SSC SA Exam Date: ఐఎండీ సైంటిఫిక్ అసిస్టెంట్ పరీక్ష తేదీ ఖరారు, ఎప్పుడంటే?
భారత వాతావరణ శాఖలో 990 సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ssc సెప్టెంబరు 30న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. సెప్టెంబరు 30 నుంచి అక్టోబరు 18 వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.
భారత వాతావరణ శాఖలో 990 సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సెప్టెంబరు 30న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. సెప్టెంబరు 30 నుంచి అక్టోబరు 18 వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అక్టోబరు 25న దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పించారు. అయితే ఈ పోస్టుల భర్తీకి సంబంధించి పరీక్ష తేదీని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ తాజాగా వెల్లడించింది.
ప్రకటించిన షెడ్యూలు ప్రకారం డిసెంబరు 14 నుండి 16 వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్ష ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న వాతావరణ కేంద్రాల్లోని సైంటిఫిక్ అసిస్టెంట్ గ్రూప్-'బి' నాన్-గెజిటెడ్, నాన్-మినిస్టీరియల్ పోస్టులను భర్తీ చేస్తారు. ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.48,912 జీతంగా చెల్లిస్తారు.
తెలుగు రాష్ట్రాల్లోనూ పరీక్ష నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ నగరాల్లో పరీక్ష నిర్వహించనున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.
రాత పరీక్ష విధానం:
రాత పరీక్షలో మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్ విధానంలో నిర్వహించే రాతపరీక్షలో రెండు విభాగాలు (పార్ట్-1, పార్ట్-2) ఉంటాయి. పరీక్ష సమయం 2 గంటలు.
➥ పార్ట్-1లో 100 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. వీటిలో జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రెహెన్షన్, జనరల్ అవేర్‌నెస్‌కు సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో విభాగానికి 25 మార్కులు ఉంటాయి.
➥ పార్ట్-2లో 100 మార్కులకు ప్రశ్నలు అడుగుతారు. ఇందులో ఫిజిక్స్/ కంప్యూటర్ సైన్స్ & ఐటీ/ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్ సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి.
➥పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానికి 0.25 మార్కులు కోత విధిస్తారు.
SSC IMD SA నోటిఫికేషన్, ఎంపిక వివరాల కోసం క్లిక్ చేయండి..
Also Read:
నేషనల్ హౌసింగ్ బ్యాంకులో ఉద్యోగాలు - దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా!
న్యూఢిల్లీలోని నేషనల్ హౌసింగ్ బ్యాంక్ వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కాంట్రాక్ట్, రెగ్యులర్ విధానంలో ఈ ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఎన్‌హెచ్‌బీలో ఉద్యోగాల భర్తీకి అక్టోబరు 29 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. నవంబరు 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌లో 322 హెడ్‌కానిస్టేబుల్ పోస్టులు, దరఖాస్తు చేసుకోండి
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ స్పోర్ట్స్ కోటా గ్రూప్ సి విభాగంలో హెడ్ కానిస్టేబుల్(జనరల్ డ్యూటీ) నాన్ గెజిటెడ్ అండ్ నాన్ మినిస్టీరియల్ పోస్టుల భర్తీకి పురుష, మహిళా అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది.12వ తరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. క్రీడా ప్రదర్శన, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, స్పోర్ట్స్ ట్రయల్ టెస్ట్, మెరిట్ లిస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. ఎంపికైన అభ్యర్థులు భారతదేశం, విదేశాల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్లు, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..