5,204 స్టాఫ్ నర్స్ పోస్టులు, దరఖాస్తుకు నేడే ఆఖరు - వెంటనే దరఖాస్తు చేసుకోండి!
వివిధ విభాగాల్లో 5,204 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి డిసెంబరు 30 నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. ఇందులో డీఎంఈ, డీహెచ్ పరిధిలో 3,823 పోస్టులు, వైద్య విధాన పరిషత్‌లో 757 పోస్టులు భర్తీ చేస్తారు.
తెలంగాణ వైద్యారోగ్య శాఖలో స్టాఫ్ నర్సు పోస్టుల దరఖాస్తు గడువును ఫిబ్రవరి 21తో ముగియనుంది. అర్హులైన అభ్యర్థులు సాయంత్రం 5 గంటల్లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. స్టాఫ్ నర్స్ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ జనవరి 25న ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 15 వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించారు. అయితే వివిధ ధ్రువీకరణ పత్రాలు పొందడంలో జాప్యం చోటుచేసుకుంటున్న నేపథ్యంలో గడువు పొడిగించాలని తెలంగాణ నర్సింగ్ సమితి వినతి కోరింది. దీంతో వైద్య, ఆరోగ్య సేవల రిక్రూట్‌మెంట్ బోర్డు ఫిబ్రవరి 21 వరకు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
వైద్యారోగ్యశాఖలోని వివిధ విభాగాల్లో 5,204 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం డిసెంబరు 30 నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో డీఎంఈ, డీహెచ్ పరిధిలో 3,823 పోస్టులు, వైద్య విధాన పరిషత్‌లో 757 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఎంఎన్‌జే సంస్థల్లో 81, తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో 127, దివ్యాంగులు, వయో వృద్ధుల సంక్షేమ విభాగంలో 8, మహాత్మాజ్యోతిబా పూలే విద్యా సంస్థల్లో 197, తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ విద్యాసంస్థల్లో 74, తెలంగాణ సోషల్ వెల్ఫేర్‌లో 124, తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్‌లో 13 పోస్టులు భర్తీ చేయనున్నారు.
అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.620 చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో రూ.500 పరీక్ష ఫీజు, రూ.120 ఆన్‌లైన్ ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్, నిరుద్యోగులకు ప్రాసెసింగ్ ఫీజు నుంచి మినహాయింపు ఉంది. ఆన్‌లైన్ విధానంలోనే ఫీజు చెల్లించాలి.
పోస్టుల వివరాలు..
ఖాళీల సంఖ్య: 5,204 పోస్టులు
1) స్టాఫ్ నర్స్: 3,823 పోస్టులు
విభాగం: డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్/డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్.
2) స్టాఫ్ నర్స్: 757 పోస్టులు
విభాగం: తెలంగాణ వైద్యవిధాన పరిషత్.
3) స్టాఫ్ నర్స్: 81 పోస్టులు
విభాగం: ఎంఎన్‌జే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ & రీజినల్ క్యాన్సర్ సెంటర్.
4) స్టాఫ్ నర్స్: 08 పోస్టులు
విభాగం: డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిజెబుల్డ్ అండ్ సీనియర్ సిటీజెన్స్ వెల్ఫేర్.
5) స్టాఫ్ నర్స్: 127 పోస్టులు
విభాగం: తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ.
6) స్టాఫ్ నర్స్: 197 పోస్టులు
విభాగం: మహాత్మాజ్యోతిబా పూలే తెలంగాణ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ.
7) స్టాఫ్ నర్స్: 74 పోస్టులు
విభాగం: తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ (గురుకులం).
8) స్టాఫ్ నర్స్: 124 పోస్టులు
విభాగం: తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ.
9) స్టాఫ్ నర్స్: 13 పోస్టులు
విభాగం: తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ.
అర్హత: జనరల్ నర్సింగ్ & మిడ్‌వైఫరీ (GNM) లేదా బీఎస్సీ (నర్సంగ్). తెలంగాణ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్‌లో సభ్యత్వం ఉండాలి. సర్టిఫికేట్ ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
వయోపరిమితి: 01.07.2022 నాటికి 18-44 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
నోటిఫికేషన్, రాతపరీక్ష వివరాల కోసం క్లిక్ చేయండి..
Also Read:
➥ తెలంగాణలోని కేంద్రీయ మైనార్టీ పాఠశాలల్లో 1308 టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులు - అర్హతలివే?
➥ ఏపీలోని కేంద్రీయ మైనార్టీ పాఠశాలల్లో 1428 టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులు - అర్హతలివే?