అన్వేషించండి

AFCAT Notification 2024: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఉన్నతహోదా ఉద్యోగాలకు 'ఏఎఫ్‌క్యాట్' - నోటిఫికేషన్ వెల్లడి!

AFCAT Notification: భార‌త వైమానిక ద‌ళంలో ఉన్నత హోదా ఉద్యోగాల భ‌ర్తీకి నిర్వహించే ఏఎఫ్‌క్యాట్ 01/2024 (AFCAT 01/2024) నోటిఫికేషన్ విడుద‌లైంది.

Indian Air Force AFCAT Notification: భార‌త వైమానిక ద‌ళంలో ఉన్నత హోదా ఉద్యోగాల భ‌ర్తీకి నిర్వహించే ఏఎఫ్‌క్యాట్ 01/2024 (AFCAT 01/2024) నోటిఫికేషన్ విడుద‌లైంది. వైమానిక దళంలో టెక్నిక‌ల్‌ (Technical), నాన్ టెక్నిక‌ల్‌ (Non Technical) విభాగాల ఖాళీలను ఈ పరీక్ష ద్వారా భర్తీ చేస్తారు. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ, ఫిజికల్ పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు. ఎంపికైన అభ్యర్థులను వైమానిక దళంలో కమిషన్డ్ ఆఫీసర్లుగా నియమిస్తారు. ఈ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ డిసెంబరు 1న ప్రారంభంకానుంది. అభ్యర్థులు డిసెంబరు 30 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.

వివరాలు..

* ఏఎఫ్‌క్యాట్ -  AFCAT -  01/2024 

ఖాళీల సంఖ్య: 317 పోస్టులు

1) ఫ్లయింగ్ బ్రాంచ్: 38 (మెన్-28, ఉమెన్-10)

2) గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్): 165 (మెన్-149, ఉమెన్-16)

విభాగం: ఏరోనాటికల్ ఇంజినీరింగ్.

3) గ్రౌండ్ డ్యూటీ (నాన్-టెక్నికల్): 114 (మెన్-98, ఉమెన్-16)

విభాగం: వెపన్ సిస్టమ్, అడ్మినిస్ట్రేషన్, ఎల్‌జీఎస్‌, అకౌంట్స్, ఎడ్యుకేషన్, మెటియోరాలజీ. 

4) ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ

విభాగం: ఫ్లయింగ్ బ్రాంచ్.

అర్హత‌: 
🔰 ఫ్లయింగ్ బ్రాంచ్ పోస్టులకు 60 శాతం మార్కులతో డిగ్రీ ఉండాలి. ఇంటర్ స్థాయిలో ఫిజిక్స్, మ్యాథ్స్‌లో 50 శాతం మార్కులు కచ్చితంగా ఉండాలి. (లేదా) 60 శాతం మార్కులతో బీఈ/ బీటెక్ అర్హత ఉండాలి. నిర్దేశిత శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.

🔰 గ్రౌండ్ డ్యూటీ టెక్నిక‌ల్ పోస్టుల‌కు ఏరోనాటిక‌ల్ ఇంజినీరింగ్‌(ఎల‌క్ట్రానిక్స్‌/మెకానిక‌ల్) విభాగాల్లో లేదా అనుంబంధ బ్రాంచీల్లో బీటెక్‌/బీఈ పూర్తి చేసి ఉండాలి. ఇంట‌ర్‌‌లో ఫిజిక్స్, మ్యాథ్స్ ఉండాలి. నిర్దేశిత శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.

🔰 గ్రౌండ్ డ్యూటీ (నాన్ టెక్నిక‌ల్) పోస్టుల్లో వివిధ విభాగాలను అనుసరించి ఇంటర్‌లో మ్యాథ్స్‌, ఫిజిక్స్ స‌బ్జెక్టుల్లో ఉత్తీర్ణత, ఏదైనా డిగ్రీ లేదా బీఈ/బీటెక్ లేదా బీకాం/ బీఎస్సీ/ బీబీఏ/ సీఏ/ సీఎంఏ/ సీఎస్/ సీఎఫ్ఏ, పీజీ ఉత్తీర్ణత ఉండాలి. నిర్దేశిత శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.

