అన్వేషించండి

TGDSC Halltickets: డీఎస్సీ అభ్యర్థులకు అలర్ట్, పరీక్ష హాల్‌టికెట్లు వచ్చేస్తున్నాయ్ - డౌన్‌లోడ్ ఎప్పటినుంచంటే?

Telangana DSC: తెలంగాణలో జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు నిర్వహించనున్న డీఎస్సీ 2024 పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను విద్యాశాఖ జులై 11న విడుదల చేయనుంది. వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు అందుబాటులో ఉంటాయి.

Telangana DSC Halltickets: తెలంగాణలో జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు నిర్వహించనున్న డీఎస్సీ పరీక్షల హాల్‌టికెట్లను జులై 11 నుంచి అందుబాటులోకి రానున్నాయి. అభ్యర్థులు జులై 11న సాయంత్రం 5 గంటల నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. రాష్ట్రంలో తొలిసారిగా ఆన్‌లైన్ విధానంలో డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రకటించిన తేదీల్లో ప్రతిరోజూ రెండు సెషన్లలో డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నారు. డీఎస్సీ ప‌రీక్షల‌ను మూడు నెల‌ల పాటు వాయిదా వేయడంతోపాటు 25 వేల పోస్టుల‌తో మెగా డీఎస్సీ ప్రక‌టించాల‌ని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నా.. షెడ్యూలు ప్రకారమే పరీక్ష నిర్వహించడానికి ప్రభుత్వం మొగ్గుచూపింది. 

తెలంగాణలో 11,062 టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించనున్న డీఎస్సీ పరీక్షల షెడ్యూలును విద్యాశాఖ జూన్ 28న ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిప్రకారం జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నారు. తొలిసారిగా కంప్యూటర్ ఆధారిత (సీబీఆర్‌టీ) విధానంలో రోజుకు రెండు షిఫ్టుల్లో డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నారు.

డీఎస్సీ-2024 పరీక్ష విధానం..

డీఎస్సీ సిలబస్ వివరాల కోసం క్లిక్ చేయండి..

టీఎస్‌ డీఎస్సీ 2024 పరీక్షల షెడ్యూలు..

పరీక్ష తేదీ పరీక్ష పేపరు
18.07.2024 స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్
19.07.2024 సెకండరీ గ్రేడ్ టీచర్
20.07.2024 స్కూల్ అసిస్టెంట్ (స్పెషల్ ఎడ్యుకేషన్), సెకండరీ గ్రేడ్ టీచర్ (స్పెషల్ ఎడ్యుకేషన్) 
22.07.2024 సెకండరీ గ్రేడ్ టీచర్, స్కూల్ అసిస్టెంట్ (మ్యాథమెటిక్స్) 
23.07.2024 సెకండరీ గ్రేడ్ టీచర్ (ఇంగ్లిష్, తెలుగు) 
24.07.2024 స్కూల్ అసిస్టెంట్ (బయలాజికల్ సైన్స్)
25.07.2024 స్కూల్ అసిస్టెంట్ (తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్, మరాఠీ)
26.07.2024 లాంగ్వేజ్ పండిట్(తెలుగు), సెకండరీ గ్రేడ్ టీచర్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (పీఈటీ)
30.07.2024 స్కూల్ అసిస్టెంట్ (సోషల్ స్టడీస్)
31.07.2024 స్కూల్ అసిస్టెంట్ (ఫిజికల్ సైన్స్), స్కూల్ అసిస్టెంట్ (బయోలాజికల్ సైన్స్), స్కూల్ అసిస్టెంట్ (మ్యాథమెటిక్స్)
01.08.2024 సెకండరీ గ్రేడ్ టీచర్ (ఇంగ్లిష్, తెలుగు), స్కూల్ అసిస్టెంట్ (సోషల్ స్టడీస్) 
02.08.2024 లాంగ్వేజ్ పండిట్(తెలుగు), స్కూల్ అసిస్టెంట్ (మ్యాథమెటిక్స్), స్కూల్ అసిస్టెంట్ (హిందీ), లాంగ్వేజ్ పండిట్ (కన్నడ, మరాఠీ, ఉర్దూ, సంస్కృతం)   
05.08.2024 స్కూల్ అసిస్టెంట్ (ఫిజికల్ ఎడ్యుకేషన్), లాంగ్వేజ్ పండిట్ (హిందీ)

తెలంగాణలో 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 29న 'మెగా డీఎస్సీ-2024' నోటిఫికేషన్‌ వెలువడిన సంగతి తెలిసిందే. ఈ పోస్టుల భర్తీకి మార్చి 4 నుంచి జూన్ 20 వరకు దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం ఖాళీల్లో సెకండరీ గ్రేడ్ టీచర్ (SGT Posts)-6,508 పోస్టులు, స్కూల్ అసిస్టెంట్ (School Assistants) - 2,629 పోస్టులు,  లాంగ్వేజ్ పండిట్ (Laungage Pandi Posts) - 727, పీఈటీలు (PET. Posts)-182 పోస్టులు, ప్రత్యేక కేటగిరీ విభాగంలో స్కూల్ అసిస్టెంట్లు 220 పోస్టులు, ఎస్జీటీలు 796 పోస్టులు ఉన్నాయి. ఇక జిల్లావారీగా ఖాళీల వివరాలు పరిశీలిస్తే.. రాష్ట్రంలో అత్యధిక ఖాళీలు హైదరాబాద్‌లో 878 ఉండగా.. ఆ తర్వాత నల్గొండ జిల్లాలో 605, నిజామాబాద్‌లో 601, ఖమ్మం 757, సంగారెడ్డి 551, కామారెడ్డి 506 చొప్పున ఖాళీలను భర్తీ చేయనున్నారు. అత్యల్పంగా పెద్దపల్లి జిల్లాలో 93 ఖాళీలను భర్తీ చేయనన్నారు. ఆ తర్వాత స్థానాల్లో రాజన్న సిరిసిల్ల (151), వనరపర్తి (152) ఉన్నాయి.

Related Articles..

'డీఎస్సీ' పరీక్షలు షెడ్యూలు ప్రకారమే, అభ్యర్థుల నిరసనకు తలొగ్గని రేవంత్ సర్కార్

టీఎస్ డీఎస్సీ 2024లో ఏ జిల్లాకు ఎన్ని పోస్టులు కేటాయించారో తెలుసా?

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Balineni Srinivasa Reddy : నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Tiger News: రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

One Nation One Election | జమిలి ఎన్నికలంటే ఏంటి | ABP Desamమోదీని త్వరలోనే కలుస్తా, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలుఏపీలో బడి పంతులమ్మ, ఇప్పుడు ఢిల్లీ సీఎం - అతిషి గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?రాహుల్‌ ఓ టెర్రరిస్ట్ అంటూ కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు, కాంగ్రెస్ ఆందోళనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Balineni Srinivasa Reddy : నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Tiger News: రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
TPCC News: తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
Tirumala News: తిరుమల ప్రసాదాలపై చంద్రబాబు ఆరోపణలు అత్యంత దుర్మార్గం - టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన
తిరుమల ప్రసాదాలపై చంద్రబాబు ఆరోపణలు అత్యంత దుర్మార్గం - టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన
India vs Bangladesh: ఈ బంగ్లా జట్టుతో అంత ఈజీ కాదు , తొలి టెస్టుకు సర్వం సిద్ధం
ఈ బంగ్లా జట్టుతో అంత ఈజీ కాదు , తొలి టెస్టుకు సర్వం సిద్ధం
Embed widget