అన్వేషించండి

SBI Jobs: ఎస్‌బీఐలో 5,447 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టుల దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?

SBI : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టుల దరఖాస్తు ప్రక్రియను డిసెంబరు 17 వరకు పొడిగించారు. ఇప్పటివరకు దరఖాస్తులు సమర్పించలేని అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.

SBI CBO Recruitment: ముంబయిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేట్ సెంటర్ దేశవ్యాప్తంగా వివిధ ఎస్‌బీఐ సర్కిళ్లలో సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ (CBO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 5,447 పోస్టులను భర్తీ చేయనున్నారు. తెలుగు రాష్ట్రాలలో హైదరాబాద్- 425, అమరావతి- 400 ఖాళీలున్నాయి. ఎంపికైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న సర్కిల్/ రాష్ట్రంలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఈ పోస్టుల భర్తీకి నవంబరు 22న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. డిసెంబరు 12తో గడువు ముగియాల్సి ఉంది. అయితే దరఖాస్తు గడువును డిసెంబరు 17 వరకు పొడిగించారు. ఇప్పటివరకు దరఖాస్తులు సమర్పించలేని అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.750 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది. ఆన్‌లైన్ రాత పరీక్ష, స్క్రీనింగ్ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

వివరాలు..

మొత్తం ఖాళీలు: 5,447 (రెగ్యులర్ ఖాళీలు- 5,280; బ్యాక్‌లాగ్ ఖాళీలు- 167) 

* సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులు

ఎస్‌బీఐ సర్కిళ్లు: అహ్మదాబాద్, అమరావతి, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, నార్త్‌ ఈస్ట్రన్‌, హైదరాబాద్, జైపుర్, లఖ్‌నవూ, కోల్‌కతా, మహారాష్ట్ర, ముంబై మెట్రో, న్యూదిల్లీ, తిరువనంతపురం.

అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి.  బ్యాంకింగ్‌ రంగంలో రెండేళ్ల పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 31.10.2023 నాటికి 21 - 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

దరఖాస్తు ఫీజు: రూ.750. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది. 

ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ రాత పరీక్ష, స్క్రీనింగ్ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.

జీత భత్యాలు: రూ.36,000-రూ.63,840.

తెలుగు రాష్ట్రాల్లోని పరీక్ష కేంద్రాలు: గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్.

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 22.11.2023.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 12.12.2023. (17.12.2023 వరకు పొడిగించారు)  

➥ అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్: జనవరి 2024.

➥ ఆన్‌లైన్ పరీక్ష తేది: జనవరి 2024.

Notification

Online Application

Website

ALSO READ:

యూకో బ్యాంకులో 127 స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పోస్టులు, ఎంపిక ఇలా
కోల్‌కతాలోని యూకో బ్యాంకు, స్పెషలిస్ట్ ఆఫీసర్స్ (Specialist Officers) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 127 మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, చీఫ్ మేనేజర్, సీనియర్ మేనేజర్ పోస్టులను భర్తీచేయనున్నారు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.800 చెల్లించి డిసెంబరు 27లోగా దరఖాస్తులు పంపాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీలకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.  
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

బ్యాంక్ ఆఫ్ బరోడాలో 250 సీనియర్ మేనేజర్ పోస్టులు, ఈ అర్హతలుండాలి
ముంబయిలోని బ్యాంక్ ఆఫ్ బరోడా ఎంఎస్‌ఎంఈ (BOB MSME) విభాగంలో రెగ్యులర్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 250 సీనియర్ మేనేజర్ (Senior Manager) పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టుల భర్తీకి డిసెంబరు 6న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. డిసెంబరు 26 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి... 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tadipatri Tension: తాడిపత్రిలో వైసీపీ నేత ఇంటిపై దాడి - తీవ్ర ఉద్రిక్తత
తాడిపత్రిలో వైసీపీ నేత ఇంటిపై దాడి - తీవ్ర ఉద్రిక్తత
Revanth And KTR: బీజేపీపై పోరాటానికి చేతులు కలపనున్న కేటీఆర్,రేవంత్ - స్టాలిన్ సమావేశమే వేదిక!
బీజేపీపై పోరాటానికి చేతులు కలపనున్న కేటీఆర్,రేవంత్ - స్టాలిన్ సమావేశమే వేదిక!
YS Viveka Case: వివేకా హత్య కేసులో సీబీఐకి తెలంగాణ హైకోర్టు నోటీసులు - కేసును 6 నెలల్లోతేల్చాలని సునీత పిటిషన్
వివేకా హత్య కేసులో సీబీఐకి తెలంగాణ హైకోర్టు నోటీసులు - కేసును 6 నెలల్లోతేల్చాలని సునీత పిటిషన్
Telangana: సీఎం రేవంత్‌తో మల్లారెడ్డి, హరీష్ రావు సమావేశాలు - అలాంటిదేమీ లేదని వివరణ
సీఎం రేవంత్‌తో మల్లారెడ్డి, హరీష్ రావు సమావేశాలు - అలాంటిదేమీ లేదని వివరణ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

