అన్వేషించండి

Railway Apprentice: నార్త్ ఈస్ట్రన్‌ రైల్వేలో 1104 యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు, వీరు అర్హులు

NER RRC Apprentice: నార్త్ ఈస్ట్రన్ రైల్వే పరిధిలో యాక్ట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. ఐటీఐ అర్హత ఉన్నవారు జులై 11లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.

North Eastern Railway RRC Apprentice Recruitment: గోరఖ్‌పూర్‌లోని రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (RRC) నార్త్ ఈస్ట్రన్ రైల్వే (NER) పరిధిలోని వివిధ వర్క్‌షాప్/ యూనిట్లలో అప్రెంటిస్ శిక్షణకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 1104 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పదోతరగతితోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. నార్త్ ఈస్ట్రన్ రైల్వే పరిధికి సంబంధించి గోరఖ్‌పూర్‌లో మెకానికల్ వర్క్‌షాప్,  గోరఖ్‌పూర్ కంటోన్మెంట్‌‌లో సిగ్నల్ వర్క్‌షాప్, బ్రిడ్జ్ వర్క్‌షాప్ ఖాళీలు ఉన్నాయి, అలాగే ఇజ్జత్‌నగర్‌లో మెకానికల్ వర్క్‌షాప్, డీజిల్ షెడ్, క్యారేజ్ అండ్‌ వ్యాగన్ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. వీటితోపాటు క్యారేజ్ అండ్‌ వ్యాగన్ (లఖ్‌నవూ జంక్షన్), డీజిల్ షెడ్ (గోండా), క్యారేజ్ అండ్‌ వ్యాగన్ (వారణాసి) యూనిట్‌లో ఖాళీలు ఉన్నాయి. సరైన అర్హతలున్న అభ్యర్థులు జులై 11 వరకు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.

వివరాలు..

* యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు

ఖాళీల సంఖ్య: 1104 

పోస్టుల కేటాయింపు: యూఆర్ (జనరల్)-454, ఈడబ్ల్యూఎస్-110, ఎస్సీ-165, ఎస్టీ-81, ఓబీసీ-294. మొత్తం ఖాళీల్లో ఎక్స్-సర్వీస్‌మెన్-34, దివ్యాంగులు-44 పోస్టులు కేటాయించారు.

శిక్షణ కాలం: ఏడాది.

వర్క్‌షాప్/ యూనిట్: మెకానికల్ వర్క్‌షాప్ (గోరఖ్‌పూర్), సిగ్నల్ వర్క్‌షాప్ (గోరఖ్‌పూర్ కంటోన్మెంట్‌), బ్రిడ్జ్ వర్క్‌షాప్ (గోరఖ్‌పూర్ కంటోన్మెంట్‌), మెకానికల్ వర్క్‌షాప్ (ఇజ్జత్‌నగర్), డీజిల్ షెడ్ (ఇజ్జత్‌నగర్), క్యారేజ్ అండ్‌ వ్యాగన్ (ఇజ్జత్‌నగర్), క్యారేజ్ అండ్‌ వ్యాగన్ (లఖ్‌నవూ జంక్షన్), డీజిల్ షెడ్ (గోండా), క్యారేజ్ అండ్‌ వ్యాగన్ (వారణాసి).

వర్క్‌షాప్/ యూనిట్‌ల వారీగా ఖాళీలు..

⫸ మెకానికల్ వర్క్‌షాప్ (గోరఖ్‌పూర్): 411 పోస్టులు
విభాగాలవారీగా ఖాళీలు: ఫిట్టర్-140, వెల్డర్-62, ఎలక్ట్రీషియన్-17, కార్పెంటర్-89, పెయింటర్-87, మెషినిస్ట్-16.  

⫸ సిగ్నల్ వర్క్‌షాప్ (గోరఖ్‌పూర్ కంటోన్మెంట్): 63 పోస్టులు 
విభాగాలవారీగా ఖాళీలు: ఫిట్టర్-31, వెల్డర్-08, టర్నర్-15, కార్పెంటర్-03, మెషినిస్ట్-06.  

⫸ బ్రిడ్జ్ వర్క్‌షాప్ (గోరఖ్‌పూర్ కంటోన్మెంట్): 35 పోస్టులు 
విభాగాలవారీగా ఖాళీలు: ఫిట్టర్-21, వెల్డర్-11, మెషినిస్ట్-03.  

⫸ మెకానికల్ వర్క్‌షాప్ (ఇజ్జత్ నగర్): 151 పోస్టులు
విభాగాల వారీగా ఖాళీలు: ఫిట్టర్-39, వెల్డర్-30, ఎలక్ట్రీషియన్-32, కార్పెంటర్-39, పెయింటర్-11.  

⫸ డీజిల్ షెడ్ (ఇజ్జత్ నగర్): 60 పోస్టులు
విభాగాల వారీగా ఖాళీలు: ఎలక్ట్రీషియన్-30, మెకానికల్ డీజిల్-30.

⫸ క్యారేజ్ అండ్ వ్యాగన్ (ఇజ్జత్ నగర్): 64 పోస్టులు
విభాగాల వారీగా ఖాళీలు:  ఫిట్టర్-64.

⫸ క్యారేజ్ అండ్ వ్యాగన్ (లక్నో జంక్షన్): 155 పోస్టులు
విభాగాలవారీగా ఖాళీలు: ఫిట్టర్-120, వెల్డర్-06, ట్రిమ్మర్-06, కార్పెంటర్-11, పెయింటర్-06, మెషినిస్ట్-06.  

⫸ డీజిల్ షెడ్ (గోండా): 90 పోస్టులు
విభాగాలవారీగా ఖాళీలు: ఫిట్టర్-13, వెల్డర్-02, ఎలక్ట్రీషియన్-20, మెకానిక్ డీజిల్-55.  

⫸ క్యారేజ్ అండ్ వ్యాగన్ (వారణాసి): 75 పోస్టులు
విభాగాలవారీగా ఖాళీలు: ఫిట్టర్-66, వెల్డర్-02, కార్పెంటర్-03, ట్రిమ్మర్-02, పెయింటర్-02.

అర్హత: కనీసం 50 శాతం మార్కులతో పదోతరగతి, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. 

వయోపరిమితి: 12.06.2024 నాటికి 15 - 24 సంవత్సరాల మధ్య ఉండాలి.

దరఖాస్తు ఫీజు: రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈడబ్ల్యూఎస్‌, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.  

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: మెట్రిక్యులేషన్, ఐటీఐ పరీక్షల్లో సాధించిన మార్కుల ఆధారంగా. 

స్టైపెండ్: ఎంపికైనవారికి నిబంధనల మేరకు శిక్షణ కాలంలో స్టైపెండ్ చెల్లిస్తారు. 

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 11.07.2024.

Notification

Online Application

Website

ALSO READ: ఇండియన్ కోస్ట్‌గార్డులో 320 నావిక్, యాంత్రిక్ పోస్టులు

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Jio New Plan: ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సచ్చిపోదామని యాసిడ్ తాగినా!! ఇతని స్టోరీకి కన్నీళ్లు ఆగవు!బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Jio New Plan: ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
Group 3 Exams: భార్యకు పరీక్ష, భర్తకు బాధ్యత - గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద వైరల్ 'సిత్రాలు'
భార్యకు పరీక్ష, భర్తకు బాధ్యత - గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద వైరల్ 'సిత్రాలు'
Pushpa 2 Trailer: మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Nara Rammurthy Naidu: సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
Embed widget