SSC Delhi Police Answer Key: ఢిల్లీ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ పరీక్ష ఆన్సర్ 'కీ' విడుదల, ఇలా చెక్ చేసుకోండి!!
అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీని అందుబాటులో ఉంచింది. ఆన్సర్ కీతోపాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను కూడా కమిషన్ విడుదల చేసింది. అభ్యర్థులు తమ రోల్ నెంబర్, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి చూసుకోవచ్చు.
ఢిల్లీ పోలీసు విభాగంలో హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి అక్టోబరు 10 నుంచి 20 వరకు నిర్వహించిన ఢిల్లీపోలీస్ ఎగ్జామినేషన్-2022 పరీక్ష ప్రాథమిక కీని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నవంబరు 2న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీని అందుబాటులో ఉంచింది. ఆన్సర్ కీతోపాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను కూడా కమిషన్ విడుదల చేసింది. అభ్యర్థులు తమ రోల్ నెంబర్, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి ఆన్సర్ కీ, రెస్పాన్స్ షీట్లను చూసుకోవచ్చు. అభ్యర్థులు ఆన్సర్ కీని, రెస్పాన్స్ షీట్లను డౌన్‌లోడ్ చేసుకుని, ప్రింట్ తీసుకోవడం ఉత్తమం. ఎందుకంటే ఆన్సర్ కీ లింక్ ఎక్కువకాలం అందుబాటులో ఉండదు.
ఆన్సర్ కీపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే నవంబరు 2న సాయంత్రం 5 గంట నుంచి నవంబరు 7న సాయంత్రం 5 గంటల వరకు తెలియజేయవచ్చు. ఒక్కో అభ్యంతరానికి రూ.100 ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. అభ్యంతరాల గడువులోగా సమర్పించాల్సి ఉంటుంది. గడువు దాటితే ఎట్టి పరిస్థితుల్లోనూ అభ్యంతరాలు తెలిపేందుకు అవకాశం ఉండదు.
ఢిల్లీపోలీస్ ఎగ్జామ్-2022 ఆన్సర్ కీ ఇలా చూసుకోండి..
➥ ఆన్సర్ కీ కోసం అభ్యర్థుల మొదటి అధికారిక వెబ్‌సైట్ సందర్శించాలి - https://ssc.nic.in/
➥ అక్కడ హోంపేజీలో పైభాగంలో కనిపించే 'ANSWER KEY' ట్యాబ్ మీద క్లిక్ చేయాలి.
➥ క్లిక్ చేయగానే వచ్చే పేజీలో 'Head Constable (Ministerial) in Delhi Police Examination, 2022' ఆన్సర్ కీకి సంబంధించిన లింక్‌పై క్లిక్ చేయాలి.
4) క్లిక్ చేయగానే వచ్చే పేజీలోని కింది భాగంలో కనిపించే ''Click here for Candidate’s Response Sheet along with Tentative Answer Keys and
submission of representation'' లింక్‌పై క్లిక్ చేయాలి.
➥ ఛాలెంజ్ సిస్టమ్ పేజీలో 'Head Constable Ministerial in Delhi Police 2022' ఆప్షన్ ఎంపిక చేసుకొని SUBMIT బటన్‌పై క్లిక్ చేయాలి.
➥ ఇలా క్లిక్ చేయగానే వచ్చే లాగిన్ పేజీలో అభ్యర్థులు తమ రోల్ నెంబరు, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేయాలి.
➥ ఆన్సర్ కీ, రెస్పాన్స్ షీట్ల, అభ్యంతరాల నమోదుకు సంబంధించిన పేజీ ఓపెన్ అవుతుంది.
➥ రెస్పాన్స్ షీట్లు, ఆన్సర్ కీ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆన్సర్ కీపై ఏమైనా సందేహాలుంటే అభ్యంతరాలు తెలపవచ్చు.
ఆన్సర్ కీ, రెస్పాన్స్ షీట్లను పొందడానికి క్లిక్ చేయండి..
ఢిల్లీ పోలీసు విభాగంలో హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 'ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్-2022' గత మే నెలలో నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిదే. మొత్తం 835 హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్) పోస్టుల భర్తీకి అర్హులైన స్త్రీ, పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. మొత్తం పోస్టుల్లో పురుషులకు 559, మహిళలకు 276 పోస్టులు కేటాయించారు. ఈ పోస్టుల భర్తీకి ఇప్పటికే రాతపరీక్ష నిర్వహించగా.. తాజాగా ప్రాథమిక ఆన్సర్ కీని విడుదల చేసింది స్టాఫ్ సెలక్షన్ కమిషన్. ఈ కీపై అభ్యంతరాల స్వీకరణ తర్వాత ఫైనల్ కీతోపాటు, ఫలితాలను కూడా విడుదల చేయనున్నారు. రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు తర్వాతి దశలో ఫిజికల్ టెస్ట్స్, టైపింగ్ టెస్ట్ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
:: ఇవీ చదవండి ::
SSC CGL 2022 Exam Date: సీజీఎల్-2022 'టైర్-1' పరీక్ష తేదీ ఖరారు, ఎప్పుడంటే?
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఇటీవలే కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్(SSC CGL)-2022 నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ఉద్యోగాల భర్తీకి సెప్టెంబరు 17 నుంచి అక్టోబరు 13 వరకు దరఖాస్తులు స్వీకరించింది. అక్టోబరు 19, 20 తేదీల్లో దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పించింది. అయితే తాజాగా ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి పరీక్ష తేదీలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది.
పరీక్ష తేదీలు, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..
SSC SA Exam Date: ఐఎండీ సైంటిఫిక్ అసిస్టెంట్ పరీక్ష తేదీ ఖరారు, ఎప్పుడంటే?
భారత వాతావరణ శాఖలో 990 సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సెప్టెంబరు 30న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. సెప్టెంబరు 30 నుంచి అక్టోబరు 18 వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అక్టోబరు 25న దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పించారు. అయితే ఈ పోస్టుల భర్తీకి సంబంధించి పరీక్ష తేదీని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ తాజాగా వెల్లడించింది.
పరీక్షల షెడ్యూలు, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..