News
News
X

SSC JE Admit Card: జూనియర్ ఇంజినీర్ పరీక్ష హాల్‌టికెట్లు విడుదల, డౌన్‌లోడ్ లింక్ ఇదే!

ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జూనియర్ ఇంజినీర్ పేపర్-1 పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఫిబ్రవరి 26న పేపర్-2 పరీక్ష నిర్వహించనున్నారు. వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు.

FOLLOW US: 
Share:

కేంద్ర ప్రభుత్వంలోని వివిధ ప్రభుత్వ విభాగాల్లో జూనియర్ ఇంజినీర్ (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, క్వాంటిటీ సర్వేయింగ్ & కాంట్రాక్ట్స్) ఉద్యోగాల భర్తీకి నిర్వహించనున్న పేపర్-2 పరీక్ష అడ్మిట్ కార్డులను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఫిబ్రవరి 21న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు లేదా రూల్ నెంబర్, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. రీజియన్లవారీగా అడ్మిట్ కార్డులను అందుబాటులో ఉంచింది.

సదరన్ (సౌత్) రీజియన్ అడ్మిట్ కార్డుల కోసం క్లిక్ చేయండి.. 

వివిధ రీజియన్ల వెబ్‌సైట్ల కోసం క్లిక్ చేయండి.. 

ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జూనియర్ ఇంజినీర్ పేపర్-1 పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఫిబ్రవరి 26న పేపర్-2 పరీక్ష నిర్వహించనున్నారు. గతేడాది నవంబరు 14 నుంచి 16 వరకు దేశవ్యాప్తంగా ఆన్‌లైన్ విధానంలో పేపర్-1 పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. పేపర్-1 పరీక్షలో మొత్తం 20,138 మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు. వీరిలో సివిల్ ఇంజినీరింగ్ పేపర్-2 పరీక్షకు 15,605 మంది అభ్యర్థులు, ఎలక్ట్రికల్/మెకానికల్ ఇంజినీరింగ్ పేపర్-2 పరీక్షకు 4,533 అభ్యర్థులు అర్హత సాధించారు. వీరికి సంబంధించిన అడ్మిట్ కార్డులను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ తాజాగా విడుదల చేసింది.

SSC JE Hall Ticket 2023 ఇలా డౌన్‌లోడ్ చేసుకోవాలి..

స్టెప్-1:  జూనియర్ ఇంజినీర్ హాల్‌టికెట్ల కోసం అభ్యర్థులు మొదట SSC అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.  

స్టెప్-2: అక్కడ హోంపేజీలో కనింపిచే 'Junior Engineer Paper-II Admit card' లింక్ మీద క్లిక్ చేయాలి. 

స్టెప్-3: ఒక కొత్త లాగిన్ పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ ఐడీ, పుట్టినతేదీ వివరాలు నమోదుచేయాలి. 

స్టెప్-4: 'JE Paper 2 admit card' స్క్రీన్ మీద కనిపిస్తుంది. 

స్టెప్-5: హాల్‌టికెట్‌లో వివరాలు సరిచూసుకొని, డౌన్‌లోడ్ చేసుకోవాలి.

స్టెప్-6: అడ్మిట్ కార్డును A4 సైజులో ప్రింట్ తీసుకోవాలి. 

పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు అడ్మిట్ కార్డును తప్పనిసరిగా తీసుకెళ్లాలి. ఇదిలేనిదే పరీక్ష రాయడానికి అనుమతించరు. అడ్మిట్ కార్డుతోపాటు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా ఒరిజినల్ ఐడీ కార్డును తప్పనిసరిగా వెంటతీసుకెళ్లాల్సి ఉంటుంది.

పరీక్ష విధానం:
పేపర్-2 పరీక్ష పూర్తి డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటుంది. మొత్తం 300 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో మూడు సెక్షన్లు (పార్ట్-ఎ, పార్ట్-బి, పార్ట్-సి) ఉంటాయి. పరీక్ష సమయం 2 గంటలు. స‌ంబంధిత బ్రాంచ్‌లో డిప్లొమా/ ఇంజినీరింగ్‌ సిలబస్‌ నుంచి ప్రశ్నలు అడుగుతారు. అభ్యర్థులు సివిల్ & స్ట్రక్చర‌ల్ లేదా ఎల‌క్ట్రిక‌ల్ లేదా మెకానిక‌ల్ విభాగాల్లో ఏదో ఒక విభాగంలో ప‌రీక్ష రాయాల్సి ఉంటుంది. పేపర్‌-2 పరీక్ష ఆబ్జెక్టివ్‌ విధానంలో కాకుండా ప్రతి ప్రశ్నకు రాతపూర్వకంగా సమాధానాలు రాయాల్సి ఉంటుంది. ఈ ప్రశ్నలకు ఎలాంటి నెగెటివ్‌ మార్కింగ్‌ ఉండదు.

