అన్వేషించండి

SSC JE 2024: 968 జూనియర్ ఇంజినీర్ నోటిఫికేషన్ వచ్చేసింది, అర్హతలు ఇవే

SSC JE నోటిఫికేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వంలోని పలు విభాగాల్లోని జూనియర్ ఇంజినీర్ (సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్) పోస్టులను భర్తీ చేస్తారు.

కేంద్రప్రభుత్వరంగ సంస్థల్లోని జూనియర్‌ ఇంజినీర్ (జేఈ) పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్  జారీచేసింది. దీనిద్వారా వివిధ కేంద్ర ప్రభుత్వంలోని పలు విభాగాల్లోని జూనియర్ ఇంజినీర్ (సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్) పోస్టులను భర్తీ చేస్తారు. సంబంధిత విభాగాల్లో డిప్లొమా లేదా ఇంజినీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మార్చి 28న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఏప్రిల్ 18వరకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. ఫీజు చెల్లించడానికి ఏప్రిల్ 19 వరకు గడువు ఉంది. పోస్టుల వారీగా అభ్యర్థులకు వయోపరిమితిని నిర్ణయించారు.

వివరాలు..

ఖాళీల సంఖ్య: 968

❂ జూనియర్ ఇంజినీర్ ఎగ్జామినేషన్-2024

విభాగాలు: ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్.

విభాగాలవారీగా పోస్టులు:

⏩ విభాగం: బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (పురుషులకు మాత్రమే)
జూనియర్ ఇంజినీర్(సి):  438 పోస్టులు

⏩ విభాగం: బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (పురుషులకు మాత్రమే)
జూనియర్ ఇంజినీర్(ఇ & ఎం): 37 పోస్టులు

⏩ విభాగం: బ్రహ్మపుత్ర బోర్డు, జల శక్తి మంత్రిత్వ శాఖ
జూనియర్ ఇంజినీర్(సి): 02 పోస్టులు

⏩ విభాగం: సెంట్రల్ వాటర్ కమిషన్
జూనియర్ ఇంజినీర్(ఎం): 12 పోస్టులు

⏩ విభాగం: సెంట్రల్ వాటర్ కమిషన్
జూనియర్ ఇంజినీర్(సి): 120 పోస్టులు

⏩ విభాగం: సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్
జూనియర్ ఇంజినీర్(ఇ): 121 పోస్టులు

⏩ విభాగం: సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్
జూనియర్ ఇంజినీర్(సి): 217 పోస్టులు

⏩ విభాగం: సెంట్రల్ వాటర్ పవర్ రిసెర్చ్ స్టేషన్
జూనియర్ ఇంజినీర్(ఇ): 02 పోస్టులు

⏩ విభాగం: సెంట్రల్ వాటర్ పవర్ రిసెర్చ్ స్టేషన్
జూనియర్ ఇంజినీర్(సి): 03 పోస్టులు

⏩ విభాగం: డీజీక్యూఏ- నావల్‌, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్
జూనియర్ ఇంజినీర్(ఎం): 03 పోస్టులు

⏩ విభాగం: డీజీక్యూఏ- నావల్‌, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్
జూనియర్ ఇంజినీర్(ఇ): 03 పోస్టులు

⏩ విభాగం: ఫరక్కా బ్యారేజ్ ప్రాజెక్ట్, జల శక్తి మంత్రిత్వ శాఖ
జూనియర్ ఇంజినీర్(ఇ): 02 పోస్టులు

⏩ విభాగం: ఫరక్కా బ్యారేజ్ ప్రాజెక్ట్, జల శక్తి మంత్రిత్వ శాఖ
జూనియర్ ఇంజినీర్(సి): 02 పోస్టులు

⏩ విభాగం: మిలిటరీ ఇంజినీర్ సర్వీస్
జూనియర్ ఇంజినీర్(సి): గడువులోగా తెలియజేస్తారు.

⏩ విభాగం: మిలిటరీ ఇంజనీర్ సర్వీస్
జూనియర్ ఇంజినీర్(ఇ & ఎం): తర్వాత తెలియజేస్తారు.

⏩ విభాగం: నేషనల్ టెక్నికల్ రిసెర్చ్ ఆర్గనైజేషన్
జూనియర్ ఇంజినీర్(సి): 06 పోస్టులు

అర్హత‌: సంబంధిత ఇంజినీరింగ్‌ డిగ్రీ లేదా మూడేళ్ల డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. డిప్లొమా అభ్యర్థులకు 2-3 సంవత్సరాల అనుభవం తప్పనిసరి. అయితే కొన్ని విభాగాల్లోని పోస్టులకు మాత్రమే అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. 

వ‌యోప‌రిమితి: విభాగాల ఆధారంగా అభ్యర్థుల వయోపరిమితిలో తేడాలు ఉంటాయి. 01.08.2024 నాటికి వయోపరిమితిని పరిగణనలోకి తీసుకుంటారు. కొన్ని విభాగాలకు 32 సంవత్సరాలు, మ‌రికొన్నింటికి 30 సంవత్సరాల వరకు గ‌రిష్ఠ వ‌యోప‌రిమితి నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీల‌కు అయిదేళ్లు; ఓబీసీల‌కు మూడేళ్లు, దివ్యాంగులకు(జనరల్) 10 సంవత్సరాలు, దివ్యాంగులకు(ఓబీసీ) 13 సంవత్సరాలు, దివ్యాంగులకు(ఎస్సీ, ఎస్టీ) 15 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 3 సంవత్సరాలపాటు వ‌యోప‌రిమితిలో స‌డ‌లింపులు వ‌ర్తిస్తాయి. డిఫెన్స్ పర్సనల్స్ అభ్యర్థులకు ఎస్సీ-ఎస్టీలకు 8 సంవత్సరాలు, ఇతరులకు 3 సంవత్సరాలపాటు వయోసడలింపు ఉంటుంది.