🔰 ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీకి కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ పరీక్ష ద్వారా 10 శాతం సీట్లను, ఏఎఫ్‌క్యాట్-2023 పరీక్ష ద్వారా 10 శాతం సీట్లను కేటయిస్తారు. 

వయోపరిమితి (01.01.2025 నాటికి):

🔰  ఫ్లయింగ్ బ్రాంచ్: 20 - 24 సంవత్సరాల మధ్య ఉండాలి. అభ్యర్థులు 02.01.2001 - 01.01.2005 మధ్య జన్మించి ఉండాలి. డీజీసీఏ ద్వారా కమర్షియల్ పైలట్ లైసెన్స్ పొందినవారికి 2 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది. అంటే వయసు 26 సంవత్సరాలలోపు ఉండాలి. 02.01.1999 - 01.01.2005 మధ్య జన్మించి ఉండాలి. 

🔰 గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్/ నాన్ టెక్నికల్): 20 - 26 సంవత్సరాల మధ్య ఉండాలి. 02.01.1999 - 01.01.2005 మధ్య జన్మించి ఉండాలి. 

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు ఫీజు: రూ.550. ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ అభ్యర్థులకు ఫీజు ఉండదు. డెబిట్/ క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, చలానా రూపంలో ఫీజు చెల్లించవచ్చు.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ, ఫిజికల్ పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.

పరీక్ష విధానం: మొత్తం 300 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. 100 ప్రశ్నలు ఉంటాయి. పరీక్షలో జనరల్ అవేర్‌నెస్, వెర్బల్ ఎబిలిటీ ఇన్ ఇంగ్లిష్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ & మిలిటరీ ఆప్టిట్యూడ్ టెస్ట్ నుంచి ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 2 గంటలు.

పేస్కేలు: శిక్షణ సమయంలో నెలకు రూ.56,100 స్టైపెండ్ చెల్లిస్తారు. శిక్షణ తర్వాత ఫ్లయింగ్ ఆఫీసర్ ర్యాంకుతో రూ.1,77,500 చెల్లిస్తారు. డీఏ, హెచ్‌ఆర్‌ఏ ఇతర అలవెన్సులు ఉంటాయి. మిలిటరీ సర్వీస్ పేలో భాగంగా ప్రతి నెలా రూ.15,500 చెల్లిస్తారు. 

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, వరంగల్, గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, రాజమండ్రి.

ముఖ్యమైన తేదీలు..

⏩ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.12.2023.

⏩ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 30.12.2023.

Website

దరఖాస్తు విధానం గురించి తెలుసుకోవడానికి క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pahalgam Terror Attack: బోర్డర్‌లో ఉద్రిక్తత- మీడియాకు కేంద్రం కీలక సూచనలు
బోర్డర్‌లో ఉద్రిక్తత- మీడియాకు కేంద్రం కీలక సూచనలు
AP Liquor Scam Case: లిక్కర్ స్కాం కేసులో సజ్జల శ్రీధర్ రెడ్డికి మే 6 వరకు రిమాండ్ విధించిన ఏసీబీ కోర్టు
లిక్కర్ స్కాం కేసులో సజ్జల శ్రీధర్ రెడ్డికి మే 6 వరకు రిమాండ్ విధించిన ఏసీబీ కోర్టు
Inspiring Young Man: గొర్రెల కాపరి ఐపీఎస్ అవుతున్నాడు - ఈ కుర్రాడి సక్సెస్ స్టోరీ కిక్ ఇస్తుంది !
గొర్రెల కాపరి ఐపీఎస్ అవుతున్నాడు - ఈ కుర్రాడి సక్సెస్ స్టోరీ కిక్ ఇస్తుంది !
RSS Chief Mohan Bhagwat: బలవంతుడు అవసరమైనప్పుడు బలం చూపించాలి; పహల్గాం ఉగ్రవాద దాడిపై మోహన్ భగవత్ కీలక ప్రకటన
బలవంతుడు అవసరమైనప్పుడు బలం చూపించాలి; పహల్గాం ఉగ్రవాద దాడిపై మోహన్ భగవత్ కీలక ప్రకటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Thala Ajith in CSK vs SRH IPL 2025 | నిన్న చెన్నై అభిమానులకు ఒకే టికెట్ పై రెండు షోలుCSK Comparison With RCB Wins | IPL 2025 లో గతేడాది RCB మ్యాజిక్ రిపీట్ చేయలేకపోయిన CSKKavya Maraan Expression vs CSK IPL 2025 | హావభావాలతో మ్యాచ్ టెన్షన్ మొత్తం చూపించిన కావ్యామారన్CSK Failures in IPL 2025 | MS Dhoni కెప్టెన్ అయినా రాతను మార్చుకోలేకపోయిన CSK