కేంద్రప్రభుత్వరంగ సంస్థల్లోని జూనియర్‌ ఇంజినీర్ (జేఈ) పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఆగస్టు 12న నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. దీనిద్వారా వివిధ కేంద్ర ప్రభుత్వంలోని 22 విభాగాల్లోని జూనియర్ ఇంజినీర్ (సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్) పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగాల్లో డిప్లొమా లేదా ఇంజినీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థుల నుంచి ఆగస్టు 12 నుంచి సెప్టెంబరు 2 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించారు. అభ్యర్థులకు నవంబరు 14 నుంచి 16 వరకు పేపర్-1 పరీక్ష నిర్వహించారు. పేపర్-1 పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఫిబ్రవరి 26న పేపర్-2 (డిస్క్రిప్టివ్) పరీక్ష నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన అడ్మిట్ కార్డునుల స్టాఫ్ సెలక్షన్ కమిషన్ తాజాగా విడుదల చేసింది.  
నోటిఫికేషన్, పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

Also Read:

12,523 ఎంటీఎస్‌ పోస్టుల దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
కేంద్ర ప్రభుత్వ శాఖల్లోని వివిధ విభాగాల్లో 12,523 మల్టీ టాస్కింగ్ స్టాఫ్(నాన్‌టెక్నికల్), హవల్దార్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు గడువును వారంపాటు పొడిగిస్తూ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంది. ఎంటీఎస్ పోస్టుల దరఖాస్తు గడువు ఫిబ్రవరి 17తో దరఖాస్తు గడువు ముగియాల్సి ఉండగా.. ఫిబ్రవరి 24 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది.
నోటిఫికేషన్, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

Published at : 22 Feb 2023 12:13 PM (IST) Tags: ssc junior engineer paper 2 SSC JE Paper 2 hall ticket 2023 SSC JE Paper 2 hall ticket SSC JE Hall Ticket 2023 SSC JE Admit Card 2023 SSC JE Admit Card SSC JE

సంబంధిత కథనాలు

TSPSC పేపర్ లీకేజీలో మొత్తం హవాలా మార్గమేనా?  నిందితులు ఆర్థిక లావాదేవీలు ఎలా జరిపారు?

TSPSC పేపర్ లీకేజీలో మొత్తం హవాలా మార్గమేనా?  నిందితులు ఆర్థిక లావాదేవీలు ఎలా జరిపారు?

IB Answer Key: ఇంటెలిజెన్స్ బ్యూరో పరీక్ష ఆన్సర్ కీ విడుదల, అభ్యంతరాలకు అవకాశం!

IB Answer Key: ఇంటెలిజెన్స్ బ్యూరో పరీక్ష ఆన్సర్ కీ విడుదల, అభ్యంతరాలకు అవకాశం!

TSPSC Paper Leak: పేపర్ లీకేజీ వ్యవహారం, రంగంలోకి ఈడీ? పెద్దమొత్తంలో డబ్బు చేతులు మారిందన్న అనుమానం!

TSPSC Paper Leak: పేపర్ లీకేజీ వ్యవహారం, రంగంలోకి ఈడీ? పెద్దమొత్తంలో డబ్బు చేతులు మారిందన్న అనుమానం!

TSPSC Paper Leak: గ్రూప్-1 పేపర్ లీక్ వ్యవహారం - వాళ్ల పాపం, ఆమెకు శాపంగా మారింది!

TSPSC Paper Leak: గ్రూప్-1 పేపర్ లీక్ వ్యవహారం - వాళ్ల పాపం, ఆమెకు శాపంగా మారింది!

SSC Exams: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షల షెడ్యూలు వెల్లడి, ఏ పరీక్ష ఎప్పుడంటే?

SSC Exams: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షల షెడ్యూలు వెల్లడి, ఏ పరీక్ష ఎప్పుడంటే?

టాప్ స్టోరీస్

Hyderabad Metro Charges : హైదరాబాద్ వాసులకు మెట్రో షాక్, రద్దీ సమయాల్లో రాయితీ ఎత్తివేత!

Hyderabad Metro Charges : హైదరాబాద్ వాసులకు మెట్రో షాక్, రద్దీ సమయాల్లో రాయితీ ఎత్తివేత!

Tenali Council Fight : తెనాలి మున్సిపల్ కౌన్సిల్ లో రసాభాస, చొక్కాలు చిరిగేలా కొట్టుకున్న టీడీపీ, వైసీపీ కౌన్సిలర్లు

Tenali Council Fight : తెనాలి మున్సిపల్ కౌన్సిల్ లో రసాభాస, చొక్కాలు చిరిగేలా కొట్టుకున్న టీడీపీ, వైసీపీ కౌన్సిలర్లు

Naga Chaitanya : చైతూను కావాలని టార్గెట్ చేశారా? డివోర్స్, డేటింగ్ రూమర్స్ - ప్లాన్ ప్రకారమే ప్రతిదీ తెరపైకి?

Naga Chaitanya : చైతూను కావాలని టార్గెట్ చేశారా? డివోర్స్, డేటింగ్ రూమర్స్ - ప్లాన్ ప్రకారమే ప్రతిదీ తెరపైకి?

PM Modi Degree Certificate: మోదీ ఎడ్యుకేషన్‌ గురించి అడిగిన కేజ్రీవాల్‌కు జరిమానా- ఆరాలు అనవసరమన్న గుజరాత్ హైకోర్టు

PM Modi Degree Certificate: మోదీ ఎడ్యుకేషన్‌ గురించి అడిగిన కేజ్రీవాల్‌కు జరిమానా-  ఆరాలు అనవసరమన్న గుజరాత్ హైకోర్టు