SPMCIL Recruitment: సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్-హైదరాబాద్‌లో టెక్నీషియన్ పోస్టులు, అర్హతలివే!
హైదరాబాద్‌లోని సైఫాబాద్‌కు చెందిన సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు.
![SPMCIL Recruitment: సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్-హైదరాబాద్‌లో టెక్నీషియన్ పోస్టులు, అర్హతలివే! Security Printing Press, Hyderabad has released notification for Recruitment of Junior Technician, Fireman Posts in various Trades SPMCIL Recruitment: సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్-హైదరాబాద్‌లో టెక్నీషియన్ పోస్టులు, అర్హతలివే!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/08/b3c7b6d9f572907a2ff3df0d489cdc381665231272830522_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన హైదరాబాద్‌లోని సైఫాబాద్‌కు చెందిన సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ రాతపరీక్షలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
వివరాలు...
మొత్తం ఖాళీలు: 83
1) జూనియర్ టెక్నీషియన్: 82 పోస్టులు
విభాగాలు: ప్రింటింగ్/ కంట్రోల్, ఫిట్టర్, టర్నర్, ఎలక్ట్రికల్, వెల్డర్, ఎలక్ట్రానిక్స్/ఇన్‌స్ట్రుమెంటేషన్.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఐటీఐ/ డిప్లొమా ఉత్తీర్ణత.
వయసు: 01.07.2022 నాటికి 18-25 సంవత్సరాల మధ్య ఉండాలి. 02.07.1997 - 01.07.2004 మధ్య జన్మించినవారై ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
2) ఫైర్‌మ్యాన్: 01 పోస్టు
అర్హత: 10వ తరగతి ఉత్తీర్ణత ఉండాలి.
వయసు: 01.07.2022 నాటికి 18-25 సంవత్సరాల మధ్య ఉండాలి. 02.07.1997 - 01.07.2004 మధ్య జన్మించినవారై ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: రూ.600. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.200 చెల్లించాలి.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ రాతపరీక్షలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
పరీక్ష విధానం: మొత్తం 150 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. రెండు విభాగాల (పార్ట్-ఎ, పార్ట్-బి) నుంచి 120 ప్రశ్నలు ఉంటాయి. వీటిలో పార్ట్-ఎ విభాగంలో జనరల్ ఇంగ్లిష్ నుంచి 15 ప్రశ్నలు-15 మార్కులు, అరిథ్‌మెటిక్ ఎబిలిటీ నుంచి 15 ప్రశ్నలు-15 మార్కులు, ఇంగ్లిష్ లాంగ్వేజ్ నుంచి 15 ప్రశ్నలు-15 మార్కులు, జనరల్ ఇంటెలిటిజెన్స్ & రీజనింగ్ నుంచి 15 ప్రశ్నలు-15 మార్కులు ఉంటాయి. ఇక పార్ట్-బి విభాగంలో అభ్యర్థి సబ్జెక్టు నుంచి 60 ప్రశ్నలకు-90 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 120 నిమిషాలు. పరీక్షలో ఎలాంటి నెగెటివ్ మార్కులు ఉండవు. అర్హత మార్కులను జనరల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 55 శాతంగా (82.5 మార్కులు), ఓబీసీ అభ్యర్థులకు 50 శాతంగా (75 మార్కులు), ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 45 శాతంగా (67.5 మార్కులు) నిర్ణయించారు.
ముఖ్యమైన తేదీలు...
* ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.10.2022.
* ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 31.10.2022.
* ఫీజు చెల్లింపు తేదీలు: 01 - 31.10.2022.
* ఆన్‌లైన్ పరీక్ష తేది: నవంబరు/డిసెంబరు, 2022.
Notification
Online Application
Website
Also Read:
ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు, అర్హతలివే!
ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయంచారు. అక్టోబరు 12 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నవంబరు 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
హిందూస్తాన్ కాపర్ లిమిటెడ్‌లో ఇంజినీరింగ్ ఉద్యోగాలు, ఈ అర్హత తప్పనిసరి!
భారత ప్రభుత్వ గనుల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్-కోల్‌కతా వివిధ విభాగాల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 84 గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇంజినీరింగ్ డిగ్రీతోపాటు గేట్-2022/2021 అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అక్టోబర్ 10న ఆన్‌లైన్ దరఖాస్తు పక్రియ ప్రారంభంకానుంది. అక్టోబరు 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఈస్టర్న్ రైల్వేలో 3115 అప్రెంటిస్ పోస్టులు, అర్హతలివే!
కోల్‌కతాలోని తూర్పు రైల్వే , రైల్వే రిక్రూట్‌మెంట్‌సెల్ (ఆర్ఆర్‌సీ) తూర్సు రైల్వే పరిధిలోని వర్క్ షాప్‌లు, డివిజన్‌లలో యాక్ట్ అప్రెంటిస్ శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతుంది. పదోతరగతితోపాటు, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సెప్టెంబరు 30న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. అక్టోబరు 29 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)