UPSC IFS Application: ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్ - 2023 దరఖాస్తుకు నేడే ఆఖరు! వెంటనే అప్లయ్ చేయండి!
ఈ పరీక్ష దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 1న ప్రారంభంకాగా.. ఫిబ్రవరి 21తో గడువు ముగియనుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించి, ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్-2023 నోటిఫికేషన్‌ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫిబ్రవరి 1న విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా ఫారెస్ట్ సర్వీసెస్‌లోని వివిధ పోస్టులను భర్తీచేయనున్నారు. ఈ పరీక్ష దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 1న ప్రారంభంకాగా.. ఫిబ్రవరి 21తో గడువు ముగియనుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించి, ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సంబంధిత విభాగాల్లో డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్ పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపికచేస్తారు. ఫిబ్రవరి 22 నుంచి 28 వరకు దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పించనున్నారు. మే 28న సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు. సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షనే దీనికి కూడా ప్రామాణికంగా భావిస్తారు. మెయిన్ పరీక్షను మాత్రం విడిగా నిర్వహిస్తారు. తదనంతరం ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపికచేస్తారు. డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
వివరాలు...
* ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ప్రిలిమినరీ) ఎగ్జామినేషన్- 2023
ఖాళీల సంఖ్య: 150.
అర్హత: డిగ్రీ (యానిమల్ హస్బెండరీ/ వెటర్నరీ సైన్స్/ బోటనీ/ కెమిస్ట్రీ/ జియాలజీ/ మ్యాథమెటిక్స్/ ఫిజిక్స్/ స్టాటిస్టిక్స్/ జువాలజీ) (లేదా) డిగ్రీ (అగ్రికల్చరల్/ ఫారెస్ట్రీ/ ఇంజినీరింగ్) ఉత్తీర్ణత ఉండాలి.
వయోపరిమితి: 01.08.2023 నాటికి 21 - 32 సంవత్సరాల మధ్య ఉండాలి. 02.08.1991 - 01.08.2002 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు ఫీజు: రూ.100.
ఎంపిక విధానం: ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, మెయిన్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా. సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షనే దీనికి కూడా ప్రామాణికంగా భావిస్తారు. మెయిన్ పరీక్షను మాత్రం విడిగా నిర్వహిస్తారు. తదనంతరం ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపికచేస్తారు.
Also Read: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2023 నోటిఫికేషన్ విడుదల, వివరాలు ఇలా!
ముఖ్యమైన తేదీలు...
➛ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.02.2023.
➛ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 21.02.2023.
➛ దరఖాస్తుల సవరణ తేదీలు: 22.02.2023 - 28.02.2023 వరకు.
➛ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష తేది: 28.05.2023.
Also Read:
TSPSC: గ్రూప్-1 అభ్యర్థులకు అలర్ట్ - మెయిన్స్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల చేసిన టీఎస్ పీఎస్సీ
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష తేదీలను ఖరారు చేసింది. ఇప్పటికే గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలను ప్రకటించిన టీఎస్ పీఎస్సీ తాజాగా మెయిన్స్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల చేసింది. తెలంగాణలో గ్రూప్ 1 పరీక్షలు జూన్ 5 నుంచి ప్రారంభం కానున్నాయి. జూన్ 5 నుంచి 12వ తేదీ వరకు అర్హత సాధించిన అభ్యర్థులకు గ్రూప్ 1 మెయిన్స్ నిర్వహించాలని టీఎస్ పీఎస్సీ నిర్ణయించింది.
గ్రూప్-1 మెయన్స్ పరీక్షల పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..
సీఆర్‌పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ పరీక్ష హాల్‌టికెట్లు వచ్చేశాయ్! డైరెక్ట్ లింక్ ఇదే!
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌లో హెడ్‌కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నిర్వహించనున్న పరీక్ష హాల్‌టికెట్లను ఫిబ్రవరి 20న అధికారులు విడుదల చేశారు. వాస్తవానికి ఫిబ్రవరి 15న విడుదల కావాల్సిన అడ్మిట్ కార్డులు సాంకేతిక కారణాల వల్ల 5 రోజులు ఆలస్యంగా అందుబాటులోకి వచ్చాయి. అధికారిక వెబ్‌సైట్‌లో అడ్మిట్ కార్డులను అందుబాటులో ఉంచారు. రాతపరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి అడ్మిట్‌కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
హాల్‌టికెట్లు, పరీక్ష వివరాల కోసం క్లిక్ చేయండి..