X

Job Alert: సాఫ్ట్‌వేర్ జాబ్స్ కోసం చూస్తున్నారా.. మీకో గుడ్‌న్యూస్.. ఐటీలో భారీగా ఖాళీలు

కరోనావైరస్ ప్రభావం నుంచి ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్న టెక్ కంపెనీలు పెద్ద సంఖ్యలు ఉద్యోగులను నియమించుకుంటున్నాయి. ఇప్పటికే ఉన్న ఉద్యోగులకు భారీ ఎత్తున్న హైక్ ఇస్తుంది.

FOLLOW US: 

2020లో కరోనావైరస్ కారణంగా ఎన్నో సెక్టార్లకు దెబ్బ పడింది. ఆ తర్వాత ఎన్నో సెక్టార్లలో కంపెనీలు పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తీసేశాయి కూడా. ప్రపంచం మొత్తం ఒకటిన్నర సంవత్సరం నుంచి కరోనావైరస్‌తో సహజీవనం చేస్తూనే ఉంది. ఈ సమయంలో కొన్ని సెక్టార్లకు మంచి రోజుకు వచ్చినట్లు కనిపిస్తుంది. త్వరలో థర్డ్ వేవ్ ప్రారంభం అవుతుందని ఎంతోమంది నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ప్రస్తుతం దేశంలో ఎన్నో కంపెనీలు జాగ్రత్తల నుంచి బయటకు వచ్చి యువతను పెద్దఎత్తున ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నాయి. దీంతోపాటు తమ ఉద్యోగులకు భారీ ఎత్తున్న ఇంక్రిమెంట్లు కూడా వేస్తున్నాయి.

ఇన్‌డీప్ రిపోర్ట్ కథనం ప్రకారం.. భారతదేశ జాబ్ మార్కెట్ కరోనావైరస్ మార్కెట్ కారణంగా పెద్ద ఎత్తున దెబ్బ తింది. ఇప్పుడు ఐటీ ప్రొఫెషనల్స్‌కు డిమాండ్ ఏకంగా 400 శాతం పెరిగినట్లు వార్తలు వస్తున్నాయి. 2020లో ఎన్నో కార్పొరేట్ కంపెనీలు అవసరం ఉన్నప్పటికీ కొత్త ఉద్యోగులను తీసుకోకుండా వెయిటింగ్ గేమ్ ఆడాయి. గతేడాది జూన్‌లో కరోనావైరస్ పీక్‌లో ఉన్నప్పుడు హైరింగ్ 50 శాతం వరకు తగ్గిపోయింది. ఇప్పుడు టెక్ జాబ్ వేకెన్సీలు, రిక్వైర్‌మెంట్లు బాగా పెరిగాయి. యాప్ డెవలపర్, లీడ్ కన్సల్టెంట్, సేల్స్ ఫోర్స్ డెవలపర్, సైట్ రిలయబిలిటీ ఇంజినీర్ వంటి ఉద్యోగాలకు డిమాండ్ 150 నుంచి 300 శాతం వరకు పెరిగింది.

ఇక్కడ పాజిటివ్ న్యూస్ ఏంటంటే కేవలం హైరింగ్ మాత్రమే కాకుండా.. కొత్తగా తీసుకునేవారికి సాఫ్ట్ వేర్ కంపెనీలు ఎక్కువ ప్యాకేజీలు కూడా ఇవ్వనున్నాయి. కంపెనీలు ఎక్కువ ప్యాకేజీలు ఇస్తున్నాయి కాబట్టి, ఉద్యోగాలను కోరుకునేవారు కూడా ఎక్కువ జీతాలను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఫుల్ స్టాక్ ఇంజినీర్లకు కంపెనీ 70 శాతం నుంచి 120 శాతం హైక్‌లు ఇస్తున్నట్లు తెలుస్తోంది. గత సంవత్సరంతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. గత సంవత్సరం హైక్ కేవలం 20 నుంచి 30 శాతం మధ్య మాత్రమే ఉండేది.

కెరీర్‌లో గ్యాప్ తీసుకుని ఇప్పుడు మళ్లీ ఉద్యోగ అవకాశాల కోసం వెతుకుతున్న మహిళల కోసం టాటా కన్సెల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) అతిపెద్ద రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ను నిర్వహిస్తుంది. ‘టాలెంట్, సామర్థ్యం ఎప్పటికీ అలాగే ఉంటాయి. అనుభవం ఉన్న మహిళా ప్రొఫెషనల్స్‌కు తిరిగి ప్రారంభించే అవకాశం ఇవ్వడం ఇన్‌స్పైర్ చేయడంతో పాటు, అంచనాలను అందుకోవడానికి, తమను తామకు సవాల్ చేసుకోవడానికి ఒక అవకాశం’ అని టీసీఎల్ ఈ సందర్భంగా పేర్కొంది. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో వంటి పెద్ద టెక్ కంపెనీలు ఇప్పుడు దేశవ్యాప్తంగా కొత్త ఉద్యోగులను తీసుకుంటున్నాయి.

