అన్వేషించండి

TGPSC Group 2 Exam: తెలంగాణలో గ్రూప్ 2, 3 పరీక్షలు వాయిదా వేశారా? కొత్త తేదీలపై టీజీపీఎస్సీ క్లారిటీ

TGPSC Group 2 and Group 3 Exam Dates: తెలంగాణలో గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్స్ వాయిదా వేశారని ఓ సర్క్యూలర్ వైరల్ అవుతోంది. అయితే గ్రూప్ 2, గ్రూప్ 3 వాయిదాపై నిర్ణయం తీసుకోలేదని టీజీపీఎస్సీ తెలిపింది.

TGPSC Group 2 and Group 3 Exam Schedule | హైదరాబాద్: తెలంగాణలో గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. పోస్టులు పెంచి ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని నిరుద్యోగులు కోరుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం అభ్యర్థుల రిక్వెస్ట్‌ను పరిగణనలోకి తీసుకుని ఎగ్జామ్ రీషెడ్యూల్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. రీ షెడ్యూల్ అయిన తెలంగాణ గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్ డేట్లు అని ఓ ప్రకటన సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఆ నోటీసుపై టీజీపీఎస్సీ అధికారులు స్పందించారు.

గ్రూప్ 2, 3 ఎగ్జామ్స్ వాయిదా వేయలేదన్న టీజీపీఎస్సీ 
తెలంగాణలో త్వరలో జరగనున్న గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షల తేదీలు మార్చేందుకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వైరల్ ప్రకటనలో వాస్తవం లేదని, అదంతా ఫేక్ న్యూస్ అని టీజీపీఎస్సీ క్లారిటీ ఇచ్చింది. అభ్యర్థులు వాటిని నమ్మకూడదని, అధికారిక ప్రకటనల్ని మాత్రమే విశ్వసించాలని సూచించింది. గ్రూప్ 2 ఎగ్జామ్ ఆగస్టులో జరగాల్సి ఉండగా, నవంబర్ 17, 18 తేదీలలో నిర్వహించడానికి టీజీఎస్సీ రీషెడ్యూల్ చేసిందని ప్రచారం జరిగింది. అదే విధంగా గ్రూప్ 3 ఎగ్జామ్ నవంబర్ 24, 25 తేదీలకు వాయిదా వేసినట్లు టీజీసీఎస్సీ పేరుతో ఓ ప్రకటన వైరల్ అయింది. దానిపై టీజీపీఎస్సీ స్పందించి క్లారిటీ ఇచ్చింది. గ్రూప్ 2, గ్రూప్ 3 నియామక పరీక్షలను వాయిదా వేయలేదని, అభ్యర్థులు ఇలాంటివి నమ్మవద్దని సూచించారు.


TGPSC Group 2 Exam: తెలంగాణలో గ్రూప్ 2, 3 పరీక్షలు వాయిదా వేశారా? కొత్త తేదీలపై టీజీపీఎస్సీ క్లారిటీ

 

తెలంగాణలో మొత్తం 783 గ్రూప్-2 ఉద్యోగాల (Group2 Posts) భర్తీకి రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) 29 డిసెంబర్ 2022న నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు మొత్తం 5,51,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, ఒక్కో పోస్టుకు దాదాపు 700 మంది చొప్పున పోటీ నెలకొంది. గత ఏడాది నవంబర్ నెలలో గ్రూప్ 2 ఎగ్జామ్ నిర్వహించాల్సి ఉండగా, ఎన్నికలు రావడంతో వాయిదా వేశారు. 

తాము అధికారంలోకి రాగానే జనవరిలో గ్రూప్ 2 ఎగ్జామ్స్, వెంటనే గ్రూప్ 3 సైతం నిర్వహిస్తామని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పింది. అసెంబ్లీ ఎన్నికలు జరగడం, బీఆర్ఎస్ ఓడిపోవడం జరిగిపోయాయి. కాంగ్రెస్ తెలంగాణలో తొలిసారి అధికారంలోకి రాగా, జనవరిలో నిర్వహించాల్సిన గ్రూప్ 2 ఎగ్జామ్ వాయిదా వేశారు. టీజీపీఎస్సీ కొత్త చైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని నియమించి పోస్టుల భర్తీపై ఫోకస్ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. 

గ్రూప్ 2 పరీక్ష తేదీలివే.. 
ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్-2 పరీక్ష నిర్వహించాల్సి ఉంది. కానీ పోస్టులు పెంచడంతో పాటు పరీక్షను వాయిదా వేసి, రీషెడ్యూల్ చేయాలన్న డిమాండ్ వస్తోంది. అభ్యర్థులు టీజీపీఎస్సీ కార్యాలయం ముట్టడికి పిలుపునివ్వడంతో పాటు ఉస్మానియా యూనివర్సిటీ సహా వీలున్న చోట నిరసన తెలుపుతున్నారు. డీఎస్సీ సైతం పోస్టులు పెంచాలని, పరీక్షలు వాయిదా వేసి పకడ్బందీగా నిర్వహించాలని కోరుతున్నారు. మహిళా అభ్యర్థులు సైతం రాత్రి అని చూడకుండా ఓయూ వద్ద నిరసన తెలిపారు. సిలబస్ చాలా పెంచారని, తక్కువ సమయంలో సబ్జెక్ట్ చదవడం పూర్తి కాదని, ప్రభుత్వం తమ సమస్యల్ని పట్టించుకోవాలన్నారు. 

