TNNLU: తమిళనాడు నేషనల్ లా వర్సిటీలో టీచింగ్ పోస్టులు, ఈ అర్హతలుండాలి
TNNLU: తిరుచిరాపల్లిలోని తమిళనాడు నేషనల్ లా యూనివర్సిటీ వివిధ సబ్జెక్టుల్లో టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
Tamil Nadu National Law University Jobs: తిరుచిరాపల్లిలోని తమిళనాడు నేషనల్ లా యూనివర్సిటీ (TNNLU) వివిధ సబ్జెక్టుల్లో టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా ప్రొఫెసర్ (Professor), అసోసియేట్ ప్రొఫెసర్ (Associate Professor), అసిస్టెంట్ ప్రొఫెసర్ (Assistant Professor) పోస్టులను భర్తీచేయనున్నారు. సంబంధిత సబ్జెక్టులో పీజీ డిగ్రీతోపాటు పీహెచ్‌డీ/నెట్/స్లెట్/సెట్ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తుకు అర్హులు. సరైన అర్హతలున్నవారు ఆఫ్‌లైన్ విధానంలో తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.1500, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.750 చెల్లిస్తే సరిపోతుంది. అభ్యర్థి సంతకంలేని అసంపూర్ణ దరఖాస్తులు, నిర్ణీత ఫీజు చెల్లించని దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోరు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ నవంబరు 19న ప్రారంభంకాగా.. డిసెంబరు 18 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేయనున్నారు.
పోస్టుల వివరాలు..
* టీచింగ్ ఫ్యాకల్టీలు
ఖాళీల సంఖ్య: 14
➥ ప్రొఫెసర్: 02 పోస్టులు
అర్హత: సంబంధిత విభాగంలో పీజీ, పీహెచ్‌డీ/నెట్/స్లెట్/సెట్ ఉత్తీర్ణులై ఉండాలి. స్లెట్/సెట్ తమిళనాడు నుంచి చేసి ఉండాలి.
వయోపరిమితి: 58 సంవత్సరాలలోపు ఉండాలి.
జీతం: ప్రొఫెసర్ పోస్టులకు రూ.1,44,200 ఇస్తారు.
➥ అసోసియేట్ ప్రొఫెసర్: 04 పోస్టులు
అర్హత: సంబంధిత విభాగంలో పీజీ, పీహెచ్‌డీ/నెట్/స్లెట్/సెట్ ఉత్తీర్ణులై ఉండాలి. స్లెట్/సెట్ తమిళనాడు నుంచి చేసి ఉండాలి.
వయోపరిమితి: 58 సంవత్సరాలలోపు ఉండాలి.
జీతం: అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు రూ.1,31,400 ఇస్తారు.
➥ అసిస్టెంట్ ప్రొఫెసర్: 09 పోస్టులు
అర్హత: సంబంధిత విభాగంలో పీజీ, పీహెచ్‌డీ/నెట్/స్లెట్/సెట్ ఉత్తీర్ణులై ఉండాలి. స్లెట్/సెట్ తమిళనాడు నుంచి చేసి ఉండాలి.
వయోపరిమితి: 58 సంవత్సరాలలోపు ఉండాలి.
జీతం: అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు రూ.57,700 ఇస్తారు.
సబ్జెక్టులు: లా, ఎకనామిక్స్, హిస్టరీ, ఇంగ్లిష్.
దరఖాస్తు ఫీజు: రూ.1500, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.750 చెల్లించాలి. అభ్యర్థలు 'Registrar, Tamil Nadu National Law University, Tiruchirappalli' పేరిట నిర్ణీత మొత్తంతో డిడి తీయాలి.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా. అభ్యర్థులు ఆన్‌లైన్ (గూగుల్ ఫామ్) ద్వారా కూడా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
The Registrar,
Tamil Nadu National Law University,
Dindigul Main Road, Navalurkuttapattu,
Tiruchirappalli – 620027.
ముఖ్యమైన తేదీలు..
➥ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 19.12.2023.
➥ ఆఫ్‌లైన్ దరఖాస్తు చివరితేది: 18.12.2023.
Application Form (Google forms)
ALSO READ:
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఉన్నతహోదా ఉద్యోగాలకు 'ఏఎఫ్‌క్యాట్' - నోటిఫికేషన్ వెల్లడి
భారత వైమానిక దళంలో ఉన్నత హోదా ఉద్యోగాల భర్తీకి నిర్వహించే ఏఎఫ్‌క్యాట్ 01/2024 నోటిఫికేషన్ విడుదలైంది. వైమానిక దళంలో టెక్నికల్, నాన్ టెక్నికల్ విభాగాల ఖాళీలను ఈ పరీక్ష ద్వారా భర్తీ చేస్తారు. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ, ఫిజికల్ పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు. ఎంపికైన అభ్యర్థులను వైమానిక దళంలో కమిషన్డ్ ఆఫీసర్లుగా నియమిస్తారు. ఈ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ డిసెంబరు 1న ప్రారంభంకానుంది. అభ్యర్థులు డిసెంబరు 30 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..