IPL 2025 Captain's Meet | రేపటి నుంచే ఐపీఎల్ మహా సంగ్రామం ప్రారంభం | ABP DesamHyderabad to host Miss World pageant |  మే 7-31 వరకూ తెలంగాణ వేదిక మిస్ ఇండియా పోటీలు | ABP DesamChahal Dhanashree Verma Divorce | చాహల్ ధనశ్రీకి విడాకులు మంజూరు చేసిన కోర్ట్ | ABP DesamVidya Veerappan Political Career | రాజకీయాల్లో వీరప్పన్ కూతురు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tadipatri Tension: తాడిపత్రిలో వైసీపీ నేత ఇంటిపై దాడి - తీవ్ర ఉద్రిక్తత
తాడిపత్రిలో వైసీపీ నేత ఇంటిపై దాడి - తీవ్ర ఉద్రిక్తత
Revanth And KTR: బీజేపీపై పోరాటానికి చేతులు కలపనున్న కేటీఆర్,రేవంత్ - స్టాలిన్ సమావేశమే వేదిక!
బీజేపీపై పోరాటానికి చేతులు కలపనున్న కేటీఆర్,రేవంత్ - స్టాలిన్ సమావేశమే వేదిక!
YS Viveka Case: వివేకా హత్య కేసులో సీబీఐకి తెలంగాణ హైకోర్టు నోటీసులు - కేసును 6 నెలల్లోతేల్చాలని సునీత పిటిషన్
వివేకా హత్య కేసులో సీబీఐకి తెలంగాణ హైకోర్టు నోటీసులు - కేసును 6 నెలల్లోతేల్చాలని సునీత పిటిషన్
Telangana: సీఎం రేవంత్‌తో మల్లారెడ్డి, హరీష్ రావు సమావేశాలు - అలాంటిదేమీ లేదని వివరణ
సీఎం రేవంత్‌తో మల్లారెడ్డి, హరీష్ రావు సమావేశాలు - అలాంటిదేమీ లేదని వివరణ
APPSC: 'గ్రూప్‌-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్‌ పరీక్షల షెడ్యూలు వెల్లడి- ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
'గ్రూప్‌-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్‌ పరీక్షల షెడ్యూలు వెల్లడి- ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Telangana Weather Update: తెలంగాణలో మరో రెండు రోజులు వర్షాలు- అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు 
తెలంగాణలో మరో రెండు రోజులు వర్షాలు- అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు 
Hari Hara Veera Mallu: పవన్ 'హరిహర వీరమల్లు' టీం నుంచి బిగ్ అప్ డేట్ - ఈ డేట్ మార్క్ చేసుకోండి అంటూ ఫుల్ క్లారిటీ ఇచ్చేశారుగా..
పవన్ 'హరిహర వీరమల్లు' టీం నుంచి బిగ్ అప్ డేట్ - ఈ డేట్ మార్క్ చేసుకోండి అంటూ ఫుల్ క్లారిటీ ఇచ్చేశారుగా..
Uttar Pradesh Crime News: భర్త మొండెంపైనే నిద్రపోయిన భార్య- తల తీసుకెళ్లిన ప్రియుడు- మీరట్ హత్య కేసులో విస్తుగొలిపే విషయాలు
భర్త మొండెంపైనే నిద్రపోయిన భార్య- తల తీసుకెళ్లిన ప్రియుడు- మీరట్ హత్య కేసులో విస్తుగొలిపే విషయాలు 
Embed widget