Also Read: TGDSC Halltickets: డీఎస్సీ అభ్యర్థులకు అలర్ట్, పరీక్ష హాల్‌టికెట్లు వచ్చేస్తున్నాయ్ - డౌన్‌లోడ్ ఎప్పటినుంచంటే?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Manchu Politics: మంచు కుటుంబ వివాదంలో రాజకీయ కోణం -  టీడీపీ, వైసీపీ నేతల ప్రమేయం ఉందా ?
మంచు కుటుంబ వివాదంలో రాజకీయ కోణం - టీడీపీ, వైసీపీ నేతల ప్రమేయం ఉందా ?
Mohan Babu Complaint Against Manoj: మంచు మనోజ్ నుంచి నాకు ప్రాణహాని ఉంది - పోలీసులకు మోహన్ బాబు ఫిర్యాదు
మంచు మనోజ్ నుంచి నాకు ప్రాణహాని ఉంది - పోలీసులకు మోహన్ బాబు ఫిర్యాదు
Revanth Reddy Key Decisions: తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన - 9 మంది ప్రముఖులకు రూ.1 కోటి నగదు, ఇంటి స్థలం
తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన - 9 మంది ప్రముఖులకు రూ.1 కోటి నగదు, ఇంటి స్థలం
Nagababu:వీడిన సస్పెన్స్ - ఏపీ కేబినెట్ లో మెగా బ్రదర్ నాగబాబుకు కీలక పదవి
వీడిన సస్పెన్స్ - ఏపీ కేబినెట్ లో మెగా బ్రదర్ నాగబాబుకు కీలక పదవి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Manchu Manoj vs Mohan babu | కరిగిన మంచు...ముదిరిన వివాదం | ABP DesamPushpa Day 4 Collections | రోజు రోజుకూ కలెక్షన్లు పెంచుకుంటున్న పుష్ప 2 | ABP DesamPushpa 2 Breaking all Bollywood Records | హిందీ సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న పుష్ప కలెక్షన్లు | ABP Desamఆటో డ్రైవర్ ఫ్యామిలీతో కేటీఆర్, ఆత్మీయ ముచ్చట - వైరల్ వీడియో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Manchu Politics: మంచు కుటుంబ వివాదంలో రాజకీయ కోణం -  టీడీపీ, వైసీపీ నేతల ప్రమేయం ఉందా ?
మంచు కుటుంబ వివాదంలో రాజకీయ కోణం - టీడీపీ, వైసీపీ నేతల ప్రమేయం ఉందా ?
Mohan Babu Complaint Against Manoj: మంచు మనోజ్ నుంచి నాకు ప్రాణహాని ఉంది - పోలీసులకు మోహన్ బాబు ఫిర్యాదు
మంచు మనోజ్ నుంచి నాకు ప్రాణహాని ఉంది - పోలీసులకు మోహన్ బాబు ఫిర్యాదు
Revanth Reddy Key Decisions: తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన - 9 మంది ప్రముఖులకు రూ.1 కోటి నగదు, ఇంటి స్థలం
తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన - 9 మంది ప్రముఖులకు రూ.1 కోటి నగదు, ఇంటి స్థలం
Nagababu:వీడిన సస్పెన్స్ - ఏపీ కేబినెట్ లో మెగా బ్రదర్ నాగబాబుకు కీలక పదవి
వీడిన సస్పెన్స్ - ఏపీ కేబినెట్ లో మెగా బ్రదర్ నాగబాబుకు కీలక పదవి
Sobhita Dhulipala :  కాక్​టైల్​ పార్టీలో శోభిత ధూళిపాళ.. పెళ్లితర్వాత మోడ్రన్ లుక్​లో స్టన్ చేస్తోందిగా
కాక్​టైల్​ పార్టీలో శోభిత ధూళిపాళ.. పెళ్లితర్వాత మోడ్రన్ లుక్​లో స్టన్ చేస్తోందిగా
Syria Civil War: సిరియాలో అంతర్యుద్ధానికి ఐదు ప్రధాన కారణాలు ఇవే
సిరియాలో అంతర్యుద్ధానికి ఐదు ప్రధాన కారణాలు ఇవే
Mohanbabu House: అది ఇల్లు కాదు ప్యాలెస్‌ కంటే ఎక్కువ - మోహన్ బాబు ఇంటిని స్వయంగా చూపిస్తున్న మంచు లక్ష్మి - చూస్తారా ?
అది ఇల్లు కాదు ప్యాలెస్‌ కంటే ఎక్కువ - మోహన్ బాబు ఇంటిని స్వయంగా చూపిస్తున్న మంచు లక్ష్మి - చూస్తారా ?
Sobhita Dhulipala : పెళ్లికూతురు నగలు ఎలా ఉండాలో తెలుసా? శోభిత ధూళిపాళను చూసి ఫాలో అయిపోండి
పెళ్లికూతురు నగలు ఎలా ఉండాలో తెలుసా? శోభిత ధూళిపాళను చూసి ఫాలో అయిపోండి
Embed widget