(Source: ECI/ABP News/ABP Majha)
UCO Bank Notification: యూకో బ్యాంకులో 127 స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పోస్టులు, ఎంపిక ఇలా
UCO Bank: కోల్‌కతాలోని యూకో బ్యాంకు, స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, చీఫ్ మేనేజర్, సీనియర్ మేనేజర్ పోస్టులను భర్తీచేయనున్నారు.
UCO Bank Recruitment Notification: కోల్‌కతాలోని యూకో బ్యాంకు, స్పెషలిస్ట్ ఆఫీసర్స్ (Specialist Officers) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 127 మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, చీఫ్ మేనేజర్, సీనియర్ మేనేజర్ పోస్టులను భర్తీచేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు, అనుభవం నిర్ణయించారు. ఒప్పంద ప్రాతిపదికన ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. సరైన అర్హతలున్నవారు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.800 చెల్లించి డిసెంబరు 27లోగా దరఖాస్తులు పంపాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీలకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
వివరాలు..
* స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పోస్టులు
ఖాళీల సంఖ్య: 127
పోస్టుల కేటాయింపు: జనరల్(యూఆర్)-82, ఈడబ్ల్యూఎస్-07, ఓబీసీ-25, ఎస్టీ-03, ఎస్సీ-10.
➥ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (డిజిటల్ లెండింగ్): 01
➥ చీఫ్ మేనేజర్ (ఫిన్‌టెక్ మేనేజ్‌మెంట్): 01
➥ చీఫ్ మేనేజర్ (డిజిటల్ మార్కెటింగ్): 01
➥ సీనియర్ మేనేజర్ నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేషన్: 02
➥ మేనేజర్ నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేషన్: 08
➥ సీనియర్ మేనేజర్ (డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్): 02
➥ మేనేజర్ - డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్: 03
➥ సీనియర్ మేనేజర్ (మర్చంట్ ఆన్‌బోర్డిగ్): 01
➥ మేనేజర్ (మర్చంట్ ఆన్‌బోర్డింగ్): 03
➥ అసిస్టెంట్ మేనేజర్ (మర్చంట్ ఆన్‌బోర్డింగ్): 02
➥ సీనియర్ మేనేజర్ (ఇన్నోవేషన్ & ఎమర్జింగ్ టెక్నాలజీ): 01
➥ మేనేజర్ (ఇన్నోవేషన్ & ఎమర్జింగ్ టెక్నాలజీ): 03
➥ అసిస్టెంట్ మేనేజర్ (ఇన్నోవేషన్ & ఎమర్జింగ్ టెక్నాలజీ): 02
➥ సీనియర్ మేనేజర్ (సాఫ్ట్‌వేర్ డెవలపర్): 02
➥ మేనేజర్ (సాఫ్ట్‌వేర్ డెవలపర్): 13
➥ మేనేజర్ (ఎంఐఎస్ & రిపోర్ట్ డెవలపర్): 06
➥ మేనేజర్ (డేటా అనలిస్ట్): 04
➥ మేనేజర్ (డేటా సైంటిస్ట్): 04
➥ ఫైర్ ఆఫీసర్: 01
➥ మేనేజర్ (ఎకనమిస్ట్): 04
➥ మేనేజర్ (లా): 13
➥ మేనేజర్ (క్రెడిట్): 50
అర్హత: పోస్టును అనుసరించి సీఏ/సీఎంఏ, డిగ్రీ, పీజీ, పీజీడీఎం/పీజీడీబీఎం ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
దరఖాస్తు ఫీజు: రూ.800. ఎస్సీ, ఎస్టీలకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. కింది వివరాల ఆధారంగా ఫీజు చెల్లించాలి.
➛ బ్యాంకు అకౌంట్ పేరు: UCO BANK CONTRACTUAL RECRUITMENT PROJECT 2023
➛ అకౌంట్ నెంబరు: 01900210020081
➛ బ్రాంచ్: UCO Bank, Kolkata Main
➛ అకౌంట్ టైప్: కరెంట్ అకౌంట్
➛ IFSC కోడ్: UCBA0000190
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆఫ్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 27.12.2023.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
General Manager,
UCO Bank, Head Office, 4th Floor, H. R. M Department,
10, BTM Sarani, Kolkata, West Bengal – 700 001.
ALSO READ:
బ్యాంక్ ఆఫ్ బరోడాలో 250 సీనియర్ మేనేజర్ పోస్టులు, ఈ అర్హతలుండాలి
ముంబయిలోని బ్యాంక్ ఆఫ్ బరోడా ఎంఎస్‌ఎంఈ (BOB MSME) విభాగంలో రెగ్యులర్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 250 సీనియర్ మేనేజర్ (Senior Manager) పోస్టులను భర్తీ చేయనుంది. డిగ్రీ లేదా పీజీ అర్హతతోపాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తుకు అర్హులు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.600 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు రూ.100 చెల్లిస్తే సరిపోతుంది. ఈ పోస్టుల భర్తీకి డిసెంబరు 6న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. డిసెంబరు 26 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..