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pahalgam Terror Attack: బోర్డర్‌లో ఉద్రిక్తత- మీడియాకు కేంద్రం కీలక సూచనలు
బోర్డర్‌లో ఉద్రిక్తత- మీడియాకు కేంద్రం కీలక సూచనలు
AP Liquor Scam Case: లిక్కర్ స్కాం కేసులో సజ్జల శ్రీధర్ రెడ్డికి మే 6 వరకు రిమాండ్ విధించిన ఏసీబీ కోర్టు
లిక్కర్ స్కాం కేసులో సజ్జల శ్రీధర్ రెడ్డికి మే 6 వరకు రిమాండ్ విధించిన ఏసీబీ కోర్టు
Inspiring Young Man: గొర్రెల కాపరి ఐపీఎస్ అవుతున్నాడు - ఈ కుర్రాడి సక్సెస్ స్టోరీ కిక్ ఇస్తుంది !
గొర్రెల కాపరి ఐపీఎస్ అవుతున్నాడు - ఈ కుర్రాడి సక్సెస్ స్టోరీ కిక్ ఇస్తుంది !
RSS Chief Mohan Bhagwat: బలవంతుడు అవసరమైనప్పుడు బలం చూపించాలి; పహల్గాం ఉగ్రవాద దాడిపై మోహన్ భగవత్ కీలక ప్రకటన
బలవంతుడు అవసరమైనప్పుడు బలం చూపించాలి; పహల్గాం ఉగ్రవాద దాడిపై మోహన్ భగవత్ కీలక ప్రకటన
Pahalgam Terror Attack: జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదుల కోసం సైన్యం వేట- అనుమానితుల ఇళ్లు కూల్చివేత  
జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదుల కోసం సైన్యం వేట- అనుమానితుల ఇళ్లు కూల్చివేత  
Ram Charan: రామ్ చరణ్ మైనపు విగ్రహం లాంచ్ ఎప్పుడంటే? - లండన్ టు సింగపూర్..
రామ్ చరణ్ మైనపు విగ్రహం లాంచ్ ఎప్పుడంటే? - లండన్ టు సింగపూర్..
IPL 2025 SRH VS CSK Update: చెన్నై దుస్థితికి కార‌ణాలివే..! ఆ త‌ప్పులను స‌రిదిద్దు కోలేదు.. ప్లే ఆఫ్స్ రేసు నుంచి సీఎస్కే దాదాపుగా ఔట్!!
చెన్నై దుస్థితికి కార‌ణాలివే..! ఆ త‌ప్పులను స‌రిదిద్దు కోలేదు.. ప్లే ఆఫ్స్ రేసు నుంచి సీఎస్కే దాదాపుగా ఔట్!!
Missing Woman Safe: అలిగి ఇంటి నుంచి వెళ్లిపోయిన వివాహిత, 2 రోజులు టెన్షన్ టెన్షన్.. పోలీసుల ఎంట్రీతో కథ సుఖాంతం
అలిగి ఇంటి నుంచి వెళ్లిపోయిన వివాహిత, 2 రోజులు టెన్షన్ టెన్షన్.. పోలీసుల ఎంట్రీతో కథ సుఖాంతం
Embed widget