవల రిక్రూట్‌మెంట్ బోర్డు(ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) జులై 13న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా 156 మంది ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో 54 ఆయుర్వేద, 33 హోమియో, 69 యునానీ పోస్టులు ఉన్నాయి.
ఈ పోస్టుల భర్తీకి ఆగస్టు 7 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా ఆగస్టు 22తో దరఖాస్తు గడువు ముగియాల్సి ఉంది. అయితే దరఖాస్తు గడువును అధికారులు సెప్టెంబర్ 21 వరకు పొడిగించారు. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేనివారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.
అర్హత పరీక్షలో సాధించిన మార్కులు, గతంలో ప్రభుత్వ సర్వీసులో అందించిన సేవలను నియామకానికి ప్రాతిపదికగా తీసుకోనున్నారు. గిరిజన ప్రాంతాల్లో అందించిన సేవలకు ప్రాధాన్యమిస్తారు. గరిష్ఠ వయసు ఈ ఏడాది జులై 1 నాటికి 44 సంవత్సరాలు ఉండాలి.
వివరాలు..
మొత్తం ఖాళీలు: 156 (జోన్-1: 96, జోన్-2: 60)
* మెడికల్ ఆఫీసర్ పోస్టులు
విభాగాల వారీగా ఖాళీలు..
- ఆయుర్వేదం: 54
- హోమియో: 33
- యునాని: 69
అర్హత: డిగ్రీ (ఆయుర్వేదం, హోమియో, యునాని) ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
వయోపరిమితి: 01.07.2023 నాటికి 18 - 44 సంవత్సరాలు ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు 5 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌మెన్, ఎన్‌సీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, ఎస్సీ-ఎస్టీ-బీసీ-ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు ఫీజు: రూ.700. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్, నిరుద్యోగ అభ్యర్థులు రూ.500 చెల్లిస్తే సరిపోతుంది. ఇతర రాష్ట్రాలకు చెందిన దరఖాస్తుదారులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు లేదు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్, అనుభవం ఆధారంగా. మొత్తం 100 పాయింట్లకు ఎంపిక విధానం ఉంటుంది. ఇందులో 80 మార్కులు విద్యార్హతకు, 20 మార్కులు అనుభవం ఆధారంగా ఎంపికచేస్తారు.
జీతం: రూ.54,220 - రూ.1,33,630.
ముఖ్యమైన తేదీలు..
* ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 07.08.2023. ఉదయం 10.30 గంటల నుండి
* ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 22.08.2023 నుంచి పొడిగించిన తేదీ 21.09.2023 సాయంత్రం 5.00 గంటల వరకు.
ALSO READ:
ఎన్‌ఎస్‌యూటీ న్యూఢిల్లీలో 322 ఫ్యాకల్టీ పోస్టులు, అర్హతలివే!
NSUT Delhi Recruitment 2023: న్యూఢిల్లీలోని నేతాజీ సుభాష్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 322 ప్రొఫెసర్, అసిస్ట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, బీఎస్, ఎంఈ, ఎంటెక్, ఎంఎస్, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆగస్టు 17 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్టు 31 వరకు దరఖాస్తు హార్డుకాపీలను పంపించాలి.
నోటిఫికేషన్, పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
భారత్ డైనమిక్స్ లిమిటెడ్‌లో 45 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు
భారత్ డైనమిక్స్ లిమిటెడ్ బీడీఎల్ కార్యాలయాలు/ యూనిట్లలో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 45 మేనేజ్‌మెంట్ ట్రైనీ, వెల్ఫేర్ ఆఫీసర్, జేఎం పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగాల్లో డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)