అన్వేషించండి

TSGENCO: తెలంగాణ జెన్‌కో‌లో 60 కెమిస్ట్ పోస్టులు, ఎంపికైతే నెలకు రూ.1.31 లక్ష వరకు జీతం

తెలంగాణ రాష్ట్ర పవర్ జెనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్‌(TSGENCO)‌లో కెమిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా 60 పోస్టులను భర్తీ చేయనున్నారు.

తెలంగాణ రాష్ట్ర పవర్ జెనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్‌(TSGENCO)‌లో కెమిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా 60 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ప్రథమ శ్రేణిలో ఎంఎస్సీ (కెమిస్ట్రీ/ ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్) అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి అక్టోబరు 7న ఉదయం 11 గంటల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. సరైన అర్హతలున్నవారు అక్టోబరు 29న మధ్యాహ్నం 1 గంటలోపు ఫీజు చెల్లించి, రాత్రి 12 గంటల్లోపు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. 

అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.400, పరీక్ష ఫీజుగా రూ.300 చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు వర్తిస్తుంది. రాతపరీక్ష ఆధారంగా ఎంపికలు చేపడతారు. హైదరాబాద్, సికింద్రాబాద్ (జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ) పరిధిలో డిసెంబర్ 3న రాత పరీక్ష నిర్వహించనున్నారు. ఎంపికైవారికి నెలకు రూ.65,600 - రూ.1,31,220 వరకు జీతభత్యాలు అందుతాయి.

ఉద్యోగాలకు ఎంపికైనవారు సంస్థలో విధిగా 5 సంవత్సరాలు పనిచేయనున్నట్లు సర్వీస్ బాండ్ సమర్పించాల్సి ఉంటుంది. ఇందులో రెండేళ్ల ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. ఈ ప్రొబేషన్ పీరియడ్‌లో ఏడాదిపాటు శిక్షణ ఉంటుంది. రెండళ్లే ప్రొబేషన్ పీరియడ్‌లో ఉద్యోగం వదిలి వెళితే, నష్టపరిహారం కింద అభ్యర్థుల నుంచి రూ.50,000 వసూలు చేస్తారు. ఇక ప్రొబేషన్ పీరియడ్ తర్వాత ఉద్యోగం వదిలి వెళితే.. రూ.1లక్ష రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.

వివరాలు..

* కెమిస్ట్ పోస్టులు

ఖాళీల సంఖ్య: 60 (లిమిటెడ్-03, జనరల్-57)

అర్హత: ప్రథమ శ్రేణిలో ఎంఎస్సీ (కెమిస్ట్రీ/ ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్) ఉత్తీర్ణత ఉండాలి.

వయోపరిమితి: 01.07.2023 నాటికి 18-44 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. బీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలపాటు వయోసడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు, పరీక్ష ఫీజు: అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.400, పరీక్ష ఫీజుగా రూ.300 చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు వర్తిస్తుంది. అయితే ఇతర రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులకు మినహాయింపు వర్తించదు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా ఎంపిక.

పరీక్ష విధానం: మొత్తం 100 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో రెండు సెక్షన్ల నుంచి 100 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు ఉంటుంది. 'సెక్షన్-ఎ'లో అభ్యర్థుల సబ్జెక్టు (కోర్ టెక్నికల్) నుంచి 80 ప్రశ్నలు-80 మార్కులు, 'సెక్షన్-బి'లో ఇంగ్లిష్, జనరల్ అవేర్‌నెస్, అనలిటికల్ & న్యూమరికల్ ఎబిలిటీ, తెలంగాణ హిస్టరీ, కల్చర్, తెలంగాణ ఆవిర్భావం, అభివృద్ధి, కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి 20 ప్రశ్నలు-20 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 2 గంటలు (120 నిమిషాలు). 

పేస్కేలు: రూ.65,600 - రూ.1,31,220 వరకు ఇస్తారు.

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు, దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 07.10.2023. (11.00 AM)

➥ ఆన్‌లైన్ దరఖాస్తు, పరీక్ష ఫీజు చెల్లించడానికి చివరితేది: 29.10.2023. (01.00 PM)

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 29.10.2023. (11.59 PM).

➥ దరఖాస్తుల సవరణకు అవకాశం: 01.11.2023 (10:00 AM ) - 02.11.2023 (5:00 PM)

➥ రాతపరీక్ష హాల్‌టికెట్లు: పరీక్షకు వారం ముందు నుంచి.

➥ రాతపరీక్ష తేది: 03.12.2023.

Notification

Website

                 

ALSO READ:

తెలంగాణ జెన్‌కో‌లో 339 అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులు, ఎంపికైతే జీతమెంతో తెలుసా?
తెలంగాణ రాష్ట్ర పవర్ జెనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్‌(TSGENCO)‌లో అసిస్టెంట్ ఇంజినీర్(ఏఈ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా 339 ఏఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో లిమిటెడ్ రిక్రూట్‌మెంట్ కింద 94 పోస్టులు, డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కింద 245 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.  ఈ పోస్టుల భర్తీకి అక్టోబరు 7న ఉదయం 11 గంటల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. సరైన అర్హతలున్నవారు అక్టోబరు 29న మధ్యాహ్నం 1 గంటలోపు ఫీజు చెల్లించి, రాత్రి 12 గంటల్లోపు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో 232 ప్రొబేషనరీ ఇంజినీర్, ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులు
భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని 'భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్', దేశవ్యాప్తంగా ఉన్న యూనిట్లు/కార్యాలయాల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 232 ప్రొబేషనరీ ఇంజినీర్, ప్రొబేషనరీ ఆఫీసర్, ప్రొబేషనరీ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులను భర్తీచేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైనవారు బెంగళూరు, ఘజియాబాద్, పుణె, హైదరాబాద్, చెన్నై, మచిలీపట్నం, పంచకుల, కోట్‌ద్వారా, నవీ ముంబయిలో విధిగా పనిచేయాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

టాప్ హెడ్ లైన్స్

AP DSC Notification 2026: అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
SBI Clerk Notification 2026:ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
TGPSC FBO Notification 2026: తెలంగాణ అటవీ శాఖలో ఉద్యోగాలు! 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ పోస్టులకు త్వరలో ప్రకటన!
తెలంగాణ అటవీ శాఖలో ఉద్యోగాలు! 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ పోస్టులకు త్వరలో ప్రకటన!
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
Kalki 2: ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
Murali Mohan: హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
Khudiram Bose:18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
Embed widget