అన్వేషించండి

TGDSC 2024: 'డీఎస్సీ' పరీక్షలు షెడ్యూలు ప్రకారమే, అభ్యర్థుల నిరసనకు తలొగ్గని రేవంత్ సర్కార్

Telangana DSC: రాష్ట్రంలో డీఎస్సీ పరీక్షలు యథాతథంగా జరుగుతాయని తెలంగాణ పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. షెడ్యూల్‌ ప్రకారం జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు డిఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది.

Telangana DSC Exam 2024: తెలంగాణలో డీఎస్సీ పరీక్షలను వాయిదావేయాలని ఉద్యోగార్థులు ఒకపక్క కోరుతుండగా.. ప్రభుత్వం మాత్రం ససేమిరా అంటోంది. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారమే పరీక్షలు నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు తెలంగాణ పాఠశాల విద్యాశాఖ జులై 8న ఒక ప్రకటన ద్వారా తెలిపింది. డీఎస్సీ పరీక్షలను యథాతథంగా జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. అభ్యర్థులు జులై 11న సాయంత్రం 5 గంటల నుంచి డీఎస్సీ హాల్‌‌టికెట్లను వెబ్‌‌సైట్ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవవచ్చని పేర్కొంది. 

తెలంగాణలో 11,062 టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించనున్న డీఎస్సీ పరీక్షల షెడ్యూలును విద్యాశాఖ జూన్ 28న ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిప్రకారం జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నారు. తొలిసారిగా కంప్యూటర్ ఆధారిత (సీబీఆర్‌టీ) విధానంలో రోజుకు రెండు షిఫ్టుల్లో డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నారు.

టీఎస్‌ డీఎస్సీ 2024 పరీక్షల షెడ్యూలు..

➥ జులై 18న మొదటి షిఫ్ట్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్, రెండో షిఫ్ట్‌లో ఫిజికల్ ఎడ్యుకేషన్ పరీక్ష నిర్వహిస్తారు.

➥ జులై 19న సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్ష

➥ జులై 20న ఎస్జీటీ, సెకండరీ గ్రేడ్ ఫిజికల్, స్పెషల్ ఎడ్యుకేషన్ పరీక్షలు

➥ జులై 22న స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ పరీక్ష

➥ జులై 23న సెకండరీ గ్రేడ్ టీచర్స్ పరీక్ష

➥ జులై 24న స్కూల్ అసిస్టెంట్ - బయలాజికల్ సైన్స్ పరీక్ష

➥ జులై 25న స్కూల్ అసిస్టెంట్ తెలుగు, ఉర్దూ, మరాఠీ పరీక్షలు

➥ జులై 26న తెలుగు భాషా పండిట్, సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్ష

➥ జులై 30న స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ పరీక్ష.

➥ ఆగస్టు 5 వరకు మిగతా పరీక్షలను నిర్వహించనున్నారు.

నిన్న గ్రూప్-1, నేడు డీఎస్సీ.. మొండిగా పోతున్న ప్రభుత్వం
జులై 7న గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు వెలువడిన సంగతి తెలిసిందే. గ్రూప్-1 పరీక్షకు హాజరైన అభ్యర్థుల నుంచి మెయిన్స్ పరీక్షకు 1 : 100 నిష్పత్తిలో ఎంపిక చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేశారు. టీజీపీఎస్సీ కార్యాలయ ముట్టడికి పిలుపునిచ్చారు. అయినా కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించలేదు. మెయిన్స్ పరీక్షకు 1 : 50 నిష్పత్తిలో మెయిన్స్ పరీక్షకు అభ్యర్థులను ఎంపిక చేస్తూ.. ప్రిలిమ్స్ ఫలితాలను వెల్లడించింది. తాజాగా డీఎస్సీ వాయిదావేయాలని కోరినప్పటికీ అదే మొండి ధోరణితో ముందుకెళ్తుంది.

అభ్యర్థుల అందోళనను లెక్కచేయని ప్రభుత్వం..
డీఎస్సీ ప‌రీక్షల‌ను మూడు నెల‌ల పాటు వాయిదా వేయడంతోపాటు 25 వేల పోస్టుల‌తో మెగా డీఎస్సీ ప్ర‌క‌టించాల‌ని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. రాష్ట్రంలో టెట్‌ నిర్వహించిన వెంటనే.. డీఎస్సీ నిర్వహిస్తున్నారని, రెండు పరీక్షల సిలబస్‌ వేర్వేరు కాబట్టి డీఎస్సీకి ప్రిపరేషన్‌కు సమయం కావాలని వారు కోరుతున్నారు. అయితే సోమవారం (జులై 8) డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేష‌న్ ముట్టడికి డీఎస్సీ అభ్యర్థులు పిలుపునిచ్చారు. దీంతో భారీ సంఖ్యలో డీఎస్సీ అభ్యర్థులు స్కూల్ ఎడ్యుకేష‌న్ కార్యాల‌యం వ‌ద్దకు చేరుకున్నారు. అభ్యర్థుల అందోళనను లెక్కచేయలేదు. నిర‌స‌న తెలుపుతున్న నిరుద్యోగుల‌ను పోలీసులు అరెస్టు చేశారు.   డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయడానికి అంగీకరించలేదు.  ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారమే డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. దీంతో డీఎస్సీ అభ్యర్థుల ఆందోళన అరణ్య రోదనే అయ్యింది.

ఏపీలో అలా.. తెలంగాణలో ఇలా.
ఒకవైపు పరీక్షను వాయిదా వేసేదే లేదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేయగా.. మరోవైపు ఏపీలో మాత్రం టెట్‌ పరీక్షల తేదీల్లో మార్పులు చేసింది. అభ్యర్థుల వినతుల మేరకు ఆగస్టులో నిర్వహించాల్సిన పరీక్షలను అక్టోబరుకు వాయిదావేసింది. ఈ లెక్కన టెట్ నిర్వహణ తర్వాత కూడా డీఎస్సీకి సన్నద్ధమవడానికి అభ్యర్థులకు తగిన సమయం ఇచ్చే అవకాశం లేకపోలేదు. డీఎస్సీ తర్వాత కనీసం 90 రోజులు సమయం ఇవ్వాలని అభ్యర్థులు ప్రభుత్వాన్ని వేడుకున్నారు. టెట్ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం డీఎస్సీ విషయంలో అభ్యర్థులు కోరికను నెరవేర్చే అవకాశం ఉంది. 

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Samineni Udaya Bhanu: వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Harish Rao: 'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

హైదరాబాద్ దాటిన హైడ్రా బుల్‌డోజర్లు, ఇకపై రాష్ట్రవ్యాప్తంగా కూల్చివేతలులెబనాన్‌లో పేజర్ పేలుళ్ల కలవరం, ఇజ్రాయేల్‌పై ఆరోపణలుభారత్, బంగ్లాదేశ్‌ల మధ్య తొలి టెస్టు నేడే‘కూలీ’లో నాగార్జున సైమన్ లుక్ లీక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Samineni Udaya Bhanu: వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Harish Rao: 'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
Kashmir Elections : కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
Naga Babu-Jani Master: నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
Kadambari Jethwani 'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
Balineni Srinivasa Reddy: జగన్‌ తీరు నచ్చలేదు- పార్టీ నుంచి బయటకు పంపే కుట్రలు చేశారు: బాలినేని కీలక వ్యాఖ్యలు
జగన్‌ తీరు నచ్చలేదు- పార్టీ నుంచి బయటకు పంపే కుట్రలు చేశారు: బాలినేని కీలక వ్యాఖ్యలు
Embed widget