Panchayat Secretary Jobs: తెలంగాణలో 172 జూనియర్ పంచాయతీ సెక్రటరీ పోస్టుల భర్తీ.. ఏ జిల్లాల్లో ఎన్ని పోస్టులంటే?
TS Junior Panchayat Secretary Recruitment: తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ 172 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా స్పోర్ట్స్ కోటాలో జూనియర్ పంచాయతీ సెక్రటరీ పోస్టులను భర్తీ చేయనుంది.
తెలంగాణలో ఉద్యోగాల భర్తీ షురూ అయింది. రాష్ట్రంలోని పంచాయతీరాజ్ శాఖలో 172 పోస్టుల భర్తీకి ప్రభుత్వం జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. స్పోర్ట్స్ కోటాలో జూనియర్ పంచాయతీ సెక్రటరీ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. జూనియర్ పంచాయతీ సెక్రటరీ పోస్టులకు నేటి (సెప్టెంబర్ 18) నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. దరఖాస్తు స్వీకరణ గడువు అక్టోబర్ 10తో ముగియనుంది. విద్యార్హతతతో పాటుగా హాకీ, కబడ్డీ, బాస్కెట్ బాల్, వాలీబాల్, టెన్నిస్, హ్యాండ్‌బాల్, టేబుల్ టెన్నిస్ లాంటి క్రీడల్లో రాణించి ఉండాలి. రాతపరీక్ష ద్వారా అర్హులను ఎంపిక చేస్తారు. జూనియర్ పంచాయతీ సెక్రటరీ పోస్టులకు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
జిల్లాల వారీగా ఖాళీల వివరాలు..
నల్గొండ - 13; మహబూబ్ నగర్, నారాయణపేట - 10, ఖమ్మం - 9, వికారాబాద్ 8, నిజామాబాద్ 8, సంగారెడ్డి 8, కామారెడ్డి 8, భద్రాద్రి కొత్తగూడెం- 7, మహబూబాబాద్- 7, రంగారెడ్డి 7, జయశంకర్ భూపాలపల్లి 6, ఆదిలాబాద్-6, సూర్యాపేట 6, నాగర్‌కర్నూలు 6, నిర్మల్ 6, మెదక్ 6, యాదాద్రి భువనగిరి 6, సిద్దిపేట 6, వరంగల్ రూరల్ 5, జగిత్యాల-5, మంచిర్యాల 4, జనగామ 4, కరీంనగర్ 4, గద్వాల 3, ఆసిఫాబాద్ 4, సిరిసిల్ల 3, పెద్దపల్లి 3, వనపర్తి 3, వరంగల్ అర్బన్ 1.
విద్యార్హత, వయోపరిమితి..
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దీంతో పాటుగా స్పోర్ట్స్ కోటా గైడ్‌లైన్స్ కూడా పూర్తి చేయాలి. వయోపరిమితి విషయానికి వస్తే.. అభ్యర్థులు వయసు 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ల ఆధారంగా ఎస్టీ, ఎస్సీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపులు ఉన్నాయి. దరఖాస్తు ఫీజు కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ నాన్ క్రిమిలేయర్ కేటగిరీ అభ్యర్థులు రూ.400.. జనరల్, బీసీ క్రీమీలేయర్ అభ్యర్థులు రూ.800 చెల్లించాల్సి ఉంటుంది.
పరీక్ష విధానం..
జూనియర్ పంచాయతీ సెక్రటరీ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు రాత పరీక్ష రాయాలి. ఈ పరీక్షలో మొత్తం 100 మార్కులకు 1 చొప్పున రెండు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్‌లో 35 మార్కులు సాధిస్తే క్వాలిఫై అవుతారు. హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్, నల్గొండ, వరంగల్, మహబూబ్‌నగర్ నగరాల్లో పరీక్షా కేంద్రాలను కేటాయించారు.
Also Read: Job Alert: సాఫ్ట్వేర్ జాబ్స్ కోసం చూస్తున్నారా.. మీకో గుడ్‌న్యూస్.. ఐటీలో భారీగా ఖాళీలు