Constable GD Result: కానిస్టేబుల్ అభ్యర్థులకు అలర్ట్, త్వరలో రాతపరీక్ష ఫలితాలు వచ్చేస్తున్నాయ్!
Constable General Duty Results: దేశభద్రత దళాాల్లో జనరల్ డ్యూటీ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నిర్వహించిన రాతపరీక్ష ఫలితాలు త్వరలోనే విడుదలకానున్నాయి. ఫలితాల వెల్లడికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
SSC Constable General Duty Results Soon: కేంద్ర సాయుధ బలగాల్లో కానిస్టేబుల్/ రైఫిల్‌మ్యాన్ (జనరల్ డ్యూటీ) (Constable/Rifle man GD) పోస్టుల భర్తీకి నిర్వహించిన రాతపరీక్ష ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) త్వరలోనే వెల్లడించనుంది. ఈ మేరకు అధికారులు సమాయత్తమవుతున్నారు. అభ్యర్థులకు ఈ ఏడాది ఫిబ్రవరి 20 నుంచి మార్చి 12 వరకు, మరికొన్ని కేంద్రాల్లో మార్చి 30న పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. తెలుగుతోపాటు మొత్తం 13 ప్రాంతీయ భాషల్లో పరీక్ష నిర్వహించారు. కానిస్టేబుల్ రాతపరీక్షకు సంబంధించిన ప్రిలిమినరీ ఆన్సర్ కీని ఏప్రిల్ 3న విడుదల చేశారు. ఆన్సర్ కీపై ఏప్రిల్ 10 వరకు అభ్యంతరాలు స్వీకరించారు. త్వరలోనే ఫైనల్ ఆన్సర్ కీతోపాటు ఫలితాల వెల్లడికి కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది.
రాత పరీక్షలో అర్హత సాధించినవారికి ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ నిర్వహిస్తారు. పీఈటీ/ పీఎస్‌టీ పాసైన వారికి వైద్య పరీక్షలు అనంతరం ధ్రువపత్రాల పరిశీలన చేస్తారు. ఈ క్రమంలో రిజర్వేషన్ అనుసరించి అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపిక అవుతారు. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు రూ.21,700 నుంచి రూ.69,100 వరకు ఉన్న గ్రేడ్ 3 స్థాయి వేతనం లభిస్తుంది.
మూడింతలు పెరిగిన ఖాళీల సంఖ్య..
దేశంలోని భద్రతా బలగాల్లో కానిస్టేబుల్/ రైఫిల్‌మ్యాన్ (Constable/Rifle man) పోస్టుల భర్తీకి గతేడాది నవంబరులో 'స్టాఫ్ సెలక్షన్ కమిషన్(Staff Selection Commissions)' నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా మొత్తం 26,146 ఖాళీలను భర్తీచేయనున్నట్లు ప్రకటించింది. అయితే కానిస్టేబుల్ ఖాళీలను సవరిస్తూ.. ఇటీవలే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) రివైజ్‌డ్ నోటీసును విడుదల చేసింది. ఆ ఖాళీల సంఖ్యను భారీగా పెంచింది. పాతపోస్టులకు అదనంగా మరో 20,471 పోస్టులను చేర్చింది. దీంతో మొత్తం కానిస్టేబుల్ పోస్టుల సంఖ్య 46,617కి చేరింది.
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF), ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP), సశస్త్ర సీమ బల్ (SSB), సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్ (SSF)లో కానిస్టేబుల్ (GD) పోస్టులు; అస్సాం రైఫిల్స్ (AR)లో రైఫిల్‌మ్యాన్ (GD) పోస్టులను భర్తీ చేయనున్నారు.
పెరిగిన పోస్టుల వివరాలు ఇలా..
* మొత్తం ఖాళీల సంఖ్య: 46,617 పోస్టులు (గతంలో 26,146)
పోస్టుల కేటాయింపు: యూఆర్-19,596, ఈడబ్ల్యూఎస్-5632, ఓబీసీ-9799, ఎస్టీ-4794, ఎస్సీ-6796.
విభాగం | పోస్టుల సంఖ్య (పాతపోస్టులు) | పెరిగిన పోస్టులు | పోస్టుల కేటాయింపు |
బీఎస్‌ఎఫ్ | 6174 | 12,076 | మెన్ - 10227; స్త్రీలు - 1849 |
సీఐఎస్‌ఎఫ్ | 11025 | 13,632 | పురుషులు - 11,558; స్త్రీలు - 2,074 |
సీఆర్‌పీఎఫ్ | 3337 | 9,410 | పురుషులు - 9,301; స్త్రీలు - 109 |
ఎస్‌ఎస్‌బీ | 635 | 1,926 | పురుషులు - 1,884; స్త్రీలు - 42 |
ఐటీబీపీ | 3189 | 6,287 | పురుషులు - 5,327; స్త్రీలు - 960 |
ఏఆర్ | 1490 | 2,990 | పురుషులు - 2,948; స్త్రీలు - 42 |
ఎస్‌ఎస్‌ఎఫ్ | 296 | 296 | పురుషులు - 222; స్త్రీలు - 74 |
మొత్తం ఖాళీలు | 26,146 | 46,617 | 46,617 |
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ALSO READ:
బ్యాంక్ ఆఫ్ బరోడాలో 459 ఉద్యోగాలు - అర్హతలు, ఎంపిక వివరాలు ఇలా