SSC Exam Calender: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షల క్యాలెండర్ విడుదల, ఏ పరీక్ష ఎప్పుడంటే?
SSC Exam Dates: ఈ ఏడాది జూన్ నుంచి 2025 ఫిబ్రవరి వరకు నిర్వహించే పరీక్షల క్యాలండర్‌ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వెల్లడించింది. ఉద్యోగార్థులు ఆయా పరీక్షల నోటిఫికేషన్, దరఖాస్తుల వివరాలు తెలుసుకోవచ్చు.
SSC Exam 2024-25 Calendar: కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల, పలు విభాగాల్లో ఉద్యోగ ఖాళీల భర్తీకి సంబంధించిన పరీక్షల క్యాలెండర్‌ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్. 2024-25 సంవత్సరానికి నిర్వహించే ఉద్యోగ నియామక పరీక్షల తేదీలతో ప్రత్యేక కాలపట్టికలను కమిషన్ విడుదల చేసింది. ప్రకటించిన క్యాలెండర్ ప్రకారం.. 2024 జూన్ నుంచి 2025 ఫిబ్రవరి వరకు నిర్వహించే పరీక్షల తేదీలను వెల్లడించింది. ఇందులో జూనియర్ ఇంజినీర్ (JE), సెలక్షన్ పోస్టులు (Selection Posts), ఢిల్లీ పోలీస్ సబ్‌ఇన్‌స్పెక్టర్ (DP SI), సీజీఎల్ (CGL), ఎంటీఎస్ (MTS), హవల్దార్, గ్రేడ్ సి/డి స్టెనోగ్రాఫర్ (Stengrapher), కానిస్టేబుల్ (Constable GD), జూనియర్ హిందీ ట్రాన్స్‌టేటర్ (JHT) తదితర ఉద్యోగ నియామక పరీక్షల తేదీలు ఉన్నాయి. ఆయా పోస్టులకు నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ, కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించే తేదీలను క్యాలెండర్‌లో పొందుపరిచింది. అప్పటి పరిస్థితులను బట్టి ఈ తేదీల్లో మార్పులు ఉండే అవకాశం ఉంది.
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసిన క్యాలెండర్ ప్రకారం.. జూన్ 24న కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ (CGL) నోటిఫికేషన్ వెలువడనుంది. సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో సీజీఎల్ పరీక్షలు నిర్వహించనున్నారు. అదేవిధంగా జూన్ 27న మల్టీటాస్కింగ్ స్టాఫ్(MTS), ఆగస్టు 27న కానిస్టేబుల్ (జీడీ) నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. అక్టోబర్ లేదా నవంబర్‌లో ఎంటీఎస్ పరీక్షలు, వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో కానిస్టేబుల్ (జీడీ) రాత పరీక్షలు నిర్వహించనున్నట్లు క్యాలెండర్‌లో పేర్కొన్నారు.
ALSO READ: నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్‌లో 164 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు
➥ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్, 2024
➛నోటిఫికేషన్: 24.06.2024.
➛ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 24.06.2024.
➛ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 24.07.2024.
➛ టైర్-1 (సీబీఈ) పరీక్ష తేది: సెప్టెంబరు-అక్టోబరు, 2024.
➥ మల్టీటాస్కింగ్ స్టాఫ్ (నాన్ టెక్నికల్), అండ్ హవాల్దార్ (సీబీఐసీ & సీబీఎన్) ఎగ్జామినేషన్-2024
➛ నోటిఫికేషన్: 27.06.2024.
➛ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 27.06.2024.
➛ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 31.07.2024.
➛ టైర్-1 (సీబీఈ) పరీక్ష తేది: అక్టోబరు-నవంబరు, 2024.
➥ స్టెనోగ్రాఫర్ గ్రేడ్-సి, డి ఎగ్జామినేషన్, 2024
➛ నోటిఫికేషన్: 26.07.2024.
➛ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 26.07.2024.
➛ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 24.08.2024.
➛ రాతపరీక్ష (సీబీఈ) పరీక్ష తేది: అక్టోబరు - నవంబరు, 2024.
➥ జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్, జూనియర్ ట్రాన్స్‌లేటర్, సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ ఎగ్జామినేషన్, 2024
➛ నోటిఫికేషన్: 02.08.2024.
➛ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 02.08.2024.
➛ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 25.08.2024.
➛ పేపర్-1(సీబీఈ) పరీక్ష తేది: అక్టోబరు - నవంబరు, 2024.
➥ కానిస్టేబుల్ (గ్రౌండ్ డ్యూటీ) ఇన్ సీఏపీఎఫ్, ఎన్ఐఏ, ఎస్‌ఎస్‌ఎఫ్, రైఫిల్‌మ్యాన్ ఇన్ అస్సాం రైఫిల్స్ ఎగ్జామినేషన్-2025
➛ నోటిఫికేషన్: 27.08.2024.
➛ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 27.08.2024.
➛ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 05.10.2024.
➛ రాతపరీక్ష (సీబీఈ) పరీక్ష తేది: జనవరి- ఫిబ్రవరి 2025.
ఆ పరీక్షల తేదీల్లో మార్పులు..
⫸సెలక్షన్ పోస్టుల భర్తీకి సంబంధించి ఫేజ్-12, 2024 పేపర్-1 పరీక్షలను జూన్ 24 నుంచి 26 వరకు నిర్వహించాల్సి ఉండగా.. తాజా షెడ్యూలు ప్రకారం జూన్ 20, 21, 24, 25, 26 తేదీల్లో పేపర్-1 పరీక్ష నిర్వహించన్నారు.
⫸ అదేవిధంగా కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ ఎగ్జామినేషన్-2024 టైర్-1 పరీక్షలను జులై 1 నుంచి 12 వరకు నిర్వహించాల్సి ఉండగా.. కొత్త షెడ్యూలు ప్రకారం జులై 1 నుంచి 5 వరకు, తిరిగి జులై 8 నుంచి 11 వరకు నిర్వహించనున్నారు.
⫸ ఇక ఢిల్లీ పోలీసు, సీఏపీఎఫ్ విభాగంలో ఎస్‌ఐ పోస్టుల భర్తీకి జూన్ 27 నుంచి 29 వరకు పేపర్-1 పరీక్ష నిర్వహించనున్నారు.