2022 సంవత్సరంలో ఐటీ సెక్టార్లోని అన్ని కంపెనీలు చెల్లించే జీతాల మొత్తం 1.6 బిలియన్ డాలర్ల నుంచి 1.7 బిలియన్ డాలర్ల మధ్య ఉండనుంది. మంచి నైపుణ్యం ఉండి, కొత్త ఉద్యోగం వెతుకుతూ, వేతన పెంపు కోరుకునే సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు ఇది గోల్డెన్ టైం అని చెప్పవచ్చు. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి ఐటీ ఉద్యోగులు ఎక్కువ ఉండే నగరాల్లో రియల్ ఎస్టేట్ బూమ్ కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

Also Read: Affordable iPhone: ఈ చవకైన ఐఫోన్ ఇంక మనదేశంలో లేనట్లే.. మరో రెండు పాత ఐఫోన్లనూ నిలిపివేసిన యాపిల్!

Also Read: ప్రపంచంలో అత్యంత సురక్షితమైన ఆండ్రాయిడ్ ఫోన్ ఇదే.. ధర ఎంతంటే?

Also Read: రియల్‌మీ కొత్త ఫోన్ వచ్చేసింది.. రూ.11 వేలలోపే 50 మెగాపిక్సెల్ కెమెరా!

Tags: TCS Jobs IT Sector Jobs TCS Hiring Infosys Hiring Salary Hike Hiring Alert Massive Jobs Infosys Jobs

సంబంధిత కథనాలు

Redmi Note 11S: రెడ్‌మీ నోట్ 11ఎస్ ధర లీక్.. 108 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్... అంత తక్కువ ధరకా?

Redmi Note 11S: రెడ్‌మీ నోట్ 11ఎస్ ధర లీక్.. 108 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్... అంత తక్కువ ధరకా?

Redmi Smart Band Pro: రెడ్‌మీ కొత్త స్మార్ట్ బ్యాండ్ వచ్చేస్తుంది.. ధర రూ.రెండు వేలలోపే.. లాంచ్ ఎప్పుడంటే?

Redmi Smart Band Pro: రెడ్‌మీ కొత్త స్మార్ట్ బ్యాండ్ వచ్చేస్తుంది.. ధర రూ.రెండు వేలలోపే.. లాంచ్ ఎప్పుడంటే?

Vivo Y75 5G: 12 జీబీ ర్యామ్, ఆండ్రాయిడ్ 12, 5జీతో వివో కొత్త ఫోన్.. ధర రూ.22 వేలలోపే!

Vivo Y75 5G: 12 జీబీ ర్యామ్, ఆండ్రాయిడ్ 12, 5జీతో వివో కొత్త ఫోన్.. ధర రూ.22 వేలలోపే!

Google Chromecast: రూ.3 వేలలోపే గూగుల్ క్రోమ్‌కాస్ట్.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

Google Chromecast: రూ.3 వేలలోపే గూగుల్ క్రోమ్‌కాస్ట్.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

Sony Neckband Speakers: ఈ స్పీకర్లను మెడలో వేసుకోవచ్చు.. అదిరిపోయే ఫీచర్లు!

Sony Neckband Speakers: ఈ స్పీకర్లను మెడలో వేసుకోవచ్చు.. అదిరిపోయే ఫీచర్లు!

టాప్ స్టోరీస్

Covid Vaccination: కరోనా వ్యాక్సినేషన్‌పై సర్కార్ కీలక ప్రకటన.. ఇక వారు కూడా అర్హులే

Covid Vaccination: కరోనా వ్యాక్సినేషన్‌పై సర్కార్ కీలక ప్రకటన.. ఇక వారు కూడా అర్హులే

Naga Chaitanya in Moscow: మాస్కోలో నాగచైతన్య... ఆయన అక్కడ ఏం చేస్తున్నారంటే?

Naga Chaitanya in Moscow: మాస్కోలో నాగచైతన్య... ఆయన అక్కడ ఏం చేస్తున్నారంటే?

Omicron Sub-Variant BA.2: బీ అలర్ట్.. దేశంలో ఆ వేరియంట్ వ్యాప్తే ఎక్కువగా ఉందట!

Omicron Sub-Variant BA.2: బీ అలర్ట్.. దేశంలో ఆ వేరియంట్ వ్యాప్తే ఎక్కువగా ఉందట!

Snake Vs Hen: గుడ్ల కోసం వచ్చిన పాముతో కోడి ఫైటింగ్.. చివరికి ఏమైందో చూడండి

Snake Vs Hen: గుడ్ల కోసం వచ్చిన పాముతో కోడి ఫైటింగ్.. చివరికి ఏమైందో చూడండి