RRB Group D 2022: రైల్వే పరీక్ష ఇంటిమేషన్ స్లిప్స్ వచ్చేశాయ్, హాల్‌టికెట్లు ఎప్పుడంటే?
హాల్‌టికెట్ డౌన్‌లోడ్, పరీక్ష కేంద్రం, పరీక్ష తేదీలు, పరీక్ష సమయం వంటి వివరాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు. అభ్యర్థుల వ్యక్తిగత ఈమెయిల్‌కి కూడా ఈ వివరాలు చేరవేస్తారు.
RRB గ్రూప్-డి మొదటిదశ సీబీటీ (ఫేజ్-1) పరీక్షల తేదీలను రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు ప్రకటించింది. ఆగస్టు 17 నుంచి 25 వరకు గ్రూప్-డి సీబీటీ-1 పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపింది. పరీక్ష తేదీలతోపాటు ఎగ్జామ్ సిటీ ఇంటిమేషన్ స్లిప్‌ను కూడా రైల్వే అధికారులు విడుదల చేశారు. అభ్యర్థులు వారివారి సంబంధిత రైల్వే జోన్లకు సంబంధించిన వెబ్‌సైట్ ద్వారా పరీక్ష తేదీ, సిటీ ఇంటిమేషన్ స్లిప్ వివరాలు పొందవచ్చు.
ఎస్సీ, ఎస్టీ కేటగిరీ అభ్యర్థుల కోసం ట్రావెల్ అథారిటీని డౌన్‌లోడ్ చేసుకునే లింక్ వివరాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. దీంతోపాటు అభ్యర్థులు తమ పరీక్ష నగరం, పరీక్ష తేదీని కూడా చూసుకోవచ్చు. ఇక పరీక్ష జరిగే రోజుకు నాలుగు రోజుల ముందు అడ్మిట్ కార్డులను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు ఆగస్టు 12 నుంచి అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పరీక్ష సమయంలో ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ హాజరు తీసుకుంటారు.
Click Here for Exam, City Slip for CBT Phase-1
Website
ఆర్‌ఆర్‌బీ గ్రూప్-డి నోటిఫికేషన్ ద్వారా రైల్వేలో లెవల్-1 కింద 1,03,769 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో జనరల్-42,355; ఎస్సీ-15,559, ఎస్టీ-7,984, ఓబీసీ-27,378; ఈడబ్ల్యూఎస్-10,381 పోస్టులను కేటాయించారు.
Also Read: ఏపీలో 2,318 పారా మెడికల్ పోస్టులు, పూర్తి వివరాలు ఇలా!!
పరీక్ష విధానం:
అర్హులైన అభ్యర్థులకు మొదటి దశలో కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షకు సంబంధించిన వివరాలను వెబ్‌సైట్‌లో తెలియపరుస్తారు. హాల్‌టికెట్ డౌన్‌లోడ్, పరీక్ష కేంద్రం, పరీక్ష తేదీలు, పరీక్ష సమయం వంటి వివరాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు. అభ్యర్థుల వ్యక్తిగత ఈమెయిల్‌కి కూడా ఈ వివరాలు చేరవేస్తారు.
✪ మొత్తం 100 మార్కులకు ఆన్‌లైన్ (సీబీటీ) పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 100 ప్రశ్నలు ఇస్తారు. వీటిలో జనరల్ సైన్స్ నుంచి 25 ప్రశ్నలు, మ్యాథమెటిక్స్ నుంచి 25 ప్రశ్నలు, జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్ నుంచి 30 ప్రశ్నలు, జనరల్ అవేర్‌నెస్ & కరెంట్ అఫైర్స్ నుంచి 20 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు.
Also Read: టెన్త్ అర్హతతో కానిస్టేబుల్ ఉద్యోగాలు, పూర్తి వివరాలు ఇవే!
✪ పరీక్ష సమయాన్ని దివ్యాంగులకు 120 నిమిషాలు, ఇతరులకు 90 నిమిషాలుగా నిర్ణయించారు.
✪ పరీక్షలో నెగెటివ్ మార్కులు కూడా ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కుల చొప్పున కోత విధిస్తారు.
✪ అర్హత మార్కులను జనరల్-40%, ఈడబ్ల్యూఎస్-40%, ఓబీసీ-30%, ఎస్సీ-30%, ఎస్టీ-30% గా నిర్ణయించారు.
✪ దివ్యాంగులకు అదనంగా 2% మినహాయింపునిచ్చారు.
సీబీటీ మాక్‌టెస్ట్ - Click Here for Mock Test Link for CBT
సీబీటీ హెల్ప్ డెస్క్- Click Here for Help Desk Link for CBT
సీబీటీ కోసం అప్లికేషన్ ఫర్గాట్ రిజిస్ట్రేషన్ నంబర్ లింక్ కోసం -
Click Here for Application Forgot Registration Number Link for CBT
RRB Group D Syllabus:
Mathematics:
Number System, Decimals, LCM, Ratio & Proportion, Mensuration, Time & Distance, Profit & Loss, Geometry & Trigonometry, Square Root, Calendar & Clock, BODMAS, Fractions, HCF, Percentages, Time & Work, SI- CI, Algebra, Elementary Statistics, Age Calculations, Pipes & Cisterns
General Intelligence and reasoning:
Reasoning, Analogies, Coding-Decoding, Relationships, Jumbling ,DI & Sufficiency ,Similarities & Differences, Classifications, Statement- Argument & Assumptions, Alphabetical Series, Mathematical Operations, Syllogisms, Venn Diagram, Conclusion, Decision Making, Numerical Series, Analytical Reasoning, Directions
General Science:
The syllabus under this shall cover questions from the below subject and the level of questions would be 10th standard level (CBSE).
- Physics, Chemistry, Life Sciences
General Awareness and Current Affairs
General Awareness and Current Affairs in Science & Technology, Sports, Culture, Personalities, Economics, Politics and any other subject of importance