పరీక్ష ఫీజు: రూ.100. ఎస్‌బీఐ చలానా, నెట్‌ బ్యాంకింగ్, క్రెడిట్‌ కార్డు, డెబిట్‌ కార్డు ద్వారా ఫీజు చెల్లించవచ్చు. మహిళా అభ్యర్థులు ఎస్సీ , ఎస్టీ, వికలాంగులు, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. ఇప్పటికే యూజర్ ఐడీ, పాస్ వర్డ్ ఉన్నవారు నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. లేనివారు రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనంతరం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఎంపిక విధానం: రాతపరీక్ష (పేపర్-1), కన్వెన్షల్ పరీక్ష (పేపర్-2), డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా.

జీత భత్యాలు:  రూ.35,400- రూ.1,12,400.

పరీక్ష విధానం:
✦ జూనియర్ ఇంజినీర్ ఎగ్జామినేషన్ పరీక్షలను రెండు దశల్లో నిర్వహిస్తారు. ఆన్‌లైన్ విధానంలోనే పరీక్షలు నిర్వహిస్తారు.

✦ మొత్తం 500 మార్కులకు పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో రెండు పేపర్లు (పేపర్-1, పేపర్-2) ఉంటాయి. 'పేపర్-1'‌కు 200 మార్కులు, 'పేపర్-2'కు 300 మార్కులు ఉంటాయి.

✦ పేపర్-1లో మొత్తం 200 మార్కులకుగాను 200 ప్రశ్నలు అడుగుతారు. వీటిలో జనరల్‌ ఇంటెలిజన్స్‌ & రీజనింగ్‌ విభాగం నుంచి 50 ప్రశ్నలు, జనరల్ అవేర్‌నెస్ విభాగం నుంచి 50 ప్రశ్నలు, జనరల్ ఇంజినీరింగ్ (సివిల్/ఎలక్ట్రికల్/ మెకానికల్) నుంచి 100 ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్నలన్నీ కూడా ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు. పరీక్ష సమయం 2 గంటలు. నెగెటివ్ మార్కులు కూడా ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానిక 0.25 మార్కులు కోత విధిస్తారు. పేప‌ర్-1లో అర్హత‌ సాధించిన‌వారికి పేప‌ర్-2 ప‌రీక్ష నిర్వహిస్తారు.

✦ ఇక పేపర్-2 విషయానికొస్తే.. మొత్తం 300 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. స‌ంబంధిత బ్రాంచ్‌లో డిప్లొమా/ ఇంజినీరింగ్‌ సిలబస్‌ నుంచి ప్రశ్నలు అడుగుతారు. అభ్యర్థులు సివిల్ & స్ట్రక్చర‌ల్ లేదా ఎల‌క్ట్రిక‌ల్ లేదా మెకానిక‌ల్ విభాగాల్లో ఏదో ఒక విభాగంలో ప‌రీక్ష రాయాల్సి ఉంటుంది. పరీక్ష సమయం 2 గంట‌ల‌ు. పేపర్‌-2 పరీక్ష ఆబ్జెక్టివ్‌ విధానంలో కాకుండా ప్రతి ప్రశ్నకు రాతపూర్వకంగా సమాధానాలు రాయాల్సి ఉంటుంది. ఈ ప్రశ్నలకు నెగెటివ్‌ మార్కింగ్‌ ఉండదు.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్షకేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.

ముఖ్యమైన తేదీలు..

✦ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 28.03.2024.

✦ దరఖాస్తుకు చివరితేది: 18.04.2024. 

✦ ఆన్‌లైన్ ద్వారా ఫీజు చెల్లించడానికి చివరితేది: 19.04.2024.

.✦ దరఖాస్తుల సవరణకు అవకాశం: 22.04.2024 to 23.04.2024

✦ పేపర్-1 పరీక్ష (సీబీటీ) తాత్కాలిక షెడ్యూల్: 04.06.2024 to 06.06.2024.

✦ పేపర్-2 పరీక్ష (కన్వెన్షనల్) తేది: ప్రకటించాల్సి ఉంది.

టాప్ హెడ్ లైన్స్

AP DSC Notification 2026: అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
SBI Clerk Notification 2026:ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
TGPSC FBO Notification 2026: తెలంగాణ అటవీ శాఖలో ఉద్యోగాలు! 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ పోస్టులకు త్వరలో ప్రకటన!
తెలంగాణ అటవీ శాఖలో ఉద్యోగాలు! 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ పోస్టులకు త్వరలో ప్రకటన!
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
UPI Transaction: మీరు ఒక రూపాయి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
మీరు ఒక రూపాయి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
Telangana 22A Land Issues:తెలంగాణలోనూ 22ఎ సమస్యలకు పరిష్కారం! శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు!
తెలంగాణలోనూ 22ఎ సమస్యలకు పరిష్కారం! శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Embed widget