SSC SPE 2020 Results: సెలక్షన్ పోస్టుల రాతపరీక్ష ఫలితాలు విడుదల - 1,311 మంది అర్హత!
సెలక్షన్ పోస్టుల భర్తీకి సంబంధించి మెట్రిక్యులేషన్ లెవల్, హయ్యర్ సెకండరీ (10+2) లెవల్, గ్రాడ్యుయేషన్ & ఆపై స్థాయి పోస్టులకు సంబంధించిన ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది.
సెలక్షన్ పోస్టుల పరీక్ష 2022 కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. పరీక్షలకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను చూసుకోవచ్చు. పీడీఎఫ్ పార్మాట్‌లో ఫలితాలు అందుబాటులో ఉన్నాయి. సెలక్షన్ పోస్టుల భర్తీకి సంబంధించి మెట్రిక్యులేషన్ లెవల్, హయ్యర్ సెకండరీ (10+2) లెవల్, గ్రాడ్యుయేషన్ & ఆపై స్థాయి పోస్టులకు సంబంధించిన ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. మూడు విభాగాల్లో కలిపి మొత్తం 1,311 మంది అభ్యర్థులు తర్వాతి దశకు ఎంపికయ్యారు.
➥ మెట్రిక్యులేషన్ లెవల్‌లో మొత్తం 555 మంది అభ్యర్థులు తర్వాతి దశకు ఎంపికయ్యారు. వీరిలో జనరల్ అభ్యర్థులు 300 ఉండగా, ఓబీసీ అభ్యర్థులు 100, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 15, ఎస్సీ అభ్యర్థులు 120 మంది అర్హత సాధించారు. వీరిలో వీహెచ్ అభ్యర్థులు 20 మంది ఉన్నారు.
ఫలితాల (మెట్రిక్యులేషన్ లెవల్) కోసం క్లిక్ చేయండి..
ఫలితాల సమాచారం, కటాఫ్ మార్కుల వివరాలు
➥ హయ్యర్ సెకండరీ (10+2) లెవల్‌లో మొత్తం 513 మంది మంది అభ్యర్థులు తర్వాతి దశకు ఎంపికయ్యారు. వీరిలో జనరల్ అభ్యర్థులు 308 ఉండగా, ఓబీసీ అభ్యర్థులు 135, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 40, ఎస్సీ అభ్యర్థులు 20 మంది అర్హత సాధించారు. వీరిలో ఈఎస్‌ఎమ్ అభ్యర్థులు 10 మంది ఉన్నారు.
ఫలితాల (హయ్యర్ సెకండరీ లెవల్) కోసం క్లిక్ చేయండి..
ఫలితాల సమాచారం, కటాఫ్ మార్కుల వివరాలు
➥ఇక గ్రాడ్యుయేషన్ & ఆపై స్థాయి పోస్టులకు మొత్తం 243 మంది అభ్యర్థులు తర్వాతి దశకు అర్హత సాధించారు. వీరిలో జనరల్ అభ్యర్థులు 198, ఓబీసీ అభ్యర్థులు 20, ఎస్సీ అభ్యర్థులు 20, ఎస్టీ అభ్యర్థులు 5 మంది అర్హత సాధించారు.
ఫలితాల (గ్రాడ్యుయేషన్ లెవల్) కోసం క్లిక్ చేయండి..
ఫలితాల సమాచారం, కటాఫ్ మార్కుల వివరాలు
పరీక్షలో అర్హత మార్కులను జనరల్ అభ్యర్థులకు 35 శాతం (70 మార్కులు), ఓబీసీ/ఈడబ్యూఎస్ అభ్యర్థులకు 30 శాతం (60 మార్కులు), ఇతరులకు 25 శాతం (50 మార్కులు)గా నిర్ణయించారు. దాని ప్రకారం వచ్చిన మార్కుల ఆధారంగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సెలక్షన్ పోస్టుల ఫలితాలను విడుదల చేసింది.
Also Read:
సీహెచ్‌ఎస్‌ఎల్-2020 తుది ఫలితాలు విడుదల, 4685 మందికి ఉద్యోగాలు!
వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలు, మంత్రిత్వ శాఖలు, రాజ్యాంగ సంస్థలు, ట్రైబ్యునళ్లు మొదలైనవాటిలో 4791 లోయర్ డివిజనల్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్ తదితర పోస్టుల భర్తీకి ఎస్ఎస్సీ ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. టైర్-1, టైర్-2, స్కిల్ టెస్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనంతరం ఈ ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది.
ఫలితాలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
సీహెచ్‌ఎస్‌ఎల్-2022 నోటిఫికేషన్ విడుదల - 4500 కేంద్ర కొలువుల భర్తీ! పరీక్ష, ఎంపిక విధానం ఇలా!
కేంద్రప్రభుత్వ విభాగాల్లో వివిధ పోస్టుల భర్తీకి సంబంధించి నిర్వహించే 'కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ (10+2) ఎగ్జామినేషన్-2022' నోటిఫికేషన్‌ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) విడుదల చేసింది. దీనిద్వారా పలు విభాగాల్లోని లోయర్ డివిజన్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులను భర్తీచేయనున్నారు. ఇంటర్ అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరంలేదు. రెండు దశల పరీక్షల (టైర్-1, టైర్-2) ద్వారా ఉద్యోగ నియామకాలు చేపడతారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.
వైద్యశాఖలో 1147 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నోటిఫికేషన్, వివరాలు ఇలా!
తెలంగాణలో వైద్య విద్యపూరి చేసుకున్న వారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. రాష్ట్ర వైద్యారోగ్య శాఖలో 1147 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. అర్హులైన అభ్యర్థుల నుంచి డిసెంబరు 20న ఉదయం 10:30 గంటల నుంచి జనవరి 